బెట్టింగ్‌కు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు- జిల్లా ఎస్ పి.

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ మెదక్,మార్చి,29,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి. జిల్లాలో ఎవరైనా క్రికెట్‌ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ హెచ్చరించారు.ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్‌ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. యువత బెట్టింగ్‌ల వైపు వెళ్లి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ప్రాణాల...