📄 ePaper
Sunday, September 20, 2026
ADS
Home Blog Page 30

రైతుల సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రత్యేక చర్యలు.

0

లారీల వేట లో ట్రాన్స్పోర్ట్ రెవిన్యూ, పోలీసు సిబ్బంది,ఊపు అందుకున్న వడ్ల కొనుగోలు

చేగుంట,మే,15,మెదక్ టుడే న్యూస్:రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పి పి సి ఎస్ వద్ద నెలకొన్న లారీల కొరత సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈరోజు ఎం వి ఐ శ్రీనివాస్, చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్,రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది సంయుక్తంగా రోడ్లపైకి వచ్చి చర్యలు చేపట్టారు.ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను ఆపి వాటిని పి పి సి ఎస్ కు మళ్లించడం ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయడంతో వడ్ల కొనుగోలు ప్రక్రియ ఊపు అందుకుంది దీంతో రైతులకు ఊరట కలుగుతోంది.

బజరంగ్దళ్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్.

0

చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పరిధిలో గల పోలీస్ స్టేషన్లో బజరంగ్దళ్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగినది ఈనెల 27న బక్రీద్ పండగ ఉన్నందున గోవు అక్రమ రవాలను బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకొని చట్టాన్ని చేతులకు తీసుకొని వారిపై దాడి చేయొద్దని ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకోసమే బజరంగ్దళ్ కార్యకర్తలను భువనగిరి నాగరాజు బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ సోమ సురేష్ విహెచ్పి మండల అధ్యక్షులు చిక్కుడు మహేష్ ఉప మండల ప్రముఖ ని ముందస్తు అరెస్టు చేసి వారిని హెచ్చరించడం జరిగినది
బజరంగ్దాల్ విషయం
భజరంగ్దళ్ జిల్లా సంయోజక నాగరాజ్ గారు మాట్లాడుతూ గోవులను రక్షించే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న తీరును చూస్తే సిగ్గుచేటు పబ్లిక్ గా కూరగాయల దుకాణాల వలె గోమాంసాన్ని విక్రయిస్తున్న గాని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన గాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ధర్మరక్షణకై పాల్పడుతున్న బజరంగ్దళ్ కార్యకర్తలపై గోవుల రక్షణ సమితి కార్యకర్తల పై జరుగుతున్న ఈ చర్యలకు నేను సిగ్గుపడుతున్నానని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి నాగరాజు సోమ సురేషు చిక్కుడు మహేష్ చింతల భూపాల్ శివలింగం మహేందర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

పాపన్నపేట-పిఎస్ ను,ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ.

0

ప్రతి రోజు సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించాలి

గ్రామాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా

మెదక్,మే,15,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, బాధితుల సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా సేవాభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు.
గ్రామాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, రాత్రి వేళల్లో పహారా నిర్వహణను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రజల్లో భద్రతాభావం పెరిగేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, ఫేక్ వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలో డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రైతులు సేంద్రియ పద్ధతి పాటించాలి-క్రీమ్సహారా పిచకారి తాగించాలి.

0

వ్యవసాయ శాస్త్రవేత్త పుష్పవల్లి.

చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో“రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డా. పుష్పవల్లి మాట్లాడుతూ రైతులు వర్షా కాలంలో వరి పంట సాగు చేసే ముందు రైతులు పచ్చి రొట్ట పంటలను మోకాలి దాని ఎత్తు వరకు పెంచి కలియ దున్నితే 20-30 శాతం వరకు యూరియా వాడకం తగ్గించవచ్చు అని తెలియచేసారు. పంటలలో రసాయనాలు తప్పనిసరి పరిస్థితి లో మాత్రమే వాడాలి అని, పక్షి స్థావరాలను, లింగ ఆకర్షణ బుట్టలను వాడి పురుగులను నియంత్రించాలని వారు సూచించారు. లెగ్యూమ్ జాతికి చెందిన అపరాలు నూనె గింజల పంటలతో పంట పంట మార్పిడి పాటించడం, సాగు నీటినిఆదా చేయడం, సేంద్రియ పద్ధతులను పాటించడం పై రైతులకు అవగాహన కల్పించారూ. కార్యక్రమంలో డా. తరుణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి మాధవి, పంచాయతీ సెక్రెటరీ సమీరా,వార్డ్ మెంబర్లు,ఫీల్డ్ అసిస్టెంట్, రైతులు పాల్గొన్నారు.

జనగణన ను పరిశీలించిన చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్.

0

చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో జనగణనను పరిశీలించిన చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 11 నుండి మే 13 వరకు మ్యాపింగ్ చేశారని, ఈరోజు నుండి అన్ని గ్రామాలలో ఇండ్ల గణనను నిర్వహిస్తున్నారని, ఎనిమరేటర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రజలు సహకరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఓ భూమేష్, ఎనుమారేటర్స్ మౌనిక,చల్లా రామకృష్ణ, సూపర్వైజర్ చల్లా లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు

రైతుల కోసం రోడ్ ఎక్కిన రెవిన్యూ, పోలీసు సిబ్బంది.

0

చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం లోరైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, (పీపీసీ ) వద్ద లారీల కొరత ఉన్న విషయాన్ని ఆర్డీవో జయ చంద్రా రెడ్డి, తహసీల్దార్ శివ ప్రసాద్ గుర్తించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది సంయుక్తంగా రోడ్డెక్కి చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా చేగుంట గిర్థవర్లు జయ భరత్ రెడ్డి,సుజాత,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను నిలిపివేసి, (పి పి సి )ల కు మళ్లించడం జరిగింది.ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యలతో రైతులకు ఊరట లభించడంతో పాటు కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతూ కొనుగోలు వేగంగా జరుగుతున్నాయి అని అధికారులు వెల్లడించారు.

కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా.

0

6వ వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్
టీచర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,14,మెదక్ టుడే న్యూస్:షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలోని టీచర్ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ ముందుకు వచ్చారు. గురువారం ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై స్పందించిన ఆయన, వెంటనే పనులు ప్రారంభించి సాటర్‌ను కొత్తగా ఏర్పాటు చేయించారు.పనులు పూర్తయ్యే వరకు స్వయంగా అక్కడే ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్ రాజు నాయక్‌పై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సేవలు అందించడం తన బాధ్యత అని రాజు నాయక్ పేర్కొన్నారు.

మద్యం,మహిళ వ్యామోహమే కేశవుల ప్రాణాలు తీశాయి.

0

షాద్‌నగర్ శివారులో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితుల అరెస్ట్.. పోలీసులకు డీసీపీ శిరీష ప్రశంసలు, రివార్డులు

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,12,మెదక్ టుడే న్యూస్: మద్యం మత్తు, మహిళ వ్యామోహం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులో సంచలనం సృష్టించింది. కేవలం జేబులో ఉన్న పదివేల రూపాయల కోసం ఓ మహిళతో కలిసి మరో వ్యక్తి పన్నిన పథకం చివరకు దారుణ హత్యకు దారితీసింది. అయితే ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా విచారించి కేవలం కొద్ది గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు.ఈ కేసులో నిందితులైన పుల్లం గోవిల బజారన్న, బైన్ల యాదమ్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్ధార్ నగర్‌కు చెందిన కేశవులు శ్రీనివాసరావుకు చెందిన ఫామ్‌హౌస్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తన భూమి వివాదానికి సంబంధించిన పని నిమిత్తం యజమాని వద్ద నుంచి రూ.50 వేల తీసుకుని పరిగికి వెళ్లాడు. అక్కడ న్యాయవాదికి రూ.40 వేల చెల్లించి మిగిలిన రూ.10 వేలతో తిరిగి రాత్రి షాద్‌నగర్‌కు చేరుకున్నాడు.
రాత్రి 9:30 గంటల సమయంలో షాద్‌నగర్ బస్టాండ్‌లో దిగిన కేశవులు ఇంటికి వస్తున్నానని భార్య పద్మకు ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం ఆమె పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు వీర్లపల్లి రోడ్డులోని ఓ వెంచర్ ప్రాంతంలో కేశవులు మృతదేహం కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సీఐ సీతారాం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.
దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థల సమీపంలో రక్తపు మరకలతో పడివున్న ఓ షర్టు పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఆ షర్టు ఆధారంగా నిందితుడు బజారన్నను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు వచ్చిన కేశవులు ముందుగా లక్కీ వైన్స్ వద్ద మద్యం సేవించాడు. అక్కడే అతనికి బజారన్న పరిచయం అయ్యాడు. కేశవుల వద్ద డబ్బులు ఉన్నాయని గుర్తించిన బజారన్న వాటిని దోచుకోవాలని యోచించాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత అక్కడికి వచ్చిన బైన్ల యాదమ్మను చూసి కేశవులు ఆకర్షితుడయ్యాడు. అదే అవకాశంగా భావించిన బజారన్న యాదమ్మతో కలిసి పథకం రచించాడు.
వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి యాదమ్మను కేశవులతో కలిసి వీర్లపల్లి రోడ్డులోని ఓ వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కేశవులు అప్రమత్తంగా లేని సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న డబ్బులను తీసుకుని పరారయ్యారు.
హత్య అనంతరం బజారన్న గద్వాలకు వెళ్లి మరుసటి రోజు తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంటి వద్దే అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో అతని వద్ద నుంచి రూ.3900 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యాదమ్మను కూడా అరెస్టు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని షాద్‌నగర్ డీసీపీ శిరీష ప్రత్యేకంగా అభినందించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆమె రివార్డులు అందజేసి అభినందించారు.

చేగుంట మండల్ కర్నాలపల్లి లోఐ కె.పి కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి.

0

చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలో ఐకెపి కొనుగోలు సెంటర్ పరిశలించిన రాష్ట్ర, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిరాష్ట్ర రైతు మెంబెర్ భవాని రెడ్డి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రావు ఖబడ్దార్ రైతులతో రాజకీయం చేయడం సరికాదు,మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులను ఆదుకునేలా ఉండాలి, కానీ వారితోని మీ నీచ రాజకీయాలు రైతుల వద్ద చేయొద్దని ఈ సందర్భంగా వారు అన్నారు, ఏదైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్ గానీ,రాష్ట్ర రైతు కమిషన్ కి గాని, లేక రాష్ట్ర సంబంధిత మంత్రులు గాని తెలియ చేయాలి అన్నారు, అనంతరం జిల్లా అధికారులతో కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే రెండు రోజుల్లో తలించాలని ఆదేశించారు, ఈ కార్యక్రమం లో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి,మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్, రెడ్డిపల్లి పిఏసిఎస్ చైర్మన్ మ్యాకల పరమేష్,ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సింలు కాశబోయిన శ్రీనివాస్, అన్నం ఆంజనేయులు, కుర్మ లక్ష్మి, దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్యా,కాసాన్ పల్లి సర్పంచ్ బిక్య నాయక్,చేగుంట ఉపసర్పంచ్ మొహ్మమ్మద్ రఫీ, చందాయిపేట్ ఉపసర్పంచ్ నగేష్ గుప్తా,కర్ణంపల్లి గ్రామ అధ్యక్షులు చింతఆకుల లింగం, ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, సినియర్ నాయకులు యాదిరెడ్డి, రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్,యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, అయిత పరంజ్యోతి,సర్పంచ్ బండారి లాలు, బాస రాజు, కొండల్ రెడ్డి, రాజారామ్,వివిధ గ్రామాల సినియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చేగుంట తాసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన, డీఆర్వో.

0

చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట తాసిల్దార్ కార్యాలయాని మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ పరిశీలించి, తాసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున పనులపైన సమీక్ష నిర్వహించారు,వారి కార్యాలయ సిబ్బందికి పలు పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు, ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియను వేగవంతం చేయాలని వారు తెలిపారు, ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను త్వర త్వరగా పరిష్కరించాలని, అలాగే సాదా బైనమాలు పనులను కూడా వేగవంతం చేయాలని వారు తెలిపారు, కార్యక్రమంలో చేగుంట ఎమ్మార్వో శివప్రసాద్, ఆరే జయభారత్ రెడ్డి, సర్వేర్ మొగిలయ్య,సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు,