బాధ్యులకు నియామక పత్రాలు, ఐడీ కార్డుల అందజేత
(స్పెషల్ కరస్పాండెంట్)
హైదరాబాద్,జూన్,1,మెదక్ టుడే న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా పనిచేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నియామకాలు చేపట్టినట్లు సంస్థ నేషనల్ సెక్రటరీ పోలిశెట్టి రామప్ప తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పోలిశెట్టి రామప్ప ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అవార్డుల ప్రదానోత్సవాలు, రక్తదాన శిబిరాలు, అలాగే అన్నమయ్య జిల్లాలో అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఆయన సేవలను గుర్తించిన సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహితాబ్రాయి, ఆల్ ఇండియా ఇన్‌చార్జ్ సర్వేందర్ ఆయనకు అదనపు బాధ్యతలతో నేషనల్ సెక్రటరీగా పదోన్నతి కల్పించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలకు కొత్త బాధ్యులను నియమించారు. వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పోలిశెట్టి గణేశ్వరరావు, రాష్ట్ర సోషల్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్‌గా పోలిశెట్టి చంద్రారావు, కాకినాడ జిల్లా చైర్మన్‌గా బోనం వీర వెంకట సత్యనారాయణ, కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా కొమిరాల నాగార్జున నియమితులయ్యారు.కొత్తగా నియమితులైన బాధ్యులకు పోలిశెట్టి రామప్ప చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు, గుర్తింపు కార్డులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం సంస్థలో చేరిన సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వారి పక్షాన నిలబడి, సమస్యకు పరిష్కారం లభించే వరకు నిరంతరం అండగా ఉంటాం. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం కృషి చేస్తాం” అని ప్రతిజ్ఞ చేశారు.
సంస్థ విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమనే విశ్వాసాన్ని నాయకులు వ్యక్తం చేశారు.


