ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 348 మంది క్రీడాకారుల హాజరు
నర్సాపూర్, సెప్టెంబర్ 12, మెదక్ టుడే న్యూస్:
ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-18 ఖో ఖో పోటీలు శనివారం నర్సాపూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 348 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ పోటీలను పీఆర్టీయూ మెదక్ జిల్లా సెక్రటరీ సామ్యా నాయక్, టీజీడబ్ల్యూఆర్‌జేసీ ప్రిన్సిపాల్ బసవరాజు, ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్, ట్రెజరర్ నాగ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ,విద్యార్థుల్లో క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులు, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


