📄 ePaper
Monday, September 21, 2026
ADS
HomeMedak SPబెట్టింగ్‌కు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు- జిల్లా...

బెట్టింగ్‌కు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు- జిల్లా ఎస్ పి.

📰 Generate e-Paper Clip

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్

మెదక్,మార్చి,29,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి. జిల్లాలో ఎవరైనా క్రికెట్‌ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ హెచ్చరించారు.ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్‌ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. యువత బెట్టింగ్‌ల వైపు వెళ్లి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా వారు మొబైల్ ఫోన్ వినియోగం, ప్రవర్తనను గమనించాలని, అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే స్పందించాలని తెలిపారు.
జిల్లాలో బెట్టింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఆధునిక సాంకేతికతతో పాటు టాస్క్‌ఫోర్స్ మరియు ప్రత్యేక బృందాల సహకారంతో నిఘా పెంచుతున్నామని పేర్కొన్నారు.జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, అలాగే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular