📄 ePaper
Friday, July 31, 2026
ADS
Homehyderabad-ts45 లక్షల చోరీ కేసులో కుషాయిగూడ పోలీసుల తీరుపై తీవ్ర...

45 లక్షల చోరీ కేసులో కుషాయిగూడ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు.

📰 Generate e-Paper Clip

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు నత్తనడకన.?

దొంగల కన్నా ఫిర్యాదుదారులపైనే ప్రశ్నల వర్షం

సీసీటీవీ ఫుటేజ్‌లు ఉన్నా ముందుకు సాగని విచారణపై బాధితుల ఆవేదన

సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్ వ్యవహారశైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

హైదరాబాద్,జులై,8,మెదక్ టుడే న్యూస్:( స్టేట్ బ్యూరో)

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు రూ.45 లక్షల చోరీ జరిగిన కేసు దర్యాప్తు తీరుపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, అసలు నిందితులను గుర్తించి సొమ్ము రికవరీ చేసే దిశగా దర్యాప్తు అసలు ముందుకు సాగడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.బాధితుల వివరాల ప్రకారం డిటెక్టివ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు చోరీకి పాల్పడిన వారిపై దృష్టి పెట్టకుండా, ఫిర్యాదుదారులనే పదేపదే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది.? అనే ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాటికి సంబంధించిన ఆధారాలు సైతం చూపించామని అయినా పదేపదే దానికోసమే మాట్లాడుతూరని బాధితులు పేర్కొంటున్నారు. చోరీ జరిగిన డబ్బును రికవరీ చేయడం, నిందితులను గుర్తించడం వంటి ప్రాథమిక దర్యాప్తు అంశాలను పక్కనబెట్టి, ఫిర్యాదుదారులనే అనుమానితుల్లా ప్రశ్నించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఫిర్యాదు చేసిన లహరి, మహేష్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో దుర్భాషలాడడమే కాకుండా దాడి చేసినట్లు కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే బాధితులకు ఇలానే చేస్తారా అని బోరున విలపిస్తున్నారు. మరో బాధితురాలు లహరి, రూ.45 లక్షలు పోయాయన్న ఆవేదనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్‌లలో అనుమానితుల కదలికలు ఉన్నప్పటికీ, వారిని శాస్త్రీయ పద్ధతుల్లో విచారించి సొమ్ము రికవరీ చేసే దిశగా కనీస చర్యలు కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. “నిందితులు తామే చోరీ చేశామని ఒప్పుకోవడం లేదని, అందుకే రికవరీ చేయలేము” అని పోలీసులే చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు పేర్కొంటున్నారు. నేరాన్ని ఛేదించడం పోలీసుల బాధ్యతే తప్ప, నిందితులు స్వయంగా ఒప్పుకుంటేనే కేసు పరిష్కారం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.న్యాయపరంగా చూస్తే, చోరీ జరిగిన కేసులో ముందుగా నిందితులను గుర్తించడం, సాక్ష్యాధారాల ఆధారంగా దర్యాప్తు పూర్తి చేయడం, దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకోవడం పోలీసుల విధి. అనంతరం ఆ సొమ్ముపై చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్ధారించి సంబంధిత ప్రక్రియ ద్వారా బాధితులకు అప్పగించడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియను పక్కనబెట్టి, ఫిర్యాదుదారులనే పదేపదే విచారించడం వెనుక సీఐ వెంకటేశ్వర్లు ఉద్దేశం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.ఈ వ్యవహారంపై సీఐ వెంకటేశ్వర్లను వివరణ కోరగా, “సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొందరిని ప్రశ్నించాం. అయితే వారు డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకోవడం లేదు. అందువల్ల రికవరీ సాధ్యం కావడం లేదు” అని చెప్పినట్లు బాధితులు తెలిపారు. బాధ్యతాయుతమైన పోలీసు అధికారి నుంచి ఇటువంటి సమాధానాలు రావడం ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత అధికారులేమో పోలీసు వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి. ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి అని ప్రయత్నిస్తుంటే కిందిస్థాయి అధికారుల తీరు ఇలా ఉండడంతో ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. రూ.45 లక్షలు అనేది భారీ చోరీకి సంబంధించిన ఫిర్యాదు కాబట్టి ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రత్యేక శ్రద్ధతో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి రూ.45 లక్షల సొమ్మును రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు ఉప్పల్ జోన్ డీసీపీ, మల్కాజ్గిరి పోలీసు కమిషనర్‌ను కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular