ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో సొంతింటి కల సాకారం-ఎమ్మెల్యే సునీత రెడ్డి.

కౌడిపల్లి,మే,29,మెదక్ టుడే న్యూస్:ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఎమ్మెల్యే కోటా కింద మంజూరు అయిన ఐదు ఇండ్లలో నాలుగు ఇండ్లకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే సునితారెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ. ఎమ్మెల్యే కోటా కింద నర్సాపూర్ నియోజకవర్గంలో 1400 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. ప్రభుత్వం ఇండ్ల నిర్మాణంకు రూ.5 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఇండ్లు నిర్మించుకొని ప్రతి ఒక్కరూ సద్వినియోగం...