రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి పద్మశాలి సంఘం.11 వేల ఆర్థిక సాయం.
పాపన్నపేట,జూలై,23,(మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాపన్నపేటకు చెందిన మరెల్లి రాములు కుటుంబానికి స్థానిక పద్మశాలి సంఘం సభ్యులు మానవత్వాన్ని చాటుతూ రూ.11,000 ఆర్థిక సహాయం అందజేశారు.మరెల్లి రాములు కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో, పద్మశాలి సంఘం సభ్యులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి గురువారం ఆయన కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు.ఈ సందర్భంగా రాములు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కష్టకాలంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంఘం నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో...