📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Home Blog

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం.

0

నక్సల్స్‌ దాడిలో అమరులైన ఐదుగురు పోలీసులకు ఘన నివాళి

పాపన్నపేట,సెప్టెంబర్,13,మెదక్ టుడే న్యూస్:
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 1999 సెప్టెంబర్ 13న పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌పై జరిగిన నక్సల్స్‌ దాడిలో అమరులైన పోలీసులను ఆదివారం స్మరించుకున్నారు.పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.నాటి దాడిలో హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునందన్‌తో పాటు కానిస్టేబుళ్లు అబిద్‌ హుస్సేన్‌, ప్రసాద్‌, నర్సింలు, రాంచందర్‌ వీరమరణం పొందారు.వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా సన్మానించారు.ఈసందర్భంగా ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ..విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు.ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన అమరవీరుల త్యాగాలు పోలీసు శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఏఎస్సై తుక్కయ్య, కానిస్టేబుళ్లు అనిల్‌, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌లో అండర్‌-18 ఖో ఖో పోటీలు ఘనంగా ప్రారంభం.

0

ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 348 మంది క్రీడాకారుల హాజరు

నర్సాపూర్, సెప్టెంబర్ 12, మెదక్ టుడే న్యూస్:
ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్‌-18 ఖో ఖో పోటీలు శనివారం నర్సాపూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 348 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ పోటీలను పీఆర్‌టీయూ మెదక్ జిల్లా సెక్రటరీ సామ్యా నాయక్, టీజీడబ్ల్యూఆర్‌జేసీ ప్రిన్సిపాల్ బసవరాజు, ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్, ట్రెజరర్ నాగ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ,విద్యార్థుల్లో క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులు, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఖబడ్దార్!

0

ఎర్రవల్లి ఘటనపై భగ్గుమన్న పటాన్‌చెరు కాంగ్రెస్ శ్రేణులు

దేవానందం ఆధ్వర్యంలో ఘాటుగా విలేకరుల సమావేశం

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ సీనియర్ నేత దేవానందం డిమాండ్

పటాన్‌చెరు,సెప్టెంబర్,11,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులపై బీఆర్‌ఎస్ నాయకులు ప్రదర్శించిన కుల వివక్ష, అహంకారపూరిత వైఖరిపై పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దళితులు నడిచిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో కడిగి ‘శుద్ధి’ చేయడం ప్రజాస్వామ్య సమాజంలో అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవానందం ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలో విస్తృత స్థాయి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవానందం మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ నాయకుల భూస్వామ్య, ఫ్యూడల్ అహంకారం ఎర్రవల్లి ఘటనతో మరోసారి బట్టబయలైందని తీవ్రంగా దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ పౌరులందరికీ సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పిస్తే, బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం దళితులను అపవిత్రులుగా చూస్తూ, రాక్షస జాతితో పోల్చడం క్షమించరాని నేరమన్నారు. ఒక వర్గాన్ని ఇలా బహిరంగంగా కించపరచడం వారి నీచ మనస్తత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వెంటనే రాష్ట్ర దళిత సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని దేవానందం డిమాండ్ చేశారు. అలాగే రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. దళిత వర్గానికి చెందిన నాయకుడు అత్యున్నత సభాధ్యక్ష స్థానంలో ఉండటాన్ని బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తెలంగాణవ్యాప్తంగా దళిత, ప్రజా సంఘాలను ఏకం చేసి బీఆర్‌ఎస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వకుండా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ భరత్, నాయకులు యాదగిరి, జైశ్రీ, మహేష్, శంకరయ్య, పీటర్, నాగేష్, చంద్రయ్య, ప్రవీణ్, రవి, సందీప్, హనుమంతు, కిరణ్, శ్రీను, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

గురువులకు ఘన సత్కారం-ఉప సర్పంచ్ రఫీ ఆత్మీయ సన్మానం.

0

చేగుంట, సెప్టెంబర్ 09 మెదక్ టుడే న్యూస్:బావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని ప్రముఖులు పేర్కొన్నారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అయిత రఘురాములు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రజనకు రామచంద్రం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి, కలాలను (పెన్నులు) బహూకరించి అభినందనలు తెలిపారు.నిస్వార్థంగా విద్యను పంచుతూ సమాజాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న గురువులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అతిథులు అన్నారు.కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

విధి నిర్వహణలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందం మృతి.

0
Oplus_16908288

తూప్రాన్‌లో ఛాతినొప్పితో కుప్పకూలి.. మేడ్చల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత

సహచరుల్లో విషాదం.. నేడు మల్కాపూర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

మెదక్,సెప్టెంబర్,8,మెదక్ టుడే న్యూస్:విధి నిర్వహణకు వెళ్లిన మెదక్‌ జిల్లా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్యూఆర్టీలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందం (54) ఆకస్మికంగా మృతి చెందారు. మంగళవారం చెక్‌పోస్ట్‌ విధుల నిమిత్తం తూప్రాన్‌ వెళ్లిన ఆయనకు అక్కడ ఛాతినొప్పి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.వైద్యులు ఈసీజీ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే సీపీఆర్‌ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మేడ్చల్‌లోని మెడినోవా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆనందం మృతి చెందారు.ఆనందం అందరితో కలిసిమెలిసి, సరదాగా ఉంటూ సహచరులతో ఆత్మీయంగా మెలిగేవారని తోటి సిబ్బంది తెలిపారు. విధుల్లో చురుగ్గా ఉంటూ సహచరులకు అందుబాటులో ఉండేవారని పేర్కొన్నారు. ఆయన మృతివార్తతో పోలీసు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనందంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందం మృతిపట్ల జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసు శాఖకు ఆనందం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.బుధవారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌ గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్: కేసీఆర్.

0

– ఎర్రవల్లిలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

– అసెంబ్లీ వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం
– ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపు
– జలాలు, రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని సూచన

సిద్దిపేట,సెప్టెంబర్,6,మెదక్ టుడే న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఆయన అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాడాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్, తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందనే భయంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన సరిగా నిర్వహించలేకపోతున్న ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వేదికలను రాజకీయ ఆరోపణలకు ఉపయోగించడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాల అంశంపై బీఆర్ఎస్ సభ్యులు ఉధృతంగా పోరాడాలని సూచించారు. రైతులకు అవసరమైన సాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ అంశాన్ని అసెంబ్లీలో బలంగా ప్రస్తావించాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వైఖరిని ప్రజల ముందుంచాలని పిలుపునిచ్చారు.
కాలేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టుల నిర్వహణపై కూడా కేసీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టుల పనితీరు, నీటి వినియోగం, సాగునీటి పంపిణీ అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు పార్టీ సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్ సూచించారు. ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొని ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆదేశించారు. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఉభయసభల్లో ఎండగట్టాలని, ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని అన్నారు. సభల్లో బీఆర్ఎస్ వైఖరి ప్రజా ప్రయోజనాలకే అంకితమై ఉండాలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రజల అజెండానే బీఆర్ఎస్ అజెండా కావాలని కేసీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, సాగునీరు, సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ సభ్యులకు సూచించారు.రానున్న సమావేశాల్లో ప్రజల సమస్యలను బలంగా వినిపిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

చేగుంటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ పరీక్షలు.

0

చేగుంట,సెప్టెంబర్,5,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోలయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి గవర్నర్ లయన్ డా.ఎం.విజయలక్ష్మి ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో డయాబెటిక్ పర్మినెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా చేగుంట పట్టణంలోని గణేష్ హాస్పిటల్ లో ఉచిత డయాబెటిక్ పరీక్షలు నిర్వహించారు.డిస్ట్రిక్ట్ సెక్రటరీ లయన్ సి.హెచ్.అరుణ సహకారంతో లయన్ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజనకు రామచంద్రం, డయాబెటిక్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ దాసోజు వీరబ్రహ్మం, ఫాస్ట్ ప్రెసిడెంట్ శంభుని శ్రీనివాస్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

దేవాలయ ఇనాం భూముల్లో ప్రైవేట్ స్కూల్ దందా?

0
Oplus_16908288

దేవాలయ ఇనాం భూముల్లో ప్రైవేట్ స్కూల్ దందా?

పాపన్నపేటలో అక్రమంగా విద్యా సంస్థ నిర్వహణపై ఆరోపణలు

అధికారుల పర్యవేక్షణ ఏదీ..? అనుమతులు ఉన్నాయా అంటూ ప్రజల ప్రశ్న

స్కూల్‌లో అధిక ఫీజుల వసూళ్లపైనా విమర్శలు..సమగ్ర విచారణకు డిమాండ్

పాపన్నపేట,సెప్టెంబర్,5,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేటలో దేవాలయ ఇనాం భూముల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాలయానికి సంబంధించిన ఇనాం భూముల్లో ప్రైవేట్ స్కూల్‌ను ఎలా నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేవాలయ భూములను ప్రైవేట్ విద్యా సంస్థకు వినియోగించేందుకు నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయా? లేదా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.ఇదిలా ఉండగా, సదరు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో భూముల వినియోగం,పాఠశాల నిర్వహణ, ఫీజుల వసూళ్లపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.దేవాలయ ఇనాం భూములు ప్రజా ప్రయోజనాలకు, దేవాలయ అవసరాలకు ఉపయోగపడాల్సి ఉండగా.. వాటిని ప్రైవేట్ సంస్థలకు వినియోగించే పరిస్థితి ఎలా ఏర్పడిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఎందుకు దృష్టి సారించలేదని నిలదీస్తున్నారు.దేవాలయ భూముల రికార్డులను పరిశీలించి, పాఠశాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు, భూమి వినియోగ హక్కులు, ఫీజుల వసూళ్లపై విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈవ్యవహారంపై దేవాదాయ,రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

(ఎపిసోడ్.1)

యూరియా కోసం అన్నదాతల పడిగాపులు!

0
Oplus_16908288

సర్వర్‌ సమస్యలతో పాపన్నపేటలో రైతుల అవస్థలు.. పాదరక్షలతో క్యూ

పాపన్నపేట,సెప్టెంబర్,2,మెదక్ టుడే న్యూస్:
యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.యాప్‌, సర్వర్‌ సమస్యల కారణంగా యూరియా కోసం పాపన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు కాశారు.బుధవారం రైతులు తమ పాదరక్షలను క్యూ లైన్‌లో పెట్టి, కార్యాలయ భవనం నీడలో వేచి ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.యూరియా కోసం రైతులను ఇలా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.యూరియా సరఫరాలో సమస్యలు లేకుండా, సర్వర్‌ లోపాలను వెంటనే పరిష్కరించి రైతులకు సకాలంలో ఎరువు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు.

0

ప్రతి గ్రామానికి కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు

పాపన్నపేట,సెప్టెంబర్,2,మెదక్ టుడే న్యూస్:స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు.ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. బుధవారం పాపన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలను పేదలకు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.