📄 ePaper
Wednesday, April 15, 2026
ADS
HomeTS political newsరామచంద్రపురంలో బావర్చి హౌస్ ఏసీ రెస్టారెంట్ ప్రారంభం.

రామచంద్రపురంలో బావర్చి హౌస్ ఏసీ రెస్టారెంట్ ప్రారంభం.

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి

రామచంద్రపురం,ఏప్రిల్,3,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘బావర్చి హౌస్’ ఏసీ రెస్టారెంట్ శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.

స్థానికులకు చేరువలో నాణ్యమైన రుచులు:

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ.. రామచంద్రపురం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించే ఇలాంటి ఆధునిక రెస్టారెంట్లు రావడం శుభపరిణామన్నారు. యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి వ్యాపార రంగంలో రాణించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

మెనూ ప్రత్యేకతలు:

రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ.. వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, పూర్తి హైజీనిక్ వాతావరణంలో భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. తమ వద్ద ప్రత్యేకంగా:

  • హైదరాబాదీ దమ్ బిర్యానీ •నార్త్ ఇండియన్ స్పెషల్స్
  • ​చైనీస్ వంటకాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ గన్ని, గఫర్, ఏకే ఫౌండేషన్ చైర్మన్ ఖదీర్, సోహెల్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments