📄 ePaper
Thursday, June 4, 2026
ADS
HomeTelanganaనూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదంపటాన్చెరు శాసనసభ్యులు గూడెం...

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదంపటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

📰 Generate e-Paper Clip

రామచంద్రాపురం,జూన్,1,మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల అయ్యాయని.. ప్రతి పార్కుని ప్రజల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్కు, హుడా కాలనీ పార్కు 2 కాలనీలలో ఒక కోటి 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో నూతన పార్కుల ఏర్పాటు ద్వారా ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదానికి దోహదపడుతుందని తెలిపారు . పార్కులు పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణంలో నడక, వ్యాయామం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అన్నారు. పార్కుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.ప్రజలు పార్కులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం తహసిల్దార్ సరస్వతి, పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషన్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లలిత సోమిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డి ఈ కృష్ణవేణి, యు బి డి మేనేజర్ విక్రమ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి, కోటి హరీష్ , మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular