📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Homehyderabad-tsపాత రామచంద్రపురంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.. అధికారుల సమన్వయంతో ఊపిరి...

పాత రామచంద్రపురంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.. అధికారుల సమన్వయంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు

📰 Generate e-Paper Clip

రామచంద్రపురం, జూన్ 01,

(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి

 

పాత రామచంద్రపురం జాతీయ రహదారి పక్కన నెలకొన్న డ్రైనేజీ సమస్యకు అధికారుల సమన్వయంతో శాశ్వత పరిష్కారం లభించింది. డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో గత కొంతకాలంగా మూడవ వార్డు ప్రజలు మురికినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ మూసుకుపోవడంతో నాలాలోని నీరు బయటకు పొంగి ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు.ఈ సమస్యపై స్థానిక ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు సుంకు వినయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఈ శ్రీ శివ తన సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఇది ఓపెన్ నాలా కావడంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ పరిధిలోకి వస్తుందని గుర్తించి, ఆ శాఖ మేనేజర్ శ్రీ ధనుంజయ్ గారికి సమాచారం అందించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ విభాగం సమస్యను పరిష్కరించిన తర్వాత, మూడవ వార్డులో నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఏఈ శివ హామీ ఇచ్చారు.అధికారుల సమన్వయంతో వెంటనే రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ సిబ్బంది, జెసిబి మరియు జెట్టింగ్ యంత్రాల సహాయంతో నాలాలోని అడ్డంకులను తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిఎస్పి సీనియర్ నాయకులు సుంకు వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో జిహెచ్ఎంసి, నేషనల్ హైవేస్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ అధికారులు సకాలంలో స్పందించి, సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular