📄 ePaper
Saturday, September 19, 2026
ADS
Home Blog Page 26

రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న జనగణన ను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

0

చేగుంట,మే,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ , ఫీల్డ్ స్థాయి ఎన్యూమరేషన్ ప్రక్రియను సమీక్షించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సిబ్బందితో మాట్లాడి, జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకంగా మరియు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి వివరాలను పూర్తిగా సేకరించడం సర్వే సమయంలో వివరాలను సరిగా ధృవీకరించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.అలాగే, జనగణన కార్యక్రమంలో ఏ అర్హ కుటుంబం కూడా మిగిలిపోకుండా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, చేగుంట ఎంపీడీవో చిన్నారెడ్డి, వివిధ అధికారులు పాల్గొన్నారు.

వారం రోజులైనా లారీలు లేవు.

0

-పట్టించుకోని అధికారులు

-అంసాన్ పల్లి పోతిరెడ్డిపల్లి కొంగోడు గ్రామాల రైతుల ఆవేదన

-రెండు రోజులలో తూకం వేసిన బస్తాలను రైస్ మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తా: తహసిల్దార్ శ్రీనివాస చారి

    కొల్చారం,మే,21,(మెదక్ టుడే న్యూస్)ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసి వారం రోజులు గడిచిన కూడా లారీలు రావడం లేదని అంసాన్ పల్లి పోతిరెడ్డిపల్లి కొంగోడు గ్రామాల రైతులు గురువారం తాసిల్దార్ శ్రీనివాస చారిని, ఎస్సై మహమ్మద్ మొయినుద్దీన్ లను కలిసి మొరపెట్టుకున్నారు. సకాలంలో లారీలు పంపాలని ఆ గ్రామాల రైతులు తహసిల్దార్ నువేడుకొన్నారు.తహసిల్దార్ శ్రీనివాస చారి ఇచ్చిన హామీ,ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసచారి మాట్లాడుతూ రెండు రోజులలో తప్పకుండా లారీలు పంపించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు కూడా అధికారులతో సహకరించాలని కోరారు. రైతుల వద్ద ట్రాక్టర్లు ఇతర సొంత ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఉంటే ఉపయోగించుకోవాలని సకాలంలో అన్లోడ్ చేసే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం అంసానిపల్లి సొసైటీ చైర్మన్ మన్నే రాములు, సర్పంచులు స్వామి, గీతా రమేష్, ఉప సర్పంచులు , రైతులు తదితరులు పాల్గొన్నారు.

    ముఖ్యమంత్రి – కార్మిక శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం.

    0

    కొల్చారం,మే,21,(మెదక్ టుడే న్యూస్)తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త చెప్పి, కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. కనీస వేతనాలు పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న అతి గొప్ప నిర్ణయం కనుక నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కొల్చారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వర్యులు డా వివేక్ వెంకటస్వామి ఫోటోలకి పాలాభిషేకం కార్యక్రమం ఉన్నది.కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు సింగిల్ విండో చైర్మన్లు ముఖ్య నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    వడియారం పెద్దమ్మ దేవాలయానికి ధూప దీప నైవేద్యానికి 5000 రూపాయలు.

    0

    ఉప సర్పంచ్ గా ఉన్నంతకాలం ప్రతినెల 5000 రూపాయలు ఇస్తాను మహమ్మద్ రఫీ

    చేగుంట,మే,21,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పెద్దమ్మ దేవాలయానికి రంగుల నిమిత్తం చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ (2,11,000 )రూపాయలు రెండు లక్షల పదకొండు వేల రూపాయలు అందజేశారు. అలాగే ధూప దీప నైవేద్యానికి ప్రతినెల 5000 రూపాయలు ఇస్తానని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ అన్నారు. నేను ఉపసర్పంచ్ గా ఉన్నంతకాలం ఇస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఘనమైన పాండు మామిండ్ల బాలయ్య,పున్న యాదగిరి, మొగిలి నరసింహులు నరసింహులు,మహేందర్ డీలర్ రామచంద్రo తదితరులు పాల్గొన్నారు.

    మస్జిద్ అభివృద్ధికి 7 లక్షల మంజూరు చేయించిన సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి.

    0

    చేగుంట,మే,21,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కన్యారం గ్రామంలోనిఇబ్రహీం మజీద్ కు రూ.7 లక్షలు మంజూరు చేయించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మజీద్ కమిటీ సభ్యులు, మరియు గ్రామ నాయకులుహృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోచేగుంట మండల ప్రెసిడెంట్ నవీన్కుమార్ , మండల నాయకులుకాశబోయిన భాస్కర్,యువ నాయకుడు సతీష్, ఉప సర్పంచ్ మాజీ మోహన్ సర్పంచ్ మహిపాల్, మజీద్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సల్మాన్ గౌరీ, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ తయ్యబ్,సభ్యులు సాజిద్, అన్వర్, ఈనా, అజీమ్, అలీమ్, వాజిద్, తహేర్ కొలుపుల స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే కన్యారంసర్పంచ్ శంకర్, వార్డ్ మెంబర్లు మహేశ్, నవీన్,ఇతర అతిథులు హాజరయ్యారు.

    బోనాల కొండాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

    0

    లారీల పంపిణీలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

    చేగుంట,మే,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం బోనాల బోనాల కొండాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వడ్లు అమ్మడానికి తీసుకువచ్చిన రైతులు లారీల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.లారీల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు భరోసా కల్పిస్తూ, “లారీలను వెంటనే పంపించేలా చర్యలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే లారీలను ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.లారీల పంపిణీలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

    చేగుంటలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణం..

    0

    చేగుంట,మే,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ ) పిలుపు మేరకు అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టిన దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ చేగుంట మండల కేంద్రంలో సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి. రాజు, కార్యదర్శి సంగమేశ్వర్, కోషాధికారి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుతో చేగుంట ఏరియా అసోసియేషన్ పరిధిలోని అన్ని ప్రైవేట్ ఔషధ విక్రయ శాలల నిర్వాహకులు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించి తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయడంతో పట్టణంలోని మెడికల్ లైన్ నిర్మానుష్యంగా మారింది; ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆన్‌లైన్ ఫార్మసీలలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ (రసీదు) లేకుండా ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతోఆటలాడుకుంటున్నారని, గతంలో కోవిడ్ సమయంలో తెచ్చిన జీఓ నంబర్ 220ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ఆన్‌లైన్ అక్రమ విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను, లక్షలాది మంది కెమిస్టుల జీవనోపాధిని కాపాడేందుకు నిర్వహించిన ఈ బంద్‌కు స్థానిక ప్రజలు పూర్తిగా సహకరించారు.

    అభివృద్ధిలో అమీన్‌పూర్, బీరంగూడలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

    0

    అమీన్‌పూర్,మే,20,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ డివిజన్, బీరంగూడ డివిజన్ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు.ఈ పర్యటనలో భాగంగా తులసివనం కాలనీ, భ్రమరాంబిక నగర్, ఏఆర్ బృందావన్, కెఎస్ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, టైలర్ కాలనీ, ఎన్ఎస్ఎల్ కాలనీ, ఎన్బీఆర్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. నేరుగా ప్రజలు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమై క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సీసీ రోడ్లు, యూజిడీలు, విద్యుత్, తాగునీరు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల సమస్యలపై సమగ్ర నివేదికను తనకు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నివేదికల ఆధారంగా నిధులు కేటాయించి, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు.తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: అమీన్‌పూర్ పరిధిలో దశాబ్దాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించి, ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామని, నూతన కాలనీలకు సైతం నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.
    ప్రభుత్వ స్థలాల రక్షణ: కాలనీలలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
    మెరుగైన పారిశుద్ధ్యం: పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా నూతన సిబ్బందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.
    విద్యుత్ వ్యవస్థ బలోపేతం: నూతన కాలనీల ఏర్పాటుతో పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడటం తన నైజమని, మిగతా సమయమంతా ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జిఎంఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరిస్తూ, అవసరమైన నిధులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అతి త్వరలోనే బీరంగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే స్వయంగా కాలనీలకు రావడం పట్ల స్థానిక ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,కృష్ణ, బాలరాజు,యూనుస్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ సురేష్, డిఈ వెంకటరమణ, జలమండలి డిజిఎం శివకుమార్, విద్యుత్ శాఖ ఏడి సంజీవ్ మరియు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

    రసాయన శాస్త్రంలో కేత స్వరూపకుపీ హె చ్.డీ.

    0

    పటాన్ చెరు,మే,20,(మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి,హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కేత స్వరూప డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘చాల్కోన్ కలిపిన పిరిడిన్-పిరిమిడిన్, 1,2,4-ఆక్సాడయాజోల్ కలిపిన ఇండోలిజైన్-థయాడయాజోల్ ఉత్పన్నాల రూపకల్పన, సంశ్లేషణ, జీవ మూల్యాంకనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్తలూరి సుధాకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు..డాక్టర్ స్వరూప చేసిన డాక్టరల్ పరిశోధన, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో, ఆశాజనకమైన వైద్యపరమైన అనువర్తనాలు కలిగిన నూతన రసాయన సమ్మేళనాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందన్నారు.ఈ పరిశోధనలో భాగంగా, డాక్టర్ స్వరూప ఔషధపరంగా ముఖ్యమైన రసాయన నిర్మాణాలను ఏకీకృతం చేయడం ద్వారా జీవశాస్త్రపరంగా ప్రాముఖ్యత కలిగిన రెండు శ్రేణుల సమ్మేళనాలను రూపొందించి, సంశ్లేషించినట్టు తెలిపారు. సంశ్లేషించిన ఈ సమ్మేళనాలను ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీతో సహా ప్రామాణిక విశ్లేషణాత్మక పద్ధతులను ఉపయోగించి నిర్మాణాత్మకంగా వర్గీకరించి, తదనంతరం వాటి జీవ క్రియాశీలతను మూల్యాంకనం చేశారన్నారు. అనేక సమ్మేళనాలు ప్రోత్సాహకరమైన ఫలితాలను కనబరిచాయని, భవిష్యత్తు ఔషధ అభివృద్ధికి వాటి సామర్థ్యాన్ని సూచిస్తున్నాయని వివరించారు.ఈ అధ్యయనం ఔషధ రసాయన శాస్త్ర రంగానికి విలువైన అంతర్దృష్టులను అందిస్తుందని, క్యాన్సర్ చికిత్స కోసం సమర్థవంతమైన చికిత్సా ఏజెంట్ల అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుందన్నారు.డాక్టర్ స్వరూప సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    బీరప్ప స్వామి జాతర మహోత్సవానికి రూ. 2 లక్షల విరాళం అందజేసిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు.

    0

    పటాన్‌చెరు,మే,20,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి:ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు తన ఉదారతను చాటుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లన్న స్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ కామరాతి – బీరప్ప స్వామి వార్ల కళ్యాణ (జాతర) మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, పర్స శ్యామ్‌రావు – పర్స పద్మ దంపతులు భారీ విరాళాన్ని ప్రకటించారు.బుధవారం వారి నివాసంలో గొల్ల మరియు కురుమ సంఘం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి, జాతర మహోత్సవాల నిర్వహణ కొరకు రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయల) నగదు ఆర్థిక సహాయాన్ని వారు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా పర్స శ్యామ్‌రావు మాట్లాడుతూ.. గ్రామీణ సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలైన జాతర మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. స్వామివార్ల కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండి, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని ఆయన కోరుకున్నారు. సమాజంలో కులసంఘాల బలోపేతానికి, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.జాతర మహోత్సవానికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించి, తమకు అండగా నిలిచిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు కి, పద్మ కి గొల్ల & కురుమ సంఘం పెద్దలు, నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.