వాడక్ పల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.
•పాల్గొన్న యువ నాయకుడు సాయి గౌడ్ •గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు అమీన్‌పూర్,మార్చి,27,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ పరిధిలోని 271 డివిజన్ వాడక్ పల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్తులందరూ ఏకమై, భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కాంగ్రెస్ యువ నాయకుడు సాయి గౌడ్ తన అనుచరులు మరియు ఇతర యువ నాయకులతో కలిసి పాల్గొన్నారు. గ్రామస్తుల ఐక్యత - ఆధ్యాత్మిక శోభ:...