📄 ePaper
Thursday, April 16, 2026
ADS
HomeTelanganaవాడక్ పల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.

వాడక్ పల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.

📰 Generate e-Paper Clip

•పాల్గొన్న యువ నాయకుడు సాయి గౌడ్

•గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు

    అమీన్‌పూర్,మార్చి,27,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ పరిధిలోని 271 డివిజన్ వాడక్ పల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్తులందరూ ఏకమై, భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కాంగ్రెస్ యువ నాయకుడు సాయి గౌడ్ తన అనుచరులు మరియు ఇతర యువ నాయకులతో కలిసి పాల్గొన్నారు.

    గ్రామస్తుల ఐక్యత – ఆధ్యాత్మిక శోభ:

    ఈ కార్యక్రమం పూర్తిగా గ్రామస్తుల స్వయం పర్యవేక్షణలో, అందరి సహకారంతో జరిగింది. గ్రామంలోని రామాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కల్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. “ప్రతి ఏటా మా గ్రామంలో సీతారాముల కల్యాణాన్ని ఒక పండుగలా నిర్వహించుకోవడం మా ఆనవాయితీ అని, ఊరంతా కలిసి ఈ పుణ్యకార్యంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని” తెలిపారు.

    యువత భాగస్వామ్యం:

    కల్యాణోత్సవంలో పాల్గొన్న యువ నాయకుడు సాయి గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంలో యువత ముందుండాలని, రాముడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

    RELATED ARTICLES
    - Advertisment -ADS

    Most Popular

    Recent Comments