📄 ePaper
Saturday, September 19, 2026
ADS
Home Blog Page 28

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

0

పటాన్‌చెరు,మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, వారి సతీమణి యాదమ్మ గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ… పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజానేత, శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, వారి సతీమణి యాదమ్మ గారు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఎమ్మెల్యే గారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వారి వైవాహిక జీవితం ఇలాగే ఎల్లప్పుడూ ఆనందంగా సాగాలని, నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సత్కార కార్యక్రమంలో అమీన్‌పూర్ జిహెచ్ఎంసి కి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కొల్లూరి చంద్రకళ గోపాల్, ప్రమోద్ రెడ్డి,బోయిని బాలరాజు,మాజీ కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు,చౌటకురి మహిపాల్ రెడ్డి, కొల్లూరి యాదగిరి,దాసు యాదవ్, ఐలాపూర్ నర్సింగ్ రావు… తదితరులు ఉన్నారు.నాయకులంతా ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం.

0

చేగుంట,మే,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీకార్యాలయంలో మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం చైర్మన్ తాడెం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఉష్ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ,వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా
తీర్మానాలు చేసి సంతకాలు చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడతూ కొనుగోలు కేంద్ర ల లో ఎలాంటి సమస్య ఉన్న చైర్మన్ కి గాని, డైరెక్టర్ లకు సంప్రదించాలని రైతులు ఎవరు అధైర్య పడకూడదని, ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని, అన్నారు, సమావేశంలో డైరెక్టర్లు ఎత్తిన పలు సమస్యలపై వెంటనే సంబంధిత స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో తో మాట్లాడడం జరిగింది, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యాలయనికి కొత్తగా 25 కాంటాలు వచ్చినాయని,అవుసరం ఉన్న వారు (వి ఏ ఓ లు )వచ్చి, పాతవి ఇచ్చి కొత్తవి తీసుకుగలరని అన్నారు ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, అన్నం ఆంజనేయులు, కాషాబోయిన శ్రీనివాస్, మొహమ్మద్ రఫీ, శ్రీధర్ రెడ్డి, పక్కిర్ నాయక్, కుర్మ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఎస్ ఐ కి వినతి ఇచ్చిన వివోఏలు.

0

చేగుంట,మే,19,మెదక్ టుడే న్యూస్:రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, వివోఏ ల రాష్ట్ర కమిటీ మేరకు మే 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మె చేపట్టినట్లు చేగుంట వివోఏ ల సంఘం సభ్యులు ప్రకటించారు మంగళవారం స్థానిక ఎస్ ఐ చైతన్య కుమార్ కి కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. తమకు మద్దతు ఇవ్వాలని అన్నారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న విఓఏ లకు : కనీస వేతనం 20,000వేలకు పెంచాలని.ఆరోగ్య హెల్త్ పాలసీ , పదోన్నతులు ఆరోగ్య బీమా, ట్యాబ్ స్వాకర్యంకల్పించాలనివిన్నవించారు .న్యాయమైన డిమాండ్ లు తీర్చాక పోతే వెనక్కి తగ్గేది లేదని తెలిపారు.ఈ కార్యక్రమం లో అవుబోతు స్వామి, భానుప్రయ్, కవిత, హారిక, అరుణ, పద్మ, మనీషా,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసినమార్కెట్ కమిటీ చైర్మన్.

0

చేగుంట,మే,19,మెదక్ టుడే న్యూస్:నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు,చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామానికి చెందిన బొల్ల మహేష్ కు రూ.60,000రూపాయలు, వల్లభపూర్ గ్రామానికి చెందిన, బత్తుల కొమరయ్య కు 15000 రూపాయలు, విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు వారి కుమారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

లారీలు పంపించండి సారు.

0

లారీల కొరకు రైతులు ఆవేదన

కొల్చారం,మే,19,( మెదక్ టుడే న్యూస్)ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 3500 బస్తాలు తూకం వేసి ఉంచామని, వారం రోజులు గడుస్తున్న లారీలు రావడంలేదని, తమకు వెంటనే లారీలు పంపించాలని పోతంశెట్టిపల్లి గ్రామ రైతులు తాసిల్దారును కోరారు. వరిగుంతం లోని ఎఫ్ఎంసీ గోదాము వద్ద తాసిల్దార్ శ్రీనివాస్ చారిని కలిసి రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తాసిల్దార్ మాట్లాడుతూ పోతంశెట్టిపల్లి గ్రామంలో తీవ్ర లారీలు కొరత ఉందని ముందుగా అక్కడికే లారీలు పంపిస్తానని చెప్పడంతో అప్పాజీపల్లి రైతులు అసంతృప్తికి లోనై తమకు లారీలు పంపించాలని తాసిల్దార్ తో వాదానికి దిగారు. అనంతరం పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పడంతో. రైతులు శాంతించారు. తమ గ్రామానికి కనీసం ఒక్క లారీ అయినా పంపిస్తే బాగుంటుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో అప్పాజీపల్లి సీతారాం తండా వరిగుంతం గ్రామ రైతులు ఉన్నారు.

జనగణన పారదర్శకంగా నిర్వహించాలి డిప్యూటీ తహసిల్దార్ రమేష్.

0

చేగుంట,మే,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో సెన్సెస్ 2027 మొదటి దశ ఇండ్ల గణనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్ల గణన ను పారదర్శకంగా నిర్వహించాలని, సెన్సెస్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు పాటించాలని, వారు విధించిన గడులోపు పూర్తిచేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ చల్లా లక్ష్మణ్, రమాదేవి, ఏనిమరేటర్ విజలత తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి పేదలకు వరం చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు.

0

చేగుంట,మే,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామానికి చెందిన అప్పల మహితకు మంజూరైన రూపాయలు 17,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు సోమవారం నాడు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం అని వైద్య ఖర్చులు నిమిత్తం ఈ నిధులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోదం నాగరాజు ఎర్ర సిద్ధ రాములు వడియారం ఎల్లం ఎర్రబాలు ఎర్ర రవి బండారి సాయిలు తలారి మల్లేష్ తలారి నవీన్ గడ్డమీది ప్రసాద్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

1976 డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైల అపూర్వ కలయిక.

0

మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆత్మీయ స్నేహ సమ్మేళనం.

(స్పెషల్ కరస్పాండెంట్)హైదరాబాద్,మే,17,మెదక్ టుడే న్యూస్:
1976లో డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైలుగా ఎంపికై అనంతపూర్ పీటీసీలో కలిసి శిక్షణ పొందిన మాజీ పోలీసు అధికారులు, హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆప్యాయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రిటైర్డ్ డి.ఎస్.పి. యోహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్నేహ సమ్మేళనం ఎంతో ఆత్మీయంగా, ఆనందభరితంగా సాగింది.ఇటీవల అనంతపూర్‌లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న అనంతరం, యోహాన్ కుమారుడు రాహుల్ వివాహ సందర్భంగా తన సహచర మిత్రులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. విజయ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ డిఎస్పి పిఎస్‌ఎస్‌పీ ప్రసాద్ బాబు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రామ్ కిషన్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజయ్య, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నరసింహులు తదితరులు హాజరై స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసుకున్నారు.ఈ సందర్భంగా రామ్ కిషన్ మాట్లాడుతూ,స్నేహానికి మించిన సంపద లేదు. ఐదు దశాబ్దాలు గడిచినా మన మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడటం ఆనందంగా ఉంది. ఇలాంటి కలయికలు జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి” అని పేర్కొన్నారు.విజయ్ సింగ్ మాట్లాడుతూ,ట్రైనింగ్ రోజుల జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు ఈరోజు మళ్లీ కళ్లముందు తిరిగాయి. అందరం వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయినా మన స్నేహం మాత్రం ఎప్పటికీ చెదరలేదు” అని తెలిపారు.
యోహాన్ మాట్లాడుతూ,అనంతపూర్ పీటీసీలో మొదలైన మన స్నేహ ప్రయాణం ఇప్పటికీ ఇంత బలంగా కొనసాగుతుండటం ఎంతో గర్వంగా ఉంది. కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండటం జీవితంలో గొప్ప వరం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు* పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ,50 సంవత్సరాల తర్వాత కూడా ఇంతటి ఆత్మీయతతో, పరస్పర ప్రేమాభిమానాలతో కలుసుకోవడం నిజంగా ఆదర్శప్రాయం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి మానవ సంబంధాలను, స్నేహ బంధాలను కాపాడుకోవాలి” అనిఅభిప్రాయపడ్డారు.కార్యక్రమం మొత్తం హాస్య సంభాషణలు, పాత అనుభవాల చర్చలు, ట్రైనింగ్ రోజుల జ్ఞాపకాలతో సందడిగా సాగింది. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు ఆనందంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, భవిష్యత్తులో కూడా తరచూ ఇలాంటి గెట్‌టుగెదర్‌లు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు.

మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్.

0

చేగుంట,మే,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం (ఏఐఓసీడీ ) పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ బుధవారం దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపుల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (టీటీసీడిఏ ) రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు టి. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు చేగుంట లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టి రాజు మాట్లాడుతూ భారతదేశంలోని సుమారు 12.40 లాక్స్ ఔషధ విక్రేతలు పాల్గొంటున్న ఈ సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను (జి .స్ .ర్ . 817(ఈ)) ఉల్లంఘిస్తూ ఇంటర్నెట్ ద్వారా సాగుతున్న అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు; కార్పొరేట్ సంస్థల ప్రిడేటరీ ప్రైసింగ్ (భారీ డిస్కౌంట్లు) విధానాల వల్ల క్షేత్రస్థాయిలోని చిన్న, మధ్యతరహా రిటైల్,హోల్‌సేల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్‌లైన్‌లో యాంటీబయాటిక్స్ విక్రయించడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏ ఎమ్ ఆర్ ) పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోవిడ్-19 సమయంలో అత్యవసర సేవల కోసం తెచ్చిన తాత్కాలిక సడలింపుల ఉత్తర్వులను (జి .స్ .ర్ . 220(ఈ )) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధ రంగాన్ని కాపాడుకోవడానికి, నిరుపేద రోగులకు నకిలీ మందులు అందకుండా అడ్డుకోవడానికి నిర్వహిస్తున్న ఈ దేశవ్యాప్త సమ్మెకు ప్రజా బాహుళ్యం, వైద్యులు, ఔషధ తయారీదారులు పూర్తిస్థాయిలో సహకరించి జయప్రదం చేయాలని టీటీసీడీఏ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో అయిత రఘురాములు, వెంకటరమణ, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ గౌడ్ , శ్రీనివాస్, సత్యనారాయణ , ప్రకాష్, తదితరులు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సోదరులు అందరు పాల్గొన్నారు.

జలాల్‌పూర్ మహకాళీ మాత ఆలయ విస్తరణకు చేగుంట ఉపసర్పంచ్ రఫీ 5 గుంటలు, ప్రముఖుల భూదానం.

0

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్‌పూర్ గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మహకాళీ మాత దేవాలయ అభివృద్ధి, విస్తరణ కోసం చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు చేగుంటకు చెందిన పలువురు ప్రముఖులు గొప్ప ఉదారత చాటుకున్నారు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ తన సొంత నిధుల నుండి 5 గుంటల భూమిని భూదానంగా ఇస్తూ దానికి సంబంధించిన పత్రాలను, విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేయగా, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కావేరి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో దైవభక్తి ఉంటేనే అన్యాయం, అధర్మం అంతరిస్తాయని, భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు; అలాగే ప్రముఖ నాయకులు అయిత పరంజ్యోతి మాట్లాడుతూ తాము కోరగానే దాతలు సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. ఈ దేవాలయ విస్తరణ నిమిత్తం ఉపసర్పంచ్ రఫీ 5 గుంటలు దానం చేయగా.. అయిత పరంజ్యోతి, తొడుపునూరి నగేష్, తొడుపునూరి మహేష్, కాశం శంకర్, కాసాని ముత్యాలు గౌడ్, మాశెట్టి నాగభూషణం, బచ్చు రవీందర్, తోడుపునూరి మోహన్ లు ఒక్కొక్కరు ఒక గుంట చొప్పున, అలాగే మంజుల – వెంకట్ రెడ్డి దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక గుంట భూమిని ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ పవిత్రమైన రోజున భూదానం చేసే భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతమని ఉపసర్పంచ్ రఫీ ఆనందం వ్యక్తం చేయగా, ఆలయ కమిటీ దాతలను శాలువాలతో ఘనంగా సత్కరించింది; ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎస్. రామారావు, ఏ. లక్ష్మణ్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, గోశాల నిర్వహణ బాధ్యులు దేవరాజ్, మొహమ్మద్ రఫీ, అయిత రఘు రాములు, అయిత పరంజ్యోతి,మ్యాకల శ్రీనివాస్, సీలువేరు ప్రకాష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.