📄 ePaper
Thursday, September 17, 2026
ADS
Home Blog Page 5

శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ.

0

అమీన్‌పూర్,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు.ఈ వేడుకలకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మరియు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమ కాలనీలో నల్ల పోచమ్మ తల్లి దేవాలయం ఉండడం తమ అదృష్టమని, అమ్మవారిని కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులగా గట్టి నమ్మకం ఉందన్నారు. అందరి సహకారంతో ఒక చిన్న గుడిగా ఉన్న ఈ ఆలయాన్ని నేడు అందమైన దేవాలయంగా నిర్మించుకోగలిగామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా, శారీరకంగా సహకరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డికి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్‌కు, మాజీ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు మరియు ప్రతి ఒక్క లీడర్‌కు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ ప్రెసిడెంట్ ఎం మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ గోపి, రాఘవేంద్ర కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

బంధంకొమ్ము గ్రామంలో అంగరంగ వైభవంగా తొట్టెల ఊరేగింపు మరియు బోనాల ఉత్సవాలు.. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన గ్రామస్తులు!

0

అమీన్ పూర్, ఆగస్టు,9:(మెదక్ టుడే)న్యూస్,ప్రతినిధి:అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బంధంకొమ్ము గ్రామంలో గ్రామస్తులు మరియు యువకుల ఆధ్వర్యంలో అమ్మవారి బోనాలు మరియు తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగింది.స్థానిక శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ తొట్టెల ఊరేగింపు మరియు బోనాల వేడుక గ్రామ వీధుల గుండా కోలాహలంగా సాగింది. అమ్మవారికి సమర్పించే బోనాలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, ఆటపాటల మధ్య సాగిన ఈ వేడుకల్లో చిన్నవారూ, పెద్దవారూ తేడా లేకుండా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగను ఆస్వాదించారు. దీంతో గ్రామం మొత్తం శివనామస్మరణతో మరియు భక్తి పారవశ్యంతో మార్మోగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు యువకులు మీడియాతో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.మా తాతల కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మేమందరం కలికట్టుగా కొనసాగిస్తున్నాము. మా గ్రామంలో వినాయక చవితి, బతుకమ్మ, దసరా వంటి ప్రతి పండుగను ఏ విధంగానైతే జరుపుకుంటామో, అలాగే ఈ బోనాల ఉత్సవాలను కూడా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గ్రామ ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాముఅని తెలిపారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో అందరిలోనూ ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, ప్రజా ప్రతినిధులు , మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పేదల ప్రాణాలతో చెలగాటమా..?

0
Oplus_16908288

మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల గోడు.. ఓపీ నుంచి డాక్టర్ వరకు పరుగులే..!

రోగి మాట వినకుండానే మరో గదికి పంపుతున్నారంటూ ఆవేదన.. అధికారులు స్పందించాలని ప్రజల విజ్ఞప్తి

మెదక్,ఆగస్టు,6,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

“ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆరోగ్యం బాగుపడుతుందనుకున్నాం… కానీ మా బాధ చెప్పుకునే అవకాశం కూడా దొరకడం లేదు” అంటూ మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓపీ కౌంటర్ నుంచి సంబంధిత వైద్యుడిని కలిసే వరకు ఒక డాక్టర్ వద్ద నుంచి మరో డాక్టర్ వద్దకు, ఒక గది నుంచి మరో గదికి పంపిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.తమ ఆరోగ్య సమస్యను పూర్తిగా వివరించకముందే “అక్కడికి వెళ్లండి..ఈ డాక్టర్‌ను కలవండి…అంటూ పంపిస్తున్నారని వాపోతున్నారు.దీంతో వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు, ఇతర రోగులు గంటల తరబడి ఆసుపత్రి ప్రాంగణంలో తిరగాల్సి వస్తోందని చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చిన పేద, మధ్యతరగతి ప్రజలు చివరకు విసిగి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, రోగుల పట్ల మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యమని ప్రజలు గుర్తుచేస్తున్నారు.రోగి ఆసుపత్రికి చికిత్స కోసం వస్తాడు…తిరుగుల కోసం కాదు.రోగి చెప్పే సమస్యను పూర్తిగా విని, సరైన వైద్యుడి వద్దకు మార్గనిర్దేశం చేయడం ప్రతి వైద్య సిబ్బంది బాధ్యత.మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి,వాస్తవ పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అలాగే ఆసుపత్రిలో ప్రతి రోగికి గౌరవప్రదమైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నల్ల పోచమ్మకు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘన బోనాల ఊరేగింపు రేపు.

0

పాపన్నపేట,ఆగస్టు,1,(మెదక్ టుడే)మండల కేంద్రం పాపన్నపేటలోని నల్ల పోచమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా, సాయంత్రం బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు, సభ్యులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు.

గ్రామపంచాయతీ నిధులతో బోర్ల ఏర్పాటు పనులకు శ్రీకారం. సర్పంచ్ పావని నరేంద్ర గౌడ్.

0

ప్రజల దాహం తీర్చడమే ధ్యేయం-పాపన్నపేటలో మంచినీటి విప్లవానికి శ్రీకారం!

ప్రతి వార్డుకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.

పాపన్నపేట,జూలై,31, మెదక్ టుడే న్యూస్:ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించి గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో పాపన్నపేట గ్రామపంచాయతీ మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీ నిధులతో సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో, వార్డు సభ్యుల సహకారంతో శుక్రవారం వార్డుల్లో మంచినీటి బోర్ల ఏర్పాటు పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం పనులు జరుగుతున్న వార్డులతో పాటు,మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా దశలవారీగా బోర్ల ఏర్పాటు చేపట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు.అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ పావనినరేందర్ గౌడ్ తెలిపారు.ప్రజా సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యం..ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందే వరకు మా కృషి నిరంతరం కొనసాగుతుంది”అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువకులు,గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేజివిల్- వాహనాల రాకపోకలతో అధ్వానంగా మారిన వెంకటాపూర్ గ్రామ రోడ్లు.. పట్టించుకోని అధికారులు

0

వెంకటాపూర్: వెంకటాపూర్ గ్రామంలోని అంతర్గత రోడ్లు రోజురోజుకు అధ్వానంగా మారుతూ గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో నడిచి వెళ్లడమే కాకుండా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించడం కూడా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, గ్రామ పరిసరాల్లోని కేజ్ విల్లాకు సంబంధించిన భారీ వాహనాల నిరంతర రాకపోకల వల్ల రోడ్లు వేగంగా దెబ్బతిన్నాయని వారు చెబుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్లు దెబ్బతినడం వల్ల అత్యవసర సమయాల్లో వాహనాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, గ్రామంలోకి వచ్చే అతిథులు కూడా ఇబ్బందిపడుతున్నారని స్థానికులు తెలిపారు. రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు, భారీ వాహనాల రాకపోకల వల్ల నష్టం జరుగుతున్నట్లయితే సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

నార్సింగిలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్రం ప్రారంభం.

0

నార్సింగిలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్రం ప్రారంభం.

మెదక్ టుడే:మెదక్ జిల్లా న్యూస్,జూలై,28,(ప్రతినిధి పి.దుర్గేష్ గౌడ్)పాపన్నపేటమండలంగ్రామంలో మంగళవారంఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా నగదు జమ, నగదు ఉపసంహరణతో పాటు పలు డిజిటల్ ఆర్థిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు.

0

అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజల
(మెదక్ టుడే న్యూస్:జూలై,28,మెదక్ జిల్లా ప్రతినిధి పి.దుర్గేష్ గౌడ్)
పాపన్నపేటమండలం ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సమయం కావడంతో భక్తులు స్వల్ప సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనంతో భక్తులు

దంచికొట్టిన వర్షం..పరుగులు తీస్తూతున్న వాగులు.

0

దంచికొట్టిన వర్షం.. పరుగులు తీస్తూతున్న వాగులు.

(మెదక్ టుడే న్యూస్:జూలై,28,మెదక్ జిల్లా రిపోర్టార్ పి దుర్గేష్ గౌడ్)
పాపన్నపేట న్యూస్ :-పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగుల్లో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు దాటే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు గ్రామాల్లో ప్రజలు వర్షపు పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్నారు.

వనదుర్గమ్మ సన్నిధిలో జిల్లా విద్యాధికారి.

0

పాపన్నపేట,జూలై,25,(మెదక్ టుడే న్యూస్)మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయ పండితులు శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు, డిఇఓ రాజుకు వేద పండితులు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంటఅక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి ,పవన్ కుమార్, రాకేష్ కుమార్ ,భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు తదితరులు పాల్గొన్నారు.