చేగుంట,మార్చి,29,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్, శ్రీ కార్తవీర్యాయోగాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ‘వీర హనుమాన్ విజయాత్ర’ బైక్ ర్యాలీ గోడ పత్రికను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో జరిగిన సన్నాహక కార్యక్రమంలో చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీక్ భజరంగ్ దళ్ కండువా కప్పుకుని మత సామరస్యానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. హిందూ ముస్లిం సోదరులందరూ మత విభేదాలకు అతీతంగా ఒక్కతాటిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 31వ తేదీ మంగళవారం నాడు హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ కార్తవీర్య యోగాశ్రమం చేగుంట వారి సౌజన్యంతో మధ్యాహ్నం 1:00 గంట నుండి సుమారు వెయ్యి మంది భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు కరణం గణేష్ రవి కుమార్ తెలిపారు. అనంతరం అదే రోజు సాయంత్రం 3:00 గంటల నుండి ఆధ్యాత్మిక చైతన్యం నింపే లక్ష్యంతో సాగే ‘వీర హనుమాన్ విజయాత్ర’ బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా సాగనుంది. చేగుంట గ్రామ క్షేమం కోసం, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమంలో చేగుంట మండలం తో పాటు పక్క మండలాల నుండి యువత, భక్తులు, ధర్మ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నాగరాజు ప్రధాన కార్యదర్శి శ్యామ్ మండల అధ్యక్షులు సోమ సురేష్ భూపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సండ్రుగు సతీష్, మండల బిజెపి పార్టీ మాజీ అధ్యక్షులు చింతల భూపాల్, చేగుంట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు సాయిబాబా, శ్రీరమణి శ్రీనివాస్, ఆరిఫ్,సుఖేందర్,శ్రీ కార్తవీర్యాయోగాశ్రమం సభ్యులు నాంపల్లి, భూపాల్ రెడ్డి,శంకర్,తదితరులు పాల్గొన్నారు.
వీర హనుమాన్ విజయాత్ర’ బైక్ ర్యాలీ గోడ పత్రిక ఆవిష్కరణ.
RELATED ARTICLES
