చేగుంట,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని వినాయక స్టిల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రమును ప్రారంభించిన స్థానిక సర్పంచ్ సాయికుమార్ గౌడ్. సర్పంచ్ మాట్లాడుతూ,ఈ వేసవికాలంలో నీరు చాలా ముఖ్యమైనది మా గ్రామానికి వినాయక స్టీల్ వాళ్లు ఇక్కడ చలివేంద్రం పెట్టడం చాలా సంతోషకరంగా ఉన్నది ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర పెట్టడం వలన ప్రజలకు చాలా సౌకర్యం కరంగా ఉన్నది ఇలా పెట్టినందుకు వినాయక స్టీల్ కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదములు అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ సర్పంచ్ నాగరాజు పాలకవర్గ సభ్యు లు,గ్రామ ప్రజలు,వినాయక్ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్ హెడ్ శ్రీనివాసాచార్యులు,మేనేజర్ స్వామి గౌడ్, కంపెనీ సిబ్బంది, పాల్గొనడం జరిగింది
చేగుంట,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డికి పదోన్నతి లభించింది ఆయనను ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది.ఈవిషయమై ప్రిన్సిపల్ ని అడగగా ఇక్కడ చేగుంటలో చాలా సంవత్సరాల నుండి ప్రిన్సిపాల్ గా ఉన్నాను ఇక్కడ పిల్లలు మంచిగా చదువుతారు ఇక్కడ నుండి వెళ్లాలంటే నాకు కొంచెం బాధాకరంగాఉన్నది అని అన్నారు. ఆయన హైదరాబాదులోని కార్యాలయంలో లో బాధ్యతలు స్వీకరించారు.ప్రభుత్వం తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యాశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
చేగుంట,ఏప్రిల్,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ జయభారత్ రెడ్డికి మధ్యాహ్న భోజన విరామ సమయంలో అధికారులకు వినతిపత్రాలు రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. అయినప్పటికీ మిగతా ఎన్నో సమస్యలు అలాగే పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవే కాకుండా న్యాయబద్దమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు. ఇదే విషయాన్ని వివిధ రూపాలలో సీఎస్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతోనే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని,న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు భోజన విరామ సమయంలో డివిజన్,మండల కేంద్రాలలో , తహశీల్దార్లకు వినతిపత్రాలను ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈ జేఏసీ) ప్రధాన డిమాండ్లు జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలి.రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి. హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలి.సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ ఇచ్చి తరువాత నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి.గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలి.ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈ జేఏసీ) నాయకులు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి, తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగేళ్లపల్లి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి సుమతి, కాంప్లెక్స్ కన్వీనర్ చరణ్ దాస్, కో కన్వీనర్ విజయలత, ఎస్ జి టి యు మండల నాయకులు శ్రీనివాస్, శ్రీనివాస్, తపస్ సంఘ సభ్యులు రాధా, సరస్వతి, శారద,,సంధ్యారాణి, శ్రీ వాణి, రమాదేవి, ఉమాదేవి ఉమామహేశ్వరి, డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు కాజా అనిసోద్దిన్ సంపతి, మల్లీశ్వరి, పద్మ, నాగమణి, అనసూయ, రూపా దేవి, చంద్రశేఖర్, వివిధ సంఘాల నాయకులకు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పి ఆర్ టి యు అధ్యక్షలు తిరుపతి రెడ్డి, టి ఆర్ టి ఎఫ్ అధ్యక్షలు జగన్ లాల్, ఎస్ టి యుఅధ్యక్షలు మనోహర్ రావు, టి పి టి ఎఫ్అధ్యక్షలు నర్సింహారావు యు టి ఎఫ్ అధ్యక్షలు బాలపోచయ్య ఎస్ జి టి యూనియన్ నాయకులు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు
కలెక్టర్ స్పందించకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక
అమీన్‌పూర్,ఏప్రిల్ 17,మెదక్ టుడే న్యూస్:అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని సర్వే నెంబర్ 993లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణంపై స్థానిక ప్రజలు, నాయకులు సమరశంఖం పూరించారు. ఈ ప్లాంట్ వల్ల భవిష్యత్తులో ప్రజలు ఇక్కడ నివసించే పరిస్థితి ఉండదని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు వివిధ కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రధానాంశాలు:ఇసుక బాయ్ వాగు నుండి సుమారు 60-70 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టల ప్రాంతంలో ఎస్టీపీని నిర్మించడం ఏ రకమైన ఇంజనీరింగ్? ఎత్తులో ప్లాంట్ కడితే వచ్చే దుర్వాసన, కాలుష్యం గాలి ద్వారా అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇది ప్రజలను అనారోగ్యానికి గురిచేయడమే” అని పాండురంగారెడ్డి మండిపడ్డారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, డంపింగ్ యార్డ్, ఇప్పుడు ఎస్టీపీ.. ఇలా ప్రతిదానికీ అమీన్‌పూర్ భూములనే కేటాయిస్తే, ఇక్కడ నివసించే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పనులు ఆపకపోవడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమని బిఆర్ఎస్ నేతలు ఉపేందర్ రెడ్డి, కొల్లూరి గోపాల్, బిజిలి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకుల తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. బయోడైవర్సిటీ ప్రాంతంగా ఉన్న అమీన్‌పూర్‌లో పెద్ద చెరువును కాపాడటం చేతకాని ప్రభుత్వం, నివాసాల మధ్య ప్లాంట్ పెట్టడం దారుణమన్నారు. దీనివల్ల: కేఎస్ఆర్ కాలనీ, రావుస్ కాలనీ సాయిరాం ఎన్క్లేవ్, రూపశ్రీ కౌంటీ ఎస్ఎస్ హోమ్స్, ద్వారకా అపార్ట్‌మెంట్స్ వంటి అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పనులను నిలిపివేయాలని, లేనిపక్షంలో అన్ని కాలనీల ప్రజలను ఏకం చేసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, కొల్లూరి గోపాల్, బిజిలి రాజు, వివిధ కాలనీల ప్రతినిధులు ఏ.ఎస్.రావు, లక్ష్మణ్, నర్సింహులు, రాజబాబు, రాజేష్, సుబ్బారావు, సంతోష్, సందీప్, విజయ్, మల్లేష్, నరేష్, ప్రశాంత్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..
చేగుంట మండలం, భౌగోళికంగా,వసతుల పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న చేగుంట మండల కేంద్రాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని బీజేపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చేగుంట తహసీల్దార్ శివప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు దొంతిరెడ్డి ఎల్లారెడ్డి మాట్లాడుతూ, చేగుంటలో రైల్వే స్టేషన్, 44వ జాతీయ రహదారి సౌకర్యంతో పాటు ప్రభుత్వ భూములు, పరిశ్రమలు, విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. చుట్టుపక్కల మండలాలకు మధ్యలో ఉండి నియోజకవర్గ ఏర్పాటుకు అన్ని అర్హతలు కలిగిన చేగుంటను, ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు చింతల భూపాల్, ఓబీసీ మోర్చా నాయకులు కరణం గణేష్, రవికుమార్, సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు సాయిబాబా, ఎల్లేష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చేగుంట మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా డ్రైవర్స్ కు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు.డ్రైవర్ల తో చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఆటో ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఇటువంటి పేపర్లు రెన్యువల్ చేసుకోగలరని వారు సూచించారు. అంతేకాకుండా బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని కారు లో వెళ్లేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవాలని వారు అన్నారు పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను ప్రజలు అలవాటు చేసుకో వాలనీ అంతేకాకుండా 5 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్ళే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్డ్ తప్పక ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఏ ఎస్ ఐ సంయోద్దీన్, కానిస్టేబుల్లో రమేష్, బ్రహ్మం,సత్యనారాయణ, పాల్గొన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు మండల స్థాయి సమావేశం చేగుంట రైతు వేదిక లో నిర్వహించారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నారెడ్డి అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఉప సర్పంచ్లు, రైతులు, గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు, యువజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు, ఇట్టి సమావేశంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మూడు విడుతల రైతు భరోసా ఈ యాసంగి 11575 రైతులకు రైతు భరోసా రైతు బీమా 58 మందికి రాను 5 లక్షల రూపాయలు చొప్పున నామినీకి 1,45,00000 లక్షలు 2024-25 లో 54 మందికి రైతు బీమా 2.74 పంట రుణమాఫీ కూడా చేయడం జరిగిందన్నారు, వ్యవసాయ యాంత్రీకరణ సామాగ్రి సబ్సిడీపై కల్టివేటర్స్ వారికి 2 64 985 ఇవ్వడం జరిగిందని సంబంధిత అధికారి తెలిపారు.హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ మండలంలోని మండలంలోని 612 ఇండ్లు మంజూరు అయ్యాయని 454 బేస్మెంట్ పూర్తి అయినాయి 550 మార్క్ అవుట్ అయినాయి అని 31 ఇల్లు పూర్తి అయ్యాయని వీటికి చెల్లించిన తొమ్మిది కోట్ల 81 లక్ష వారికి ఇవ్వడం జరిగింది.తహసిల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ,నూతన రేషన్ కార్డులు 1436 అడిషనల్ గా 5429 2025 26 నందు కళ్యాణ లక్ష్మికి 354 మందికి 34,43,990 చెల్లించినదని తెలిపినారు. విద్యుత్ శాఖ అధికారి మాట్లాడుతూ గృహజ్యోతి కింద 6999 మీటర్లకు గాను జీరో బిల్లుకు ప్రభుత్వం ద్వారా కోటి 92 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతున్నదని తెలియ చేశారు.పంచాయతీ అధికారి మాట్లాడుతూ మన మండలంలో చేయూత పెన్షన్ల కింద మొత్తము 6900 పెన్షన్లు మరియు కొత్త పెన్షన్లు 180 మంది లబ్ధిదారులకు ఇవ్వనైనదని తెలియజేశారు, మరియు వికలాంగుల కోట కింద ఇద్దరు లబ్ధిదారులకు 50 వేల చొప్పున ఉపాధి నిమిత్తం వడియారం మరియు రెడ్డి పల్లి వారికి మంజూరు చేయడమైనదని తెలిపినారు. ఐకెపి ఏపిఎం గుర్గాప్రసాద్ మాట్లాడుతూ మూడు రకాల సేవలలో బ్యాంకు లింకేజీ ద్వారా 558 సంఘాలకు రుణాలు అందిచడం జరిగిందని వడ్డీ లేని రుణాలు 736 సంఘాలకు ఒక కోటి 38 లక్షల 88000 తిరిగి వచ్చాయని, మరియు 13,834 చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరియు ప్రభుత్వం నుండి ఆర్టిసి బస్సు మరియు గోడౌన్ మంజూరు చేయడం జరిగింది అని తెలియజేశారు.పోలీస్ శాఖ అధికారి మాట్లాడుతూ రోడ్డు భద్రత కమిటీలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని . యాక్సిడెంట్లు నివారించుటకు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ను ధరించాలని, మరియు మద్యం సేవించి బళ్ళు నడపద్దని చిన్న పిల్లలకు బైకులు ఇవ్వద్దని సంబంధిత అధికారులు తెలిపినారు.విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ కాంట్రాక్టు ద్వారా 1380,2008 అభ్యర్థులను నియమించడం జరిగిందని తెలిపారు, మరియు 4454 మందికి పదోన్నతి ఇవ్వడం జరిగిందని 34706 మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరిగిందని, టెట్ పాస్ కాని వారు అందరూ కూడా బి.ఎడ్ మరియు డీఎడ్ ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహించబడుతుందని ఉపాధ్యాయులు పరీక్షలు రాస్తున్నారని మరియు వేసవి సెలవులలో 1,12,822 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. మహాత్మా గాంధీ ఉపాధి పథకం ద్వారా సంబంధిత అధికారి మాట్లాడుతూ మండలంలోని జాబ్ కార్డులు 9554, కూలీలు 17915, 2024 25 లో పని దినములు 2,54,519 మరియు 2025 26 లో 14476 పని దినములు 2024 25 లో 49 క్యాటిల్ షెడ్లు 2025 26 లో భాగంగా 26 క్యాటిల్ షెడ్ లు పూర్తి చేసినట్లు తెలిపారు, మండలంలో 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు మరియు ఎంపీడీవో మాట్లాడుతూ 40 మందికి ఒక మేట్ ఉండాలని తెలియజేశారు.మిషన్ భగీరథ ఏఈ మాట్లాడుతూ మండలంలోని 10274 కనెక్షన్లు ఉన్నాయని 78 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు మరియు 58 త్రీఫేస్ మోటర్లు నడుస్తున్నాయని ట్యాంకులలో ఉన్న మెట్లు రిపేరు చేయించాలని తెలియజేశారు. ఇరిగేషన్ ఏఈ గారు మాట్లాడుతూ చెరువులను జాగ్రత్తగా చూసుకోవాలని చేగుంట మరియు వడియారం చెరువులు పొల్యూట్ అవుతున్నదని చెరువులలో ఎఫ్టిఎల్ బౌండరీలు చేపిస్తామని తెలియజేశారు పశువులకు పక్షులకు ఇబ్బంది కాకుండా చెరువులను చూసుకోవాలని సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చిన ఆదేశాలను పాటించాలని తెలిపినారు.పంచాయతీరాజ్ శాఖ అధికారి మాట్లాడుతూ, సి ఆర్ ఆర్ ద్వారా బీటీ రోడ్డుకు ఒక కోటి 90 లక్షలు ఎస్ బి ఎం ద్వారా సోక్ పిట్లకు 16 వేల చొప్పున మరియు ఈజీఎస్ ద్వారా మూడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లకు 60 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలియజేశారు. ఐ సి డి ఎస్ అధికారి మాట్లాడుతూ గర్భవతులు 2410 బాలింతలు 946 మరియు బాలామృతం ఇవ్వడము జరుగుతుందని తెలియజేశారు. ప్రీ స్కూల్లో భాగంగా నూతన సిలబస్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రొటెక్షన్ కమిటీ ద్వారా యూనిఫామ్స్ అందించడం జరిగిందని అంగన్వాడీ టీచర్లకు త్వరలో మొబైల్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. పశు సంవర్ధన శాఖ అధికారి గారు మాట్లాడుతూ 884 పశువులకు వ్యాక్సినేషన్ మరియు 1603 పశువులకు గాను ట్రీట్మెంట్ చేయడం జరిగిందని తెలిపినారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనిల్ మాట్లాడుతూ గర్భవతులను ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయించాలని తెలియజేశారు, పుట్టిన బిడ్డకు ఇమ్యునైజేషన్ వ్యాధులు రాకుండా టీకాలు వేస్తున్నామని 15 సంవత్సరాలలోపు హెచ్పీవీ వ్యాక్సిన్ ఆడపిల్లలకు ఇవ్వడం జరుగుతుందని, వేసవిలో బయటకు వెళ్లే వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉపయోగించాలని అందుబాటులో ఉన్నాయని 9 నుంచి 4 వరకు డ్యూటీలో ఉంటామని,నాలుగు నుండి ఐదు వేలకు ఒక సబ్ సెంటర్ ఉంటదని ఆశ వర్కర్ల ద్వారా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.సోమల తండా సర్పంచ్ మాట్లాడుతూ డ్రైనేజ్ ఇబ్బంది ఉన్నదని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. రెడ్డిపల్లి సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో కరెంటు సమస్య తీరంలో ఉన్నదని ఆ సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులకు తెలియజేశారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెదక్ జిల్లా కొల్చారం మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు.గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు.రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంతో పాటు, ప్రతి ఇంటికి అవగాహన కల్పించే బాధ్యత సర్పంచ్‌లపై ఉందన్నారు.ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలపై రైతులకు ప్రోత్సాహం కల్పించి, వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పేర్కొన్నారు.అనంతరం మండల సమాఖ్య సభ్యురాలు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ అభివృద్ధిలో సంఘాల పాత్ర గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో మహిళలు ఆర్థికంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు.అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసాచారి ప్రత్యేక అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, ఎంపీడీవో, రఫీక్ ఉన్నిసా బేగం సర్పంచ్ . శేఖర్,.వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం డ్రైవర్లకు కలెక్టర్ సూచన
వాహన డ్రైవర్లకు ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్
అతివేగం, డ్రింక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ప్రమాదాలకు సాంకేతాలు జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు
మెదక్,ఏప్రిల్,16,మెదక్ టుడే న్యూస్,
99 రోజుల ప్రగతి ప్రణాళికలో అరైవు-అలైవ్ కార్యక్రమంలో భాగంగామెదక్ మండల కేంద్రంలో బాలాజీ ఫంక్షన్ హాల్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై ద్విచక్ర వాహనదారులు, కారు డ్రైవింగ్ చేసేవారు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం పై పోలీస్-రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలోఅవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలోనే హార్ట్ ఎటాక్ గురైన వారికిసిపిఆర్ ద్వారా ప్రాణదానం చేయవచ్చు అనే నినాదంతో సర్జన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ప్రత్యక్షంగా విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,మెదక్ జిల్లాలో జీరో యాక్సిడెంట్ జోన్ గాతీర్చిదిద్దాలని అన్నారు.పోలీస్ రవాణా శాఖ సమన్వయంతో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల జరిగే ప్రాణం నష్టాలపైఈసమావేశంలో సుదీర్ఘంగా వివరించడం జరిగిందని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు అందరం కృషిచేద్దామని అన్నారు.. మానవ తప్పిదాలవలనే ప్రమాదాలు అధిక సంఖ్యలో మన జిల్లాలో జరుగుతున్నాయనివిలువైన నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలన్నారు. అలాగే, కాగా, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో తక్షణమే స్పందించి ప్రథమ చికిత్స ఎలా చేయాలి, క్షతగాత్రులను సత్వరమే సమీప ఆసుపత్రికి తరలించడం వంటి వాటి పై అవగాహన కల్పించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు మాట్లాడుతూ,నివేదికల ప్రకారం, అతివేగం మరియు అజాగ్రత్త వల్ల తరచుగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రోడ్డు భద్రతా చర్యలను కఠినతరం చేసి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడమే పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యం గా ముందుకు పోతున్నామన్నారు.మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ ప్రజల ప్రాణరక్షణ ధ్యేయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే రోడ్డు ప్రమాదాలపై మనకు కనువిప్పు కలగాలన్నారు. హెల్మెట్ సీడ్ బెల్ట్ మన ప్రాణాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయన్నారు. చిన్న నిర్లక్ష్యం వలనే ప్రమాదాలు అధికంగా జరుగుతాయన్నారు నేటి సమాజంలో యువత ఎక్కువగా ప్రమాదాలు బారిన పడుతున్నారని కుటుంబంలో కొడుకు ప్రమాదంలో చనిపోయినట్లయితే ఆ తల్లికి గర్భశోకం వెలకట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వాహనదారుడు కూడా నిబంధనలు తప్పనిసరి అన్నారు. ప్రయాణం ఎంత ముఖ్యమో గమ్యస్థానం చేరడం కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై కవితల రూపంలో సభలో వినిపించారు.అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రోడ్లపై బాధ్యతగా మెలగాలని రోడ్ల ప్రమాదాల పట్ల చైతన్యం పెంపొందించే విధంగా పోలీస్- రవాణా శాఖ సమన్వయంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకు పోతుందన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ మైనర్ లు వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.ప్రతి ఒక్కరు బయటకు వెళ్లిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు వైద్య శిబిరాన్ని పరిశీలించారు.సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం అని పోలీస్, రవాణా శాఖ సమన్వయంతో ఈ అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతంగా కొనసాగుతూ, మంచిగా నిర్వహిస్తున్నారనిఅభినందించారు.వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలన్నారు.కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని,ఈ కార్యక్రమంలో,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్,మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్,అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో రోజుకు సగటున సుమారు 450 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతుండగా, గత సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి, మరో 3 లక్షల మంది గాయపడ్డారని తెలిపారు.మెదక్ జిల్లాలో గత సంవత్సరం 287 మంది మృతి చెందగా, 631 మంది గాయపడ్డారని వివరించారు. ఈ గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఒకరు రోడ్డు ప్రమాదానికి బలవుతున్నారని చెప్పారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాకుండా, ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం బాధ, కన్నీరు దాగి ఉందని అన్నారు.జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవేనని వెల్లడించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కఠినంగా హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు రైడర్, పిలియన్ ఇద్దరూ ఐ ఎస్ఐ ప్రమాణిత హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయరాదని, ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదని సూచించారు.ఈ సందర్భంగా వైద్యుడు సీపీఆర్ ( సి పి ఆర్ ) ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలను ప్రదర్శనతో వివరించారు. అలాగే డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి వెంకట స్వామి, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి, జార్జ్, మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.