పాపన్నపేట,ఆగస్టు,10, మెదక్ టుడే న్యూస్:రెండు బైక్ లు ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యుసుఫ్ పేట శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు..మెదక్ – బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారి యూసుఫ్ పేట శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది . పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల కృష్ణ (40) పని నిమిత్తం బంధువు వెంకట్ తో కలిసి కొత్తపల్లి వైపు నుండి పాపన్నపేటకు ద్విచక్ర వాహనం పై వస్తుండగా,ముస్లాపూర్ గ్రామానికి చెందిన వారు ద్విచక్ర వాహనంపై మెదక్ వైపు వెళ్లే క్రమంలో ఎదురెదురుగా వారి వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఈప్రమాద ఘటనలో ఆకుల కృష్ణ కు తీవ్ర గాయాలై మరణించాడు. కృష్ణ పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో (సిబ్బంది) కారోబార్ గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య సంగీత,ఒక కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
కొత్తపల్లి బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు ఎప్పుడు?
వారం రోజుల్లో పనులు ప్రారంభించాలి..లేకుంటే భారీ ధర్నా.
ప్రతిపక్షాలను తిట్టడం మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టండి:పద్మా దేవేందర్‌రెడ్డి.
పాపన్నపేట,ఆగస్టు,10,మెదక్ టుడే న్యూస్:మెదక్–బొడ్మెట్‌పల్లి ప్రధాన మార్గంలోని కొత్తపల్లి వద్ద బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించి, వాహనదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ,బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్లతో బ్రిడ్జి నిర్మించినప్పటికీ అప్రోచ్ రోడ్డు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.వారం రోజుల్లోగా అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.ప్రతిపక్షాలను విమర్శించడం మానుకుని ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పాపన్నపేటలో ‘హర్ ఘర్ తిరంగా’ సన్నాహక సమావేశం.
వివిధ మోర్చాలకు నూతన అధ్యక్షుల నియామకం
పాపన్నపేట,ఆగస్టు,10,మెదక్ టుడే న్యూస్:రాష్ట్ర,జిల్లా బీజేపీ శాఖల ఆదేశాల మేరకు పాపన్నపేట మండలం కొత్తపల్లిలో సోమవారం‘హర్ ఘర్ తిరంగా’ సన్నాహక సమావేశాన్ని మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గడ్డం కాశీనాథ్ చేతుల మీదుగా బీజేపీ వివిధ మోర్చాల నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు.మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మన్నె సుమలత, ఓబీసీ మోర్చాకు వడ్ల బాగేష్, యువ మోర్చాకు కేరూరి జగదీష్, కిసాన్ మోర్చాకు జిన్నా గోపాల్, ఎస్సీ మోర్చాకు బాబు, ఎస్టీ మోర్చాకు పాతలోత్ వెంకట్ నాయక్‌లను నియమించారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.ఆగస్టు 12న పాపన్నపేటలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనం..భక్తుల కొంగు బంగారం మన మైసమ్మ తల్లి-ప్రధాన అర్చకులు శివశ్రీ పంతులు.
శేరిలింగంపల్లి,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి నుండి అమీన్‌పూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన వెలిసిన శ్రీ మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివశ్రీ పంతులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి మైసమ్మ తల్లి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోందని తెలిపారు. భక్తుల కొరికలు తీర్చడంలో అమ్మవారి మహిమ అపారమని, ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలతో పాటు వాహన పూజలు కూడా ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు.ఈ ఏడాది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో జనం తరలివచ్చారని, సుమారు రెండు నుంచి మూడు వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా కురిసేలా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ప్రధాన అర్చకులు ఆకాంక్షించారు.

అమీన్ పూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు.. పోటెత్తిన భక్తసందోహం.
అమీన్ పూర్,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్ గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ దేవతల బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. గ్రామ సరిహద్దులోని కొలువైన శక్తి స్వరూపిణులు నాగులమ్మ, పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ తల్లుల ఆలయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాతల కాలం నుంచి ఆచారంగా వస్తున్న ఈ పండుగను గ్రామస్తులందరూ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై నిలిచి అట్టహాసంగా జరుపుకోవడం విశేషం. ఉదయం నుంచే ఆలయాల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. చుట్టుపక్కల వివిధ కాలనీల నుంచి సుమారు 4 నుంచి 5 వేల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ యువకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెల ఊరేగింపు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో తొట్టెలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఉదయం నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు, అలాగే సాయంత్రం గ్రామం నుండి భారీ ఎత్తున పోటెత్తిన బోనాల ఊరేగింపునకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామ పెద్దలు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, గ్రామస్తులు మాట్లాడుతూ.. “మా గ్రామంలో వెలసిన ఈ నలుగురు అమ్మవార్లను కొలిస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుందనేది మా ప్రగాఢ నమ్మకం. తాతల కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని అందరం కలిసికట్టుగా కొనసాగిస్తున్నాం. అమ్మవార్ల దయతో గ్రామం సుఖశాంతులతో, సిరులతో వర్ధిల్లుతుంది” అని మనస్ఫూర్తిగా తెలిపారు. అందరూ సుఖసంతోతులతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బంధంకొమ్ము గ్రామంలో అంగరంగ వైభవంగా తొట్టెల ఊరేగింపు మరియు బోనాల ఉత్సవాలు.. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన గ్రామస్తులు!
అమీన్ పూర్,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బంధంకొమ్ము గ్రామంలో గ్రామస్తులు మరియు యువకుల ఆధ్వర్యంలో అమ్మవారి బోనాలు మరియు తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగింది.స్థానిక శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ తొట్టెల ఊరేగింపు మరియు బోనాల వేడుక గ్రామ వీధుల గుండా కోలాహలంగా సాగింది. అమ్మవారికి సమర్పించే బోనాలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, ఆటపాటల మధ్య సాగిన ఈ వేడుకల్లో చిన్నవారూ, పెద్దవారూ తేడా లేకుండా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగను ఆస్వాదించారు. దీంతో గ్రామం మొత్తం శివనామస్మరణతో మరియు భక్తి పారవశ్యంతో మార్మోగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు యువకులు మీడియాతో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.మా తాతల కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మేమందరం కలికట్టుగా కొనసాగిస్తున్నాము. మా గ్రామంలో వినాయక చవితి, బతుకమ్మ, దసరా వంటి ప్రతి పండుగను ఏ విధంగానైతే జరుపుకుంటామో, అలాగే ఈ బోనాల ఉత్సవాలను కూడా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గ్రామ ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము”అని తెలిపారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో అందరిలోనూ ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, ప్రజా ప్రతినిధులు , మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ.
అమీన్‌పూర్,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు.ఈ వేడుకలకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మరియు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమ కాలనీలో నల్ల పోచమ్మ తల్లి దేవాలయం ఉండడం తమ అదృష్టమని, అమ్మవారిని కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులగా గట్టి నమ్మకం ఉందన్నారు. అందరి సహకారంతో ఒక చిన్న గుడిగా ఉన్న ఈ ఆలయాన్ని నేడు అందమైన దేవాలయంగా నిర్మించుకోగలిగామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా, శారీరకంగా సహకరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డికి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్‌కు, మాజీ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు మరియు ప్రతి ఒక్క లీడర్‌కు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ ప్రెసిడెంట్ ఎం మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ గోపి, రాఘవేంద్ర కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..



బంధంకొమ్ము గ్రామంలో అంగరంగ వైభవంగా తొట్టెల ఊరేగింపు మరియు బోనాల ఉత్సవాలు.. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన గ్రామస్తులు!

అమీన్ పూర్, ఆగస్టు,9:(మెదక్ టుడే)న్యూస్,ప్రతినిధి:అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బంధంకొమ్ము గ్రామంలో గ్రామస్తులు మరియు యువకుల ఆధ్వర్యంలో అమ్మవారి బోనాలు మరియు తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగింది.స్థానిక శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ తొట్టెల ఊరేగింపు మరియు బోనాల వేడుక గ్రామ వీధుల గుండా కోలాహలంగా సాగింది. అమ్మవారికి సమర్పించే బోనాలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, ఆటపాటల మధ్య సాగిన ఈ వేడుకల్లో చిన్నవారూ, పెద్దవారూ తేడా లేకుండా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగను ఆస్వాదించారు. దీంతో గ్రామం మొత్తం శివనామస్మరణతో మరియు భక్తి పారవశ్యంతో మార్మోగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు యువకులు మీడియాతో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.మా తాతల కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మేమందరం కలికట్టుగా కొనసాగిస్తున్నాము. మా గ్రామంలో వినాయక చవితి, బతుకమ్మ, దసరా వంటి ప్రతి పండుగను ఏ విధంగానైతే జరుపుకుంటామో, అలాగే ఈ బోనాల ఉత్సవాలను కూడా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గ్రామ ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాముఅని తెలిపారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో అందరిలోనూ ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, ప్రజా ప్రతినిధులు , మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పేదల ప్రాణాలతో చెలగాటమా..?
మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల గోడు.. ఓపీ నుంచి డాక్టర్ వరకు పరుగులే..!
రోగి మాట వినకుండానే మరో గదికి పంపుతున్నారంటూ ఆవేదన.. అధికారులు స్పందించాలని ప్రజల విజ్ఞప్తి
మెదక్,ఆగస్టు,6,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)
“ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆరోగ్యం బాగుపడుతుందనుకున్నాం… కానీ మా బాధ చెప్పుకునే అవకాశం కూడా దొరకడం లేదు” అంటూ మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓపీ కౌంటర్ నుంచి సంబంధిత వైద్యుడిని కలిసే వరకు ఒక డాక్టర్ వద్ద నుంచి మరో డాక్టర్ వద్దకు, ఒక గది నుంచి మరో గదికి పంపిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.తమ ఆరోగ్య సమస్యను పూర్తిగా వివరించకముందే “అక్కడికి వెళ్లండి..ఈ డాక్టర్‌ను కలవండి…అంటూ పంపిస్తున్నారని వాపోతున్నారు.దీంతో వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు, ఇతర రోగులు గంటల తరబడి ఆసుపత్రి ప్రాంగణంలో తిరగాల్సి వస్తోందని చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చిన పేద, మధ్యతరగతి ప్రజలు చివరకు విసిగి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, రోగుల పట్ల మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యమని ప్రజలు గుర్తుచేస్తున్నారు.రోగి ఆసుపత్రికి చికిత్స కోసం వస్తాడు…తిరుగుల కోసం కాదు.రోగి చెప్పే సమస్యను పూర్తిగా విని, సరైన వైద్యుడి వద్దకు మార్గనిర్దేశం చేయడం ప్రతి వైద్య సిబ్బంది బాధ్యత.మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి,వాస్తవ పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అలాగే ఆసుపత్రిలో ప్రతి రోగికి గౌరవప్రదమైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నల్ల పోచమ్మకు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘన బోనాల ఊరేగింపు రేపు.
పాపన్నపేట,ఆగస్టు,1,(మెదక్ టుడే)మండల కేంద్రం పాపన్నపేటలోని నల్ల పోచమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా, సాయంత్రం బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు, సభ్యులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు.











