(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,29,మెదక్ టుడే న్యూస్:రూ.30 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారంమహిళా సాధికారతకు సమాఖ్య భవనంగ్రామ ప్రజల కలగా ఉన్న వంతెన పనులకు త్వరలో పూర్తి హామీమెరిట్ విద్యార్థినిలకు నగదు ప్రోత్సాహకాలు
యువ సర్పంచ్ అఖిల్ రెడ్డి సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యేకేశంపేట మండలంలోని పాటిగడ్డ గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. యువ సర్పంచ్ అఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాటిగడ్డ గ్రామంలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని, త్వరలోనే పూర్తి చేసి ప్రజల రాకపోకల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గ్రామ అభివృద్ధిలో యువ నాయకత్వం ఎంతో కీలకమని పేర్కొంటూ, సర్పంచ్ అఖిల్ రెడ్డి కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిలకు రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సర్పంచ్ అఖిల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో పాటిగడ్డను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల, కొత్తపేట జగదీష్, పల్లె ఆనంద్, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.


