రామచంద్రపురంలో బావర్చి హౌస్ ఏసీ రెస్టారెంట్ ప్రారంభం.
ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి రామచంద్రపురం,ఏప్రిల్,3,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘బావర్చి హౌస్’ ఏసీ రెస్టారెంట్ శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. స్థానికులకు చేరువలో నాణ్యమైన రుచులు: ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ.. రామచంద్రపురం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించే ఇలాంటి ఆధునిక రెస్టారెంట్లు...