📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
HomePOITICAL NEWSఏడుపాయల్లో హరీష్ రావు జన్మదిన వేడుకలు.

ఏడుపాయల్లో హరీష్ రావు జన్మదిన వేడుకలు.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,జూన్,3,మెదక్ టుడే న్యూస్:అట్టహాసంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి, భారాస ట్రిపుల్ షూటర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం వద్ద నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం వద్ద ఆయన కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ
కన్నీరు ఎక్కడ ఉంటే తన్నీరు అక్కడ ఉండి ప్రజల కన్నీరు తుడుస్తారని భారాస నియోజక వర్గ ఇన్ ఛార్జ్ కంటా రెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. తెలంగాణలో హరీష్ రావు ఓ బ్రాండ్ అని కొనియాడారు. హరీష్ రావు సూచనల మేరకు నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో హరీష్ రావు ఉద్యమ ఒక కెరటంగా తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర పోషించారన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధిలో హరీష్ రావు పాత్ర వెలకట్టలేనిది అన్నారు. నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం పాటుపడే ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి హరీష్ రావు అని కొనియాడారు. హరీష్ రావు సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శనం చేయాలని అమ్మవారిని కోరుతున్నట్లు తెలిపారు. హరీష్ రావు సూచనల మేరకు మెదక్ నియోజకవర్గం అని టిఆర్ఎస్ కంచుకోటగా మారుస్తామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో భారాస నాయకులు సోములు, బాలాగౌడ్, గురుమూర్తి గౌడ్, శ్రీనాథ్ , లింగా రెడ్డి, సర్పంచులు సురేష్, గంట రాణి సుధీర్, నాయకులు సంగ పవిత్ర దుర్గయ్య, కాశీనాథ్ రావు, శ్రీనివాస్, కొండల్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్ , జగదీష్ చారి, కిరణ్ గౌడ్, నవీన్, సాయి , దినేష్ గౌడ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular