📄 ePaper
Sunday, April 19, 2026
ADS
HomeTS.EDUPAYALAఏడుపాయల వన దుర్గ భవాని మాతనుదర్శించుకున్న జిల్లా కలెక్టర్ దంపతులు.

ఏడుపాయల వన దుర్గ భవాని మాతనుదర్శించుకున్న జిల్లా కలెక్టర్ దంపతులు.

📰 Generate e-Paper Clip

మంజీరా నదీ తీరాన వెలసిన అత్యంత మహిమాన్విత క్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం. కలెక్టర్

భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం
వన దుర్గ భవాని మాత

ఆ దుర్గామాత ఆశీస్సులతో జిల్లాలో ప్రజలందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి.

కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వాహణాధికారి, అర్చకులు,

ఏడుపాయల వన దుర్గ భవాని మాతనుదర్శించుకున్న జిల్లా కలెక్టర్ దంపతులు

మంజీరా నదీ తీరాన వెలసిన అత్యంత మహిమాన్విత క్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం అని.భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం
వన దుర్గ భవాని మాత అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.ఏడుపాయల దుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారి పేర ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గా భవానీ దేవత యొక్క అత్యంత గౌరవనీయమైన మందిరంగా పేర్కొన్నారు . కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు.మామూలు రోజుల్లో ఒక మాదిరిగా ఉండే భక్తుల రద్దీ ఆదివారాలలో అధిక సంఖ్యలో భక్తులు తాకిడికనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా భక్తులకు సౌకర్యాలు ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రతంగా ఉంచడంలో నిర్వాహకుల సేవలను కలెక్టర్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఈవో వీరేశం సిబ్బంది శ్రీనివాస్,అర్చకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments