📄 ePaper
Saturday, September 19, 2026
ADS
Home Blog Page 27

ఆడ శిశువు తల్లిదండ్రులకు నగదు బహుమానం.

0

గణపురం సర్పంచ్ చందపురం మధుసూదన్ రెడ్డి

కొల్చారం,మే,20,(మెదక్ టుడే న్యూస్)మండల పరిధిలోని చిన్న ఘనపూర్ గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి నూతనంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన దంపతులకు బుధవారం నగదు బహుమానం అందజేస్తారు. గ్రామానికి చెందిన పోతరాజు లక్ష్మీ భాస్కర్, మంద వరలక్ష్మి శ్రీకాంత్, నాన్నగారి కృష్ణవేణి సందీప్, తాటి శోభ వెంకటేశం, నాగం చిత్రా నితిన్ దంపతులకు ఒక్కొక్కరికి రూ. 5116 రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేర కు నగదు బహుమానం అందజేశానన్నారు. పదవిలో ఉన్నంతకాలం మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంటి చిరుకానుక పథకాన్ని అమలు పరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు, పిఎసిఎస్ చైర్మన్ మందానాగులు, కాంగ్రెస్ నాయకులు రాజబోయిన అశోక్, దార ప్రకాష్, రమావత్ సురేష్, నాగ రమేష్, వడ్ల లక్ష్మీపతి, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కమ్మరి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ ని కలిసిన సర్పంచులు.

0

కొల్చారం,మే,20,(మెదక్ టుడే న్యూస్)గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అప్పాజీపల్లి సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి అభ్యర్థించారు. సిసి రోడ్లు పంచాయతీ భవనం అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల రాజా గౌడ్ నెల్లి నవీన్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.

0

కొల్చారం మండలం మే 20 (మెదక్ టుడే న్యూస్)మండలంలోని అంసానిపల్లి ఎనిగండ్ల తుక్కాపూర్ గ్రామాలలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి సతీష్, సవిత, ప్రమీల, సురేష్ మాట్లాడుతూ వరి పంట యాజమాన్య పద్ధతులు నారుమడి నిర్వహణ, నీటి వినియోగం, మక్కా పత్తి పంటలలో కలుపు నివారణ క్రీడల నివారణ వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. జీవన ఎరువుల కొరకు పచ్చిరొట్ట విత్తుకుని కలియ దున్నాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గీతా రమేష్, ఆంజనేయులు, లక్ష్మీ పెంటయ్య, పి ఎస్ ఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, నాయకులు రవీందర్, ప్రవీణ్ రెడ్డి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

0

కొల్చారం మండలం (మెదక్ టుడే న్యూస్)వేసవి కాలం ఎండ దెబ్బ భారీ నుంచి చిన్నపిల్లలను… మహిళలు తగు జాగ్రత్త తీసుకోవాలని కొల్చారం ఏఎన్ఎం లు మజితా బేగం, కవిత మహిళలకు సూచించారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం లోని సబ్ సెంటర్లో పిల్లల తల్లులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎండ దెబ్బ నుంచి రక్షణ కోసం ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని తాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రాణి కవిత, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై సమర శంఖారావం

0

కొల్చారం మండలం మే 20 (మెదక్ టుడే న్యూస్):

  • వారం రోజులు గడుస్తున్న లారీలు లేవు
  • 3000 బస్తాలు తూకం చేసి ఉన్న బస్తాలు
  • పని లేక వెళ్ళిపోతామంటున్న హమాలీలు

అలసత్వాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని అంశాన్ని పల్లి గ్రామ రైతులు సమర శంఖారావం పూరించారు. సుమారు 3000 తూకం వేసిన బస్తాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారం రోజులుగా లారీలు లేకపోవడంతో ఎక్కడికక్కడ రైతులు అట్టుడికి పోతున్నారు. మరో వైపు 25 లారీల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మగ్గుతుంది. ఇంకోవైపు వర్షాకాలం, ఉరుములు మెరుపులతో ఎప్పటికప్పుడు రైతాంగాన్ని బెంబేలెత్తిస్తోంది. దీంతో మౌనంగా ఉంటే నష్టం ఖాయం అనుకున్న రైతులు గురువారం పోరుబాటకు సిద్ధమయ్యారు. సుమారు 500 మంది రైతులతో మండల కేంద్రమైన కొల్చారం వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకోకు గ్రామ సర్పంచ్ కన్నబోయిన గీతా రమేష్, పిఎసిఎస్ చైర్మన్ మన్నే రాములు, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి ఇతర నాయకులు రైతుల ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరావడమో రైతులు ఓడడమో ఖాయమన్న పంతంతో రోడ్ ఎక్కడున్నా రైతన్నలు. అధికారుల నిర్లక్ష్యం రైతన్నల మెడలో ఉరితాడ ఈ వేలాడుతూ ఉంటే, రణమో, ప్రాణమో అన్న తెగింపుతో రైతులు పోరుబాటకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. అంసానిపల్లి రైతులకు మద్దతుగా మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యమ స్పూర్తికి ప్రతీకగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీకి ఘన సన్మానం.

0

ఉద్యమకారుల గుర్తింపే నిజమైన తెలంగాణ ఆత్మగౌరవం,ప్రొఫెసర్ కోదండరాం
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,20, మెదక్ టుడేన్యూస్:
తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ప్రముఖ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ Professor Kodandaram ను తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి. వెంకట్ రాంరెడ్డి (మాజీ జడ్పీటీసీ, ఫరూఖ్‌నగర్) ఆధ్వర్యంలో వారి పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో తెలంగాణ ఉద్యమ కాలం, ఉద్యమకారుల పాత్ర, భవిష్యత్తులో వారికి లభించాల్సిన గుర్తింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ స్థాయిలో ఉద్యమం కోసం కష్టపడిన కార్యకర్తలు, విద్యార్థి నాయకులు, ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం గుర్తించాలని నాయకులు కోరారు.దీనికి స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో భాగమైన ప్రతి ఉద్యమకారుడి సేవ అమూల్యమని, వారిని గుర్తించేందుకు సరైన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తి నిలిచి ఉండాలంటే ఉద్యమకారులకు గౌరవం, గుర్తింపు కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పినపాక ప్రభాకర్, టీజీ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, కాదే సుధాకర్, కావాలి యాదగిరి, రవి గౌడ్, మేకల వెంకటేష్, సిద్దం విటలయ్య, దొడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

పాపన్న పేట మండల అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్ నియామకం.

0
Oplus_16908288

మెదక్ :పాపన్నపేట,20,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పాపన్న పేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా పాపన్నపేట గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, నరేందర్ గౌడ్
నియామకం అయ్యారు.మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లు మెదక్ జిల్లాలోని మండలాల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అందులో భాగంగానే పాపన్నపేట మండలానికి లింగంపేట నరేందర్ గౌడ్ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో పాపన్నపేటకాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మండలం లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

గీతం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘ఫ్యూచర్ ఎక్స్5

0

పటాన్ చెరు, మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.పరిశ్రమకు సంబంధించిన జ్జానాన్ని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను విద్యార్థులకు అందించడానికి ‘ఫ్యూచర్ ఎక్స్5’ పేరిట ఒక చైతన్యవంతమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల శ్రేణికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. గీతంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తి మార్గదర్శకత్వ డైరెక్టరేట్ (టీఎంసీజీ)లోని శిక్షణ, సామర్థ్య వికాస (టీసీడీ) విభాగం దీనిని ఏర్పాటు చేస్తున్నటు డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ప్రాజెక్టు మేనేజ్ మెంట్, క్వాంటం కంప్యూటింగ్, కార్పొరేట్ రెడీనెస్, ఎథికల్ హ్యాకింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల నుంచి అనుభవజ్జులైన నిపుణులను తీసుకురావడం ద్వారా విద్య, పరిశ్రమ అంచనాల మధ్య అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా డాక్టర్ రోజీనా వివరించారు.మే 23 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ సెషన్లు, ప్రతివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఆచరణాత్మక అవగాహన పొందడం, ప్రముఖ సంస్థల నిపుణులతో సంభాషించడం, ప్రస్తుత మార్కెట్ పోకడలను అర్థం చేసుకోవడం, వారి వృత్తిపరమైన, కెరీర్ సంసిద్ధతను మెరుగుపరచుకోవడం వంటివి చేస్తారని డాక్టర్ రోజీనా తెలిపారు.మే 23న వినియోగదారు సంబంధాల నిర్వహణ (సీఆర్ఎం), ప్రాజెక్టు నిర్వహణలను విల్ కామ్ డెలివరీ మేనేజర్ శశిధర్ కొండూరి పరిచయం చేస్తారన్నారు. మే 30న క్వాంటం కంప్యూటింగ్, భద్రతను ఈవై డైరెక్టర్ మూర్తి పరవశివం వివరిస్తారని తెలిపారు. మే 31న కార్పొరేట్ సంస్కృతిని అర్థం చేసుకోవడం, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ఉత్పాదకత, స్వీయ బ్రాండింగ్ లపై ఎంఎక్స్4 భాగస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గురుసిద్ధయ్య శిక్షణ ఇస్తారన్నారు. జూన్ 6న నైతిక హ్యాకింగ్ ను లిబరల్ సెక్యూరిటీ వ్యవస్థాపకులు సుజయ్ గంకిడి పరిచయం చేస్తారని డైరెక్టర్ వివరించారు.పరిశ్రమ భవిష్యత్తు పోకడలను అన్వేషించడానికి, వృత్తిపరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి, అభివృద్ధి చెందుతున్న కెరీర్ రంగాలకు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆయా సెషన్లలో చురుకుగా పాల్గొనాలని డాక్టర్ రోజీనా మాథ్యూ సూచించారు.

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు ఘనంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

0

పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్, కే హెచ్ వై యువసేన బృందం

ఎమ్మెల్యే మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలి: కోటే హరీష్ ఆకాంక్ష

పటాన్ చెరు మే,19,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి:పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి – శ్రీమతి యాదమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్ మరియు కే హెచ్ వై యువసేన ప్రతినిధుల బృందం ఎమ్మెల్యే నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి వివాహ వార్షికోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్ మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో ఆయన అందించిన సేవలు ఎనలేనివని, ప్రజా సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపనను ప్రజలు ఎన్నటికీ మరవరని పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్యే దంపతులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజాదరణ కలిగిన నాయకుడు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నతమైన స్థానాలను, ఉన్నతమైన పదవులను అధిరోహించాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కోటే హరీష్‌తో పాటు కే హెచ్ వై యువసేన బృందం సభ్యులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

పటాన్‌చెరు నియోజకవర్గంలో ముమ్మరంగా సాగిన మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన.

0

ఒకేరోజు రూ.84 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రతి మున్సిపాలిటీకి రూ.15 కోట్ల భారీ నిధుల విడుదల

పటాన్‌చెరు,మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి నేడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు వేలాదిగా తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మొత్తంగా నియోజకవర్గవ్యాప్తంగా సుమారు రూ.84 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే భానూర్‌లో రూ.8.30 కోట్ల వ్యయంతో విశాఖ పీడబ్ల్యూడీ రోడ్డు నుండి శంకరపల్లి–పటాన్‌చెరు రోడ్డు వరకు కంచర్లగూడెం మీదుగా నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు.తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో రూ.60.94 లక్షలు, జిన్నారం కేజీబీవీలో రూ.70.95 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపన చేసి, సోలక్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.1985లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతానికి బీడీఎల్, ఓడీఎఫ్ వంటి ప్రతిష్టాత్మక రక్షణ రంగ పరిశ్రమలను తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆమె సేవలను స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో ఇందిరమ్మ విగ్రహాన్ని ఏర్పాటుచేయడంసముచితమన్నారు.భానూర్ కార్మికుల హౌసింగ్ సొసైటీకి స్థల కేటాయింపు చేపడతామని, పటాన్‌చెరు నుండి శంకర్‌పల్లి వరకు 100 ఫీట్ల రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో లేని విధంగా ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, జూన్ 2వ తేదీ నుండి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పటాన్‌చెరు అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా మరియు మౌలిక వసతుల రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒకేరోజు రూ.84 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీ జీ ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.