📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Home Blog Page 3

అనాథ యువకుడికి అండగా నిలిచిన పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి-చికిత్స కోసం రూ. 10,000 ఆర్థిక సాయం అందజేత

0
Oplus_16908288

అమీన్‌పూర్,ఆగస్టు,19,మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి.తల్లిదండ్రులు లేక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అనాథ యువకుడికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి పెద్ద మనసుతో అండగా నిలిచారు.సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శశి అనే యువకుడి దీనస్థితి తెలుసుకున్న ఉపేందర్ రెడ్డి చలించిపోయారు. అమ్మానాన్నలు లేకపోవడంతో పాటు ఆసుపత్రి ఖర్చులకు ఇబ్బంది పడుతున్న ఆ యువకుడి వైద్య చికిత్స నిమిత్తం తన వంతుగా ₹10,000/- (పది వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆపదలో ఉన్న తమను మానవతా దృక్పథంతో ఆదుకున్నందుకు యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు పట్లోళ్ల ఉపేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన సేవా గుణాన్ని పలువురు స్థానికులు ప్రశంసించారు.

ప్రభుత్వ డ్యూటీనా..సొంత హాస్పిటల్‌లో సేవలా?

0
Oplus_16908288

ప్రభుత్వ డ్యూటీనా..సొంత హాస్పిటల్‌లో సేవలా?

చిన్నపిల్లల వైద్యుడి వ్యవహారంపై ప్రశ్నలు.. పుష్ప హాస్పిటల్‌లోనే ఎక్కువ సమయం?

మెదక్,ఆగస్టు,18,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)

ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికే పుష్ప హాస్పిటల్‌కు యాజమాన్య సంబంధం ఉందని, అక్కడ కూడా వైద్యం అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించే సమయంలోనే సొంత ప్రైవేట్ హాస్పిటల్‌లోనూ వైద్యం ఎలా అందిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుష్ప హాస్పిటల్ వద్ద తరచూ పేషెంట్లు కనిపిస్తుండటంతో.. ప్రభుత్వ ఆస్పత్రి కంటే సొంత హాస్పిటల్‌లోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆస్పత్రి డ్యూటీ, మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం—రెండు చోట్ల విధులు ఎలా సాధ్యమవుతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఈ ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ జరిపి, డాక్టర్ డ్యూటీ సమయాలు, హాజరు రికార్డులు, ప్రైవేట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన నిబంధనలు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.

మండలాల్లోనే ఇక ప్రజావాణి-జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్

0

ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహణ.

మెదక్,ఆగస్టు,16,మెదక్ టుడే న్యూస్:ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలు, వినతుల దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో అందజేయాలని సూచించారు.ప్రజావాణికి అన్ని శాఖల మండలస్థాయి అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలోనే నిర్వహిస్తున్నందున సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

రిమ్స్ లో బాధితుడిని పరామర్శించిన న్యాయవాది పంద్రం శంకర్

0

ఈరోజు బోథ్ మండలం పిప్పల్దారి గ్రామనికి చెందిన సిద్దార్థ ఇటీవలే అనారోగ్యంతో రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్ యందు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న న్యాయవాది పంద్రం శంకర్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈకార్యక్రమం లో కరాత్వడ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు కనక అమృత్ రావు తోడషం విజయ్ కుమార్ పాల్గొన్నారు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానమా?

0

జాతీయ పతాకావిష్కరణలో అధికారుల నిర్లక్ష్యం!

కిందికి దించి.. పైకి ఎగురవేత!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానమా?

కస్తూర్బా పాఠశాల, వ్యవసాయ శాఖ కార్యాలయంలోనూ ఇదే తీరపాపన్నపేట,ఆగస్టు,15,మెదక్ టుడే న్యూస్:స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాపన్నపేటలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జాతీయ జెండాను ముందుగా కిందికి దించి అనంతరం పైకి. ఎగరవేసి,ఇదే తరహాలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలోనూ జాతీయ పతాకావిష్కరణ విషయంలో అధికారులు కనీస నిబంధనలు, సంప్రదాయాలను పాటించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ పతాకానికి గౌరవం దక్కేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపూర్ నర్సింగ్ రావు

0

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపూర్ నర్సింగ్ రావు


అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలాపూర్ నర్సింగ్ రావు తన జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డిని, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నీ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఐలాపూర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ అడుగుజాడల్లోనే నడుస్తానని, వారు ఏ విధంగా సూచిస్తే ఆ మార్గంలో పార్టీ బలోపేతం కోసం ఎల్లవేళలా సైనికుడిలా పని చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్, హరీష్ రావు , కేటీఆర్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.తన పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్, చంద్రశేఖర్, కొల్లూరి గోపాల్, పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని నర్సింగ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మధురానగర్ లో సెట్బ్యాక్స్ గాలికొదిలి.. అనుమతులు లేని షట్టర్లు.. అధికారుల మౌనం వెనుక మతలబు ఏంటి?

0

మధురానగర్ లో సెట్బ్యాక్స్ గాలికొదిలి.. అనుమతులు లేని షట్టర్లు..అధికారుల మౌనం వెనుక మతలబు ఏంటి?

అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని మధురా నగర్ కాలనీలో బిల్డర్లు నిబంధనలను కాలరాస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సెట్ బ్యాక్స్ వదలకుండా, ఎలాంటి అనుమతులు లేని అనధికార షట్టర్లను సైతం యథేచ్ఛగా నిర్మిస్తుండటంతో స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం,సామాన్యులు చిన్నపాటి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే చాలు… వెంటనే రంగ ప్రవేశం చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు, నిర్మాణాలను ఆపేసి హడావుడి చేస్తుంటారు. కానీ, కోట్లు విలువ చేసే అక్రమ నిర్మాణాలను, అనుమతులు లేని షట్టర్లను బిల్డర్లు కడుతుంటే మాత్రం అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అక్రమాలకు అధికారులే మద్దతా?బిల్డర్లు ఇంత బరితెగించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు, కాలనీవాసులు నిలదీస్తున్నారు. అధికారుల ఉదాసీన వైఖరి చూస్తుంటే.అక్రమ నిర్మాణాలకు వారే పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.*తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్,ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి, మయూరి నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అనధికార షట్టర్లు మరియు నిర్మాణాలపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని, లంచాలకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

అట్టహాసంగా ఐలాపూర్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు.. తరలివచ్చిన అభిమానులు, నాయకులు

0

అట్టహాసంగా ఐలాపూర్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు.. తరలివచ్చిన అభిమానులు, నాయకులు.

అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్: (ప్రతినిధి)ఐలాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు వారి నివాసంలో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉమ్మడి ప్రాంతం నుంచి వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి నర్సింగ్ రావు గారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పాపన్నపేటలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

0
  • మెదక్ టుడే న్యూస్ అగస్ట్ :-12(ప్రతినిధి పి దుర్గేష్ గౌడ్ )పాపన్నపేట: భారత్ మాతాకీ జై నినాదాలతో పాపన్నపేట మండల కేంద్రం మార్మోగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షులు వద్ద సంతోష్ చారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిష్టానుసారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పాపన్నపేట పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు.
    దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమం పాపన్నపేటలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

వడియారం గ్రామంలో భక్తి శోభతో పలారం బండి ఊరేగింపు.

0

డప్పు చప్పుళ్లు, భజనలతో మారుమోగిన గ్రామం

చేగుంట,ఆగస్టు,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో సోమవారం పలారం బండి ఊరేగింపు కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవంలో గ్రామ యువకులు, మహిళలు, పెద్దలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పూలు, రంగురంగుల అలంకరణలతో తయారుచేసిన పలారం బండిని గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలు, భజనలతో గ్రామమంతా ఉత్సవ శోభ సంతరించుకుంది. కాషాయ కండువాలు ధరించిన భక్తులు “అమ్మవారికి జై” అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపును విజయవంతం చేశారు.గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరిలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో శివ పంచాయతన కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ గ్రామ కమిటీ సభ్యులు, యువకులను గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.