📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
HomeNewsరోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి పద్మశాలి సంఘం.11 వేల ఆర్థిక...

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి పద్మశాలి సంఘం.11 వేల ఆర్థిక సాయం.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,జూలై,23,(మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాపన్నపేటకు చెందిన మరెల్లి రాములు కుటుంబానికి స్థానిక పద్మశాలి సంఘం సభ్యులు మానవత్వాన్ని చాటుతూ రూ.11,000 ఆర్థిక సహాయం అందజేశారు.మరెల్లి రాములు కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో, పద్మశాలి సంఘం సభ్యులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి గురువారం ఆయన కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు.ఈ సందర్భంగా రాములు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కష్టకాలంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంఘం నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట చేనేత సంఘం అధ్యక్షుడు కొడుపాక విఠల్, మాజీ అధ్యక్షుడు పడిగే కృష్ణ, పల్లె సంగమేశ్వర్, కొడుపాక శివశంకర్, తూర్పు రాజు,తూర్పు రాజారాం, కొడుపాక దుర్గేశ్వర్, వళ్ళందేశి శ్రీనివాస్,తూర్పు రమేష్, పోల్ శ్రీనివాస్, వళ్ళందేశి ఉదయ్, కళ్లేటి వెంకట్, అచుకట్ల మహేష్, కొడుపాక పూర్ణచందర్, రాజారాం చంద్రం, మదనాల అరవింద్, చామంతుల నాగరాజు, వళ్ళందేశి రాజు, కొడుపాక ప్రసాద్, ఊరటి లక్ష్మి, కొడుపాక ఉమామహేశ్వర, కొడుపాక వెంకటేశం, కొడుపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular