📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 31

ఈద్గా వద్ద బందోబస్తు పరిశీలించిన అదనపు ఎస్ పి మహేందర్.

0

మెదక్:మార్చి,20,మెదక్ టుడే న్యూస్:పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నవాబ్‌పేట్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్ పి మహేందర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు.ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీసు పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు.ప్రజలు సోదరభావంతో, పరస్పర గౌరవంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్ పి ప్రసన్న కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.

ముస్లిం సోదరుల సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు.

0

-మెదక్ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్

మెదక్,మార్చి,20,మెదక్ టుడే. న్యూస్:పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం లకు,నియోజకవర్గ ప్రజలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర మాసం మనుషుల మధ్య సౌహార్దం, సహనం, సేవాభావం, దాతృత్వం వంటి గొప్ప విలువలను పెంపొందించే పవిత్ర కాలమని ఆయన పేర్కొన్నారు.రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్షలు మనిషిలో ఆత్మ నియంత్రణను పెంపొందించడమే కాకుండా, సమాజంలో సమానత్వ భావనను బలపరుస్తాయని అన్నారు. పేదవారికి సహాయం చేయడం, పరస్పరం ప్రేమాభిమానాలు పెంచుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడుతుందని ఆయన ఆకాంక్షించారు.ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, శాంతి నింపాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఎమ్మెల్యే రోహిత్ రావ్ ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో నడవాలని ఆయన కోరారు.

పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్.

0


పాపన్నపేట,మార్చి,20,మెదక్ టుడే న్యూస్: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించి, ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులకు ఈ పండుగ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని చేకూర్చాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.

యూరియా,గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

0

పాపన్నపేట,మార్చి,20,మెదక్ టుడే న్యూస్: యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోనీ రైతు అగ్రో సెంటర్ ను , ప్యాక్స్ యూరియా స్టాక్ వివరాలను,గ్యాస్ గోదామును పరిశీలించారు.ఎరువులు మందులు రికార్డులను, గ్యాస్ బుకింగ్ రికార్డును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి ఎరువులు, మందులు, గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు.గ్యాస్ గాని, ఎరువులు మందుల గురించి కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు, వినియోగదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వడియారం గ్రామంలో పరాభవ నూతన సంవత్సర ఉగాది వేడుకలు.

0

చేగుంట,మార్చి,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో( హనుమాన్ గుడి)శివ పంచాయతన దేవాలయంలో గ్రామ సర్పంచ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురోహితుడువెంకటేశ్వర శర్మ తో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగినది. ఈ ఉగాది పండుగను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ మా వడియారం గ్రామ పురోహితుడు అయిన వెంకటేశ్వర శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించాము పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరానికి సంబంధించిన శుభ ఫలితాలను వివరించారు.గ్రామానికి మంచి కాలం ప్రారంభమవుతుందని,అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని తెలిపారు.అనుకూలమైన వర్షపాతం ఉండి వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటుందని, ప్రజలు ఆరోగ్యంగా,జీవిస్తారని గ్రామంలో ఐకమత్యం కొనసాగితే మరింత పురోగతి సాధ్యమని,ఈ ఉగాది కొత్త ఆశలు, కొత్త అవకాశాలకు నాంది పలుకుతుందని పంతులు చెప్పారు.అలాగే రాబోయే సంవత్సరం మా గ్రామంలో పాడి పశువులు అన్నదాతలు రైతులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని,వడియారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామని గ్రామ పాలకవర్గం తరఫున తెలియజేస్తున్నాము అలాగే వచ్చే శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకుందాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివ పంచాయతన దేవాలయ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు, ప్రజలు యువకులు పాల్గొనడం జరిగినది.

చేగుంట లోని 14 వ వార్డు లోవేదపండితునితో పంచాంగ శ్రవణం.

0

చేగుంట,మార్చి,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణంలో నీ 14 వ వార్డు లో తెలుగువారి మొదటి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్ అధ్వర్యంలో వార్డు ప్రజలందరూ కలిసి వేద బ్రాహ్మణుడు రాఘవపంతులు ను పూలదండ శాలువాతో గౌరవించి పంచాంగ శ్రవణం చేయించి ఈ సంవత్సరం ఎలా ఉంది ,వర్షాలు కాలలు ఎలా ఉన్నాయి ,రాశులు ఎవరెవరికి ఎలా ఉన్నాయి పంచాంగ శ్రవణం ద్వారా వేదపండితుడు తెలియజేయడం జరిగింది అనంతరం అందరూ ఉగాది పచ్చడి తాగి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్,అన్నం రవి,శంకర్,సుధాకర్,రాములు ,ముత్యంరెడ్డి,రాంరెడ్డి,మహేష్,కిషన్,మిరపకాయల వెంకటేశం,నాగలింగం,దయాకార్ రెడ్డి,వేణు ,చందు,శేఖర్,విశ్వం,రాఘవ, శంకర్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఉగాది ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ శ్రీ కూచాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం.

0

మెదక్,హవేలీ ఘన్పూర్,మార్చి,18,మెదక్ టుడే న్యూస్: మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం కూచంపల్లి గ్రామంలో గల శ్రీశ్రీ కూచాద్రి వెంకటేశ్వర దేవాలయం ఉగాది బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ ఉత్సవంలో భాగంగా కుచంపల్లి గ్రామంలో గల శ్రీ కూచాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవం జరుగుతాయి నేటి 19 తారీకు నుండి 24వ తేదీ వరకు ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవ జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు 19వ తేదీన ఉదయం 4.30 నిమిషాలకు సుప్రభాతము అభిషేకము 7.30 నిమిషాలకు బాల భోగము 9 గంటలకు పంచాంగము సాయంత్రం 4-00 గంటల నుండి స్వామివారికి శకట బ్రాహ్మణము ( బండ్లు తిరుగుట ) తదుపరి తీర్థ ప్రసాదాలను వితరణ 21 తేదీన ఉదయం 4 -30 నిమిషాలకు శుభ్రత సేవ 5-00గంటలకు అభిషేకం సాయంత్రం 5-00 గంటల నుండి శ్రీ బేతాళ స్వామి కి శటక బ్రాహ్మణము ( బండ్లు తిరుగుట) అనంతరం తీర్థ ప్రసాద వితరణ 22వ తేదీ నాడు ఉదయం5-00 గంటలకు స్వామివారికి అభిషేకం మరియు ఉదయం 10 గంటలకు కుంకుమార్చన సాయంత్రం 5-00గంటలకు బేతాళ స్వామి బండి శీల అనంతరం తీర్థ ప్రసాద వితరణ 23 ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకం ఉదయం 8 గంటలకు మంగళ స్నానం 11-00 గంటలకు స్వామి వారిని ఎదుర్కోలు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణోత్సవం మధ్యాహ్నం 1:00 కు అన్న సంతర్పణ సాయంత్రం 4-00 గంటలకు నల్ల పోచమ్మ కు మరియు ఊరు దేవతలకు శకట బ్రాహ్మణము అనగా బండ్లు తిరుగుట రాత్రి 10 గంటలకు భజన కార్యక్రమం 24 నాడు ఉదయం 12 గంటలకు స్ చక్రస్నానం 12.30 నిమిషాలకు చక్రోత్సవ ఆవిష్కరణ ఉదయం 3 గంటలకు రథోత్సవం ఉదయం 5 గంటలకు శుభ్రవాత సేవ తదుపరి స్వామి వారి అభిషేకము ఉదయం 7:30 నిమిషాలకు బాల భోగము తదుపరి అర్చనలు 10 గంటలకు మహా నైవేద్యము తీర్థ ప్రసాద వితరణ జరుగును అని ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్క గ్రామాల నుండి గాక ఇతర జిల్లాల నుండి మరియు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ ప్రధాన అర్చకులు గోపాల పంతులు మరియు ఆలయ ఈవో వెంకట మోగి శ్రీనివాస్ తెలిపారు

ప్రాథమిక పాఠశాల కర్నాల్ పల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం.

0

చేగుంట,మార్చి,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాల్ పల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని ఐదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి మిగతా తరగతులకు పాఠాలను బోధించారు. ఒక్కొక్కరు టీచర్లు తెలుగు ఇంగ్లీషు మ్యాస్ ఇవిఎస్ సబ్జెక్టులను తీసుకొని పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలు టీచర్ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ పాఠాలను బోధించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందని,నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, బాధ్యతలు తెలుస్తాయని, పోటీ తత్వం పెరుగుతుందని, ఆత్మవిశ్వాసం కలుగుతుందని, భవిష్యత్తులో పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని చెప్పడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు టీ బాలచందర్ సార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా మారిన వీరు పిల్లలకు చక్కగా పాఠాలను బోధించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు టి బాలచందర్ ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు డి ఈ ఓ గా రితిక, ఎం ఈ ఓ గా సహస్ర, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులుగా ధనుష్ కుమార్, ప్రధానోపాధ్యాయులుగా భాను ప్రసాద్,పీఈటిగా మనోజ్, వ్యవహరించారు.వీరితోపాటు రిషిత,పూజ, మనూష,దీక్షిత, సుశాంత్,భావేష్ పాల్గొన్నారు.

వైద్య శిబిరం పరిశీలన..

0

పాపన్నపేట,మార్చి,18,మెదక్ టుడే న్యూస్:పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆశాఖ సిబ్బందికి జిల్లా వైద్యాధికారి శ్రీరాం సూచించారు. బుధవారం పొడ్చన్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల సరళిని పరిశీలించారు. వివిధ చికిత్స గూర్చి 221 మంది రోగులు ఈ శిబిరానికి తరలి వచ్చారు. మెదక్ డివిజన్ ఇంచార్జి డిప్యూటీ డీఎం హెచ్ఓ హరిప్రసాద్,వైద్యాధికారులు దీక్ష,ప్రదీప్ రావు,నవ్య,సిబ్బంది అలీ,ఇందిరా ఉన్నారు.

రైతుభరోసా కు-దరఖాస్తులు ఆహ్వానం.

0

పాపన్నపేట,మార్చి,18,మెదక్ టుడే న్యూస్:కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన మండల పరిధి లోని రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరాజు తెలిపారు. ప్రస్తుత యాసంగి 2025 – 26 సీజన్ కు సంబంధించి కొత్త అప్లికేషన్లు,బ్యాంకు వివరాల అప్డేట్ కోసం మార్చి 25 లోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలతో పాటు బ్యాంకు అకౌంట్,ఆధార్ కార్డు,ఫోన్ నంబర్ తో దరఖాస్తు సమర్పించాలన్నారు.