కౌడిపల్లి,మే,29,మెదక్ టుడే న్యూస్:ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఎమ్మెల్యే కోటా కింద మంజూరు అయిన ఐదు ఇండ్లలో నాలుగు ఇండ్లకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే సునితారెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ. ఎమ్మెల్యే కోటా కింద నర్సాపూర్ నియోజకవర్గంలో 1400 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. ప్రభుత్వం ఇండ్ల నిర్మాణంకు రూ.5 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఇండ్లు నిర్మించుకొని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్షాలు రాకముందే ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. బిల్లుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఉపాధి హామీ లోని వందరోజుల పని దినాల్లో 90 రోజుల పైసలు 60వేలు వీటి కోసం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కౌడిపల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకునే లబ్ధిదారులతో ఆమె మాట్లాడారు. రిజిస్ట్రేషన్ విషయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని తాసిల్దార్ కృష్ణకు సూచించారు. గత కొన్ని రోజులుగా తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలు శిథిలావస్థకు చేరి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి కొత్త భవనాలు నిర్మించేలా కృషి చేయాలన్నారు. భవనాల నిర్మాణం కు అధికారులతో మాట్లాడి మా వంతు కృషిగా చర్చిస్తామని సునీత రెడ్డి తెలిపారు. కాగా కౌడిపల్లి మండలం బుజిరంపేట సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్, ఉప సర్పంచ్ గోపాల్ తోపాటు పలువురు రైతులు తాసిల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి ముందే తాసిల్దార్ కృష్ణను పిలిపించి గత 15 రోజులుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించడం లేదని సునీత రెడ్డి ముందే తాసిల్దార్ ను ప్రశ్నించారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించకుంటే తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులంతా ధర్నా చేపడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నిల్వ ఉండకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా లారీలు పంపించాలని అకాల వర్షాలతో రైతులు వడ్లు తడిసి నష్టపోతున్నారని రెండు రోజుల్లో బుజిరంపేటకు లారీలు పంపించకుంటే తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని తాసిల్దార్ కు సూచించారు.

