📄 ePaper
Thursday, June 4, 2026
ADS
HomeSportక్రికెట్ పీపీఎల్ సీజన్ (2) పొలంపల్లి లోవిన్నర్, చందు వారియర్స్,రన్నర్,...

క్రికెట్ పీపీఎల్ సీజన్ (2) పొలంపల్లి లోవిన్నర్, చందు వారియర్స్,రన్నర్, ఆర్పి కింగ్స్,బహుమతులు అందజేసిన సర్పంచ్ రాజలక్ష్మి స్వామి,

📰 Generate e-Paper Clip

పొలంపల్లి యువత క్రీడాలతో పాటు వ్యవసాయ రంగంలో ముందు,ఉప సర్పంచ్ సత్య గౌడ్

చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో శనివారం నాడు క్రికెట్ పిపిఎల్ సీజన్ (2) ప్రారంభించారు, రెండు రోజులుగా జరిగిన మ్యాచ్ లో నాలుగు జట్టులు పాల్గొనగా, జట్టు (1) కృష్ణా రాయల్, జట్టు (2) గణేష్ టైగర్స్, జట్టు (3)ఆర్ పి కింగ్స్, జట్టు (4) చందు వారియర్స్, పాల్గొనగా, ఆదివారం నాడు, ఫైనల్ ఆర్ పి కింగ్స్, చందు వారియర్స్ జట్టు తలబడడంతోచందు వారియర్స్, విన్నర్ టీం విజయం సాధించారు,
పిపిఎల్ సీజన్ (2) కు ముఖ్యఅతిథిగా
కొండి రాజులక్ష్మి స్వామి పాల్గొని వారు మాట్లాడుతూ, యువత చదువుతోపాటు క్రీడాలవైపు మొగ్గు చూపాలి అని కోరుతూ, క్రీడలలో పొలంపల్లి యువత యువత మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి, ఎదుగుతూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, వారు కోరారు, ఉపసర్పంచ్ సత్య గౌడ్, మాట్లాడుతూ యువత చదువుతో, ముఖ్యంగా క్రీడాలతో పాటు,వ్యవసాయ రంగంలో ముందు ఉండడం ఎంత సంతోషకరం, యువతక్రీడాలలో ముందుకు సత్తా చాటడం సంతోషకరం, క్రీడలలో గెలుపు ఓటమి సహజం, అని అన్నారు, పిపిఎల్ సీజన్ (2) ప్రారంభించడానికి, సహకరించిన దాతలు, గ్రామ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి,10000, మాజీ సర్పంచ్ వెన్నెల నిర్మల సత్యం,2000, వై శివకుమార్, 8000, జి గణేష్ 3000, టి భాస్కర్ 2000, మాజీ వార్డ్ మెంబర్ కుక్కల శ్యామల సతీష్,2000, పి.చంద్రం 3000, సిహెచ్ కృష్ణ 3600 ఆర్ ప్రశాంత్ గౌడ్ 3000, ఈ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు, మాజీ సర్పంచులకు మాజీ ఉప సర్పంచ్ లకు మాజీ వార్డు మెంబర్లు, వివిధ యూత్ అధ్యక్షులు యువతకు, గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలు క్రీడా ప్రాంగణానీకి సహకరించిన, మరబోయిన ఐలయ్య, పర్వతాలు, శ్రీను కు నమస్కరిస్తున్నాం, పొలంపల్లి జరుగుతున్న క్రికెట్ ప్రీమియం సీజన్ (2) కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగింది, ఈ కార్యక్రమంలో యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు,

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular