📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Home Blog Page 2

నియమ నిబంధనలతోనే వినాయక చవితి వేడుకలు-డీజేలకు పూర్తి నిషేధం.ఒక్క స్పీకర్‌కే అనుమతి.

0

మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరి

పటాన్‌చెరు సీఐ రవీందర్ స్పష్టీకరణ

పటాన్‌చెరు, సెప్టెంబర్,1:(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పటాన్‌చెరు సీఐ రవీందర్ నిర్వాహకులకు పిలుపునిచ్చారు. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం పటాన్‌చెరు లో ముదిరాజ్ సంఘం భవనంలో మండపాల నిర్వాహకులతో శాంతిభద్రతల సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పటాన్‌చెరు పరిధిలో గత ఏడాది 495 మండపాలు ఏర్పాటు చేశారని, ఈ ఏడాది కూడా విగ్రహ ప్రతిష్ఠాపన చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధాన రహదారులపై మండపాలు నిర్మించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించవద్దని సూచించారు.డీజే రహితంగా ఉత్సవాలు:నవరాత్రుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని సీఐ తేల్చిచెప్పారు. అధిక శబ్దం వెలువరించే ప్యాడ్ బ్యాండ్లు, మిక్సర్ల వాడకాన్ని నిషేధించామని, నిబంధనల ప్రకారం కేవలం ఒక్క స్పీకర్‌తో నడిచే మండపాలకే అనుమతి ఉంటుందని తెలిపారు. పటాన్‌చెరును డీజే రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ నెల 14వ తేదీ నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసేంత వరకు పట్టణంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు మహేశ్వర్ రెడ్డి, వినోద్, అభిమాన్ సింగ్, పోలీస్ సిబ్బందితో పాటు వివిధ గ్రామాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పోలీస్ యూనియన్ ఎన్నికలు: అమీన్‌పూర్ పీఎస్ ప్రతినిధిగా కానిస్టేబుల్ అంబర్ సింగ్ విజయం

0

అభినందనలు తెలిపిన సీఐ ప్రవీణ్ రెడ్డి

సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపిన అంబర్ సింగ్

అమీన్‌పూర్ ఆగస్టు 31:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీస్ యూనియన్ ఎన్నికల్లో అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రతినిధిగా కానిస్టేబుల్ అంబర్ సింగ్ ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా అమీన్‌పూర్ సీఐ ప్రవీణ్ రెడ్డి ఆయనకు ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆశయాలు, సమస్యల పరిష్కారానికి అంబర్ సింగ్ బాధ్యతాయుతంగా పనిచేసి అండగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈవిజయం పట్ల కానిస్టేబుల్ అంబర్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ.. తనపై నమ్మకంతో గెలిపించినందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డికి, ఎస్సైలకు, తోటి సిబ్బందికి మరియు మిత్రులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీ పథకాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.

0

మెదక్,ఆగస్టు,31,మెదక్ టుడే న్యూస్:రెండున్నర ఏండ్లల్లో రెండు కిలోమీటర్ల రోడ్డు వేసిన పాపాన పోలేదు.అభివృద్ధి పై చర్చకు సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.వారి రాజకీయ చరిత్ర పై పునఃరాలోచన చేసుకోవాలిరోడ్డు వేయండి అని ప్రజలు కోరితే..!! కోట్ల రూపాయల అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు..!!నూతన పింఛన్ లను మంజూరు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఊర్లల్లో వచ్చి మాట్లాడాలి.నోరుఅదుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి.వెల్దుర్తి – పిల్లికొట్టాల్ రోడ్డు అభివృద్ధి పనులపై పాదయాత్ర లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి హెచ్చరిక

పాపన్నపేటలో దోమల దండయాత్ర..విషజ్వరాలతో ప్రజలు విలవిల!

0

వర్షాకాలంలో పెరిగిన పారిశుధ్య సమస్యలు.. నిలిచిన వర్షపు నీరు, పిచ్చిమొక్కలతో దోమలకు ఆవాసాలు

పాపన్నపేట,ఆగస్టు,30, మెదక్ టుడే న్యూస్:వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పాపన్నపేట గ్రామంలో దోమల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందడంతో పలువురు గ్రామస్తులు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రమాదం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పారిశుధ్య చర్యలు ఎక్కడ?

మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, నిల్వ నీటిని తొలగించడం, పిచ్చిమొక్కలను తొలగించడం, దోమల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.అవసరమైన ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు, ఫాగింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అధికారులు స్పందించి..గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ప్రజల కోరుకుంటున్నారు.విషజ్వరాల వ్యాప్తికి ముందే అప్రమత్తమై గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని, నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి వెంటనే తొలగించాలని పాపన్నపేట గ్రామస్తులు కోరుతున్నారు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దోమల నియంత్రణ, పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

పోచమ్మ అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి.

0

జిన్నారం,ఆగస్టు,27,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఊరేగింపులో నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఊరేగింపులో నడిచి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. జిన్నారం పరిసర ప్రాంత ప్రజలందరిపై పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆగస్టు 30న జిన్నారంలో అత్యంత వైభవంగా జరగనున్న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశం గౌడ్, జగన్నాథ్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పీజేఆర్ కాలనీలో శివలింగ ప్రతిష్ఠాపనోత్సవం: హాజరైన నల రవీందర్ రెడ్డి, మన్నే రవీందర్, ఎర్రోళ్ల పాండు.

0

అమీన్‌పూర్,ఆగస్టు,27,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని పీజేఆర్ కాలనీలో శ్రీ బ్రహ్మ సూత్ర మరకత శివలింగం, నవగ్రహాలు మరియు నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మహాదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో, కాలనీవాసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ వార్డు మెంబర్ నల రవీందర్ రెడ్డి, ప్రముఖ నాయకులు మన్నే రవీందర్, ఎర్రోళ్ల పాండు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులను మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మహాదేవ్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నాయకులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ.కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఇంతటి సుందరమైన ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన మహాదేవ్ రెడ్డిని, కాలనీవాసులను ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

రాణి–శివకుమార్ వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు.

0

వివాహ బంధంతో ఒక్కటైన రాణి–శివకుమార్ దంపతుల జీవితం ప్రేమ, అనురాగం, పరస్పర అవగాహనతో నిండి సుఖసంతోషాలతో సాగాలి” — మంత్రి పొన్నం ప్రభాకర్

(స్పెషల్ కరెస్పాండంట్)
శంషాబాద్,ఆగస్టు,27,మెదక్ టుడే న్యూస్:శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ హాల్‌లో గురువారం ఘనంగా జరిగిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి–శివకుమార్ వివాహ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.నూతన వధూవరులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులువివాహ వేడుకకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన వధూవరులు రాణి–శివకుమార్‌లను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, పరస్పర గౌరవం, నమ్మకం, అవగాహనతో సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.నవీన్ యాదవ్ శుభాకాంక్షలుజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, యువ నాయకుడు నవీన్ యాదవ్ నూతన వధూవరులను అభినందిస్తూ.. వివాహం అనేది రెండు మనసులు, రెండు కుటుంబాలను ఒక్కటిగా కలిపే పవిత్రమైన బంధమని పేర్కొన్నారు. రాణి–శివకుమార్ దంపతులు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.డా. కొమ్ము వెంకన్నబాబు శుభాకాంక్షలుప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు నూతన దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం, గౌరవం, ప్రేమ, సహకారం జీవితాంతం కొనసాగాలని, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.అతిథులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలుఈ సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ, తన మేనకోడలు రాణి–శివకుమార్‌ల వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.తన కుటుంబ శుభకార్యానికి సమయం కేటాయించి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని, ఆత్మీయతను కలిగించిందని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. రాణి–శివకుమార్ దంపతులపై అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.ప్రముఖుల హాజరు.ఈ వివాహ వేడుకలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగనూరు బసవేశ్వరప్ప, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, చందీ, తిరుపతిరెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, చందు, కౌన్సిలర్లు అప్పి, పెంటయ్య, సింగపాక అనిల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఖదీర్ ముబారక్, నందిగామ మాజీ ఎంపీపీ శివరాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘునాయక్, ముస్లిం మైనారిటీ నేత ఇబ్రహీం, చేవెళ్ల నర్సింలు, యాదయ్య తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ప్రేమ, నమ్మకంతో ఆదర్శ దాంపత్యంరాణి–శివకుమార్ దంపతులు పరస్పర ప్రేమ, నమ్మకం, గౌరవం, సహకారంతో ముందుకు సాగుతూ ఆదర్శ దంపతులుగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు. వారి నూతన జీవిత ప్రయాణం ఆనందం, ఆప్యాయత, ఐశ్వర్యం, విజయాలతో నిండాలని శుభాకాంక్షలు తెలిపారు.

 

కడుపు నొప్పి బాధతో విద్యార్థిని ఆత్మహత్య.

0
Oplus_16908288

పాపన్నపేట,ఆగస్టు,21,మెదక్ టుడే న్యూస్:

తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన వగ్గు రిషిత (14) మండలంలోని యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండగా, పలుమార్లు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ నొప్పి తగ్గలేదు.
శుక్రవారం ఉదయం కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతూ రశిత ఇంట్లో దిగులుగా ఉన్నట్లు తెలిసింది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతురాలి తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

శ్రీ గాయత్రీ ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.

0

వైద్య సేవలు, రికార్డులు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన

శంకరంపేట,(ఎ),ఆగస్టు,21, మెదక్ టుడే న్యూస్: 

శంకరంపేట (ఎ)లోని శ్రీ గాయత్రీ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ గణేశ్వర్ శుక్రవారం వైద్య సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల రికార్డులు, సిబ్బంది విద్యార్హత ధ్రువపత్రాలు, వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఆసుపత్రిలో పీసీపీఎన్‌డీటీ చట్టంపై అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని, ఎక్స్‌రే గది వద్ద ఆరోగ్య భద్రతా సూచనలు స్పష్టంగా ప్రదర్శించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.రోగుల వివరాలు, వైద్య రికార్డులు, పరీక్షా నివేదికలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.వైద్యులు, సిబ్బంది విద్యార్హత ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచాలని, ఆపరేషన్ థియేటర్‌ను పరిశుభ్రంగా,ఇన్‌ఫెక్షన్ రహితంగా నిర్వహించాలని సూచించారు.రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ గణేశ్వర్ సూచించారు.గాయత్రీ ఆసుపత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గణేశ్వర్, ఇతర అధికారులు.

వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి.

0

చేగుంట,ఆగస్టు,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని కర్నల్ పల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో గురువారం వడియారం గ్రామానికి చెందిన ఆకుల మల్లేష్ కుమారుడి రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి_ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి, బాపు రెడ్డి, రాజిరెడ్డి, వెంకట్ తదితర పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.