📄 ePaper
Sunday, September 20, 2026
ADS
Home Blog Page 29

చేగుంట కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అమావాస్య అన్నప్రసాద వితరణ.

0

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రమైన చేగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకుని నిరుపేదలకు, భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజున అన్నదానం చేయడం వల్ల పూర్వీకులకు గౌరవం దక్కుతుందని, ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తుందనే నమ్మకంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాశెట్టి నాగభూషణం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 1:00 గంటల నుండి ప్రారంభమైన ఈ అన్నప్రసాద వితరణలో చేగుంట గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘అన్నదానం మహోదానం’ అనే భావనతో సాగిన ఈ సేవలో చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్, కన్యాకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షులు తోడుపునూరి నగేష్, కార్యదర్శి అయిత రఘు రాములు, మెదక్ జిల్లా ఆర్య వైశ్య మహా సభ అయిత పరంజ్యోతి, టి ఆర్ ముత్యాల గౌడ్, బాలేశం సేటు, చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మన్నెవారి జలల్పూర్ శ్రీ శ్రీ శ్రీ మహాకాళి దేవస్థానం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కావేరి సత్యనారాయణ, అధ్యక్షులు ఎస్ రామారావు, ఏ లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు రాజేశ్వర్, దేవరాజ్ గోశాల మెయింటెనెన్స్, మ్యాకల శ్రీనివాస్,భక్తులు ప్రముఖులు, యువకులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.

చేగుంట రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఆర్డిఓ జయచంద్రారెడ్డి.

0

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఇబ్రహీంపూర్ తిరుమల రైస్ మిల్, బోనాల భారతి రైస్ మిల్లుల నూ తనిఖీ చేశారు. అనంతరం యజమానులతో అధికారులు వడ్ల కొనుగోలు పై సమీక్షించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా వేగంగా ధాన్యం సేకరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి చేగుంట తాసిల్దార్ శివ ప్రసాద్ ఆర్ ఐ జయభారత్ రెడ్డి ఎంపీడీవో చిన్నారెడ్డి ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఎం పి ఓ విజయ పాల్ రెడ్డి, రైస్ మిల్ యజమానులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొనడం జరిగింది.

చందాయిపేట,కసాన్పల్లి సబ్స్టేషన్ పరిధిలో కరెంటు అంతరాయం-ఏఈ వెంకటప్ప రెడ్డి.

0

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట లో 33/11 / కె.వి ఫిడార్ మరమ్మతుల కారణంగా ఆదివారంవిద్యుత్ విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగనుంది.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చందాయిపేట కసానపల్లి సబ్స్టేషన్లో పరిధిలో కరెంటు ఉండదని ఏఈ వెంకట అప్పారెడ్డి తెలిపారరు మక్క రాజుపేట, చందాయిపేట,కసానపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ నిలిపినట్లు తెలిపారు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

30 గోవులను రక్షించిన గోసంరక్షక దళం.

0

బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణా అరికట్టాం బజరంగ్ దళ్

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని పట్టుకున్నా రు డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్, ప్రక్కన ఉన్న రాజస్థాన్ దాబా దగ్గర సేద తీర్చుకుంటున్న సమయంలో డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు.సమాచారం అందుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ధాన్యం దిగుమతులలో మిల్లర్లు అలసత్వం వీడాలి మెదక్ జిల్లా కలెక్టర్.

0

ధాన్యం దిగుమతులలో మిల్లర్లు అలసత్వం వీడాలి కలెక్టర్

కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలు మార్లు మిల్లర్లకు ఆదేశాలు

ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిని పెడుతున్న మిల్లర్లు రైతులకు తీవ్ర ఇబ్బందులు

రెండు రైస్ మిల్లులు బ్లాక్‌లిస్ట్

మెదక్,పాపన్నపేట,మే,16,మెదక్ టుడే న్యూస్: పాపన్నపేట మండలం మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, రామాయంపేట్ మేసర్స్ భవాని ఇండస్ట్రీస్, పై చర్యలు,మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని రైస్ మిల్లర్లు పీపీసీల నుండి ధాన్యాన్ని దిగుమతి చేసుకొని కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలు మార్లు ఆదేశాలు జారీ చేయబడ్డాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.కొనుగోలు కేంద్రాల ధాన్యం దిగుమతులపైకలెక్టర్ మాట్లాడుతూ కష్టం మిల్లింగ్ ఆపరేషన్లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు వెల్లడించిన మిల్లర్లు ఆ మాటలు పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని దృష్టిలో పెట్టుకుని,మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, పాపన్నపేట మండలం మరియు మేసర్స్ భవాని ఇండస్ట్రీస్, రామాయంపేట్ వారు పీపీసీల నుండి కేటాయించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం గమనించబడినది. దీనివల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి మరియు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందన్నారు.ఈ నేపథ్యంలో, సంబంధిత జి.ఓ నిబంధనల ప్రకారం పై రైస్ మిల్లులను పాడి ప్రొక్యూర్‌మెంట్ మరియు కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్ నుండి తక్షణ ప్రభావంతో బ్లాక్ / బ్లాక్‌లిస్ట్ చేయడం జరిగినది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా రైస్ మిల్లులకు ఎటువంటి ధాన్యం కేటాయింపు చేయబడవని వెల్లడించారు.అలాగే, జిల్లాలోని అన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ పీపీసీల నుండి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత రైస్ మిల్లులపై కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించిన బండి సంజయ్.

0

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించిన బండి సంజయ్

చట్టానికి అందరూ సమానమేనన్న కేంద్ర మంత్రి

విచారణకు పూర్తి సహకారం అందిస్తామన్న స్పష్టీకరణ

కేసులో ఆధారాలు సమర్పించినట్లు వెల్లడి

    హైదరాబాద్‌,మే,16,(మెదక్ టుడే న్యూస్)కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించారు. చట్ట ప్రకారం జరిగే విచారణకు పూర్తిగా సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ చట్టం ముందు తన కుమారుడు అయినా, సామాన్య వ్యక్తి అయినా అందరూ సమానమేనని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థపై తనకు ఉన్న గౌరవంతోనే భగీరథ్‌ను విచారణ కోసం అప్పగించామని చెప్పారు.
    దేశంలో ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సంబంధాల కంటే చట్టం గొప్పదనే భావనతోనే తాము వ్యవహరిస్తున్నామని తెలిపారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని బండి సంజయ్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఫిర్యాదు వచ్చిన తొలి రోజుల్లోనే భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాలని భావించినట్లు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సమర్పించాల్సిన అవసరం ఉండటంతో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు.
    ఇక ఆలస్యం చేయడం సమంజసం కాదని భావించి చట్టపరమైన ప్రక్రియలో భాగంగా కుమారుడిని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. సమర్పించిన ఆధారాలను పోలీసులు పరిశీలించిన తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయని, కేసు కొట్టివేయబడుతుందని న్యాయవాదులు చెప్పినట్లు బండి సంజయ్ తెలిపారు. బెయిల్ కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

    నకిలీ కాల్ సెంటర్లపై అప్రమత్తంగా ఉండండి- సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక.

    0

    ఓటీపీ వివరాలు పంచొద్దని సూచన

    అనుమానాస్పద కాల్స్‌పై జాగ్రత్త

      హైదరాబాద్‌,మే,16,(మెదక్ టుడే న్యూస్)నకిలీ కాల్ సెంటర్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సూచనలు విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు కాల్ సెంటర్ ప్రతినిధుల పేరుతో ఫోన్ చేసి బ్యాంకు, ఉద్యోగం, బహుమతులు, కస్టమర్ సేవల పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వాటిని నమ్మి వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం సమాచారం, ఓటీపీలు వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని తెలిపారు. నకిలీ కాల్ సెంటర్ల నుంచి వచ్చే కాల్స్‌లో మోసగాళ్లు ప్రజలను భయపెట్టి లేదా అత్యవసర పరిస్థితి సృష్టించి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తారని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలని సూచించారు.
      ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే కాల్‌ను నిలిపివేయాలని తెలిపారు. అవసరమైతే సంబంధిత సంస్థ అధికారిక నంబర్లకు ఫోన్ చేసి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

      ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

      0

      పాపన్నపేట,మే,16,మెదక్ టుడే న్యూస్:జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మండల పరిధిలోని పోడ్చన్ పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…గ్రామానికి చెందిన వడ్ల సత్యనారాయణ(55) గత కొన్ని రోజులుగా ఫిట్స్, బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు.పని చేయుటకు శరీరం సహకరించడం లేదని తరచూ ఇంట్లో బాధపడుతుండే వాడు.ప్రతి రోజు లాగే శనివారం మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి గదిలోకి వెళ్లాడు.జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కాసేపటికి గమనించిన కుటుంబీకులు కొన ఊపిరితో ఉన్న అతన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.మృతుడి భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

      అక్రమ వెంచర్‌పై ‘సూరన్న’ ఫిర్యాదు-అధికారులు నామమాత్రపు చర్యలు చేపడితే ఊరుకోం.

      0

      అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని బడంగ్‌పేట్ కమిషనర్ హామీ.

      బడంగ్‌పేట్: బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ వద్ద వెలసిన భారీ అక్రమ వెంచర్‌పై జర్నలిస్ట్ సూరన్న అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వెంచర్ అక్రమాలను ఆయన సాక్ష్యాధారాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బడంగ్‌పేట్ కమిషనర్, అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.తూతూమంత్రంగా కూల్చివేతలు వద్దుగతంలో సర్వే నంబర్ 9, 10లలో వెలసిన ఈ వెంచర్‌పై ఫిర్యాదులు రాగా, టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం షో కోసం ఒకట్రెండు విద్యుత్ స్తంభాలను తొలగించి చేతులు దులుపుకున్నారని సూరన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైనేజీ, రోడ్లు, ప్రీకాస్ట్ వాల్ వంటి నిర్మాణాలను ముట్టుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.అవినీతి అధికారుల గుట్టురట్టు
      వెంచర్‌కు అనుమతులు లేకపోయినా ప్లాట్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కమిషనర్ హామీ:
      పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం”
      సూరన్న ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమిషనర్, వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

      బడిబాటలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి తపస్.

      0

      చేగుంట,మే,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని తపస్ కార్యాలయంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం మే నెలలో బడిబాట నిర్వహిస్తుంది అని, వేసవి సెలవులలో బడిబాటలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ సంపాదిత సెలవులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు సురేందర్, సంతోష్, యాదగిరి, తపస్ మండల అధ్యక్షులు రావుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.