📄 ePaper
Sunday, April 19, 2026
ADS
HomeNewsమద్యం,సెల్ ఫోన్,అతివేగంతోనే ప్రమాదాలు,పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్.

మద్యం,సెల్ ఫోన్,అతివేగంతోనే ప్రమాదాలు,పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్.

📰 Generate e-Paper Clip

పాపన్న పేట,ఏప్రిల్,14,మెదక్ టుడే న్యూస్:మద్యం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపవద్ద ని పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని మల్లంపేట లో
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అర్రేవ్ అ లీవ్” కార్యక్రమం
నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూవాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపడం వల్ల ప్రాణాలకు రక్షణ కవచంల ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తోపాటు,కారు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం,మద్యంసేవించివాహనాలునడపడం,హెల్మెట్,సీటుబెల్టుఉపయోగించకపోవడంవల్లజరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలంపోలీసుల బాధ్యత మాత్రమేకాదనిప్రతివాహనదారుడుప్రతిపౌరుడుబాధ్యతగావ్యవహరించినప్పుడేప్రమాదాలనుగణనీయంగా తగ్గించవచ్చన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలనుకాపాడుకోవాలనివిజ్ఞప్తిచేశారు.వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రాంగ్ రూట్లో నడపకూడదని తెలియజేశారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు సెల్‌ఫోన్లను ఉప యోగించొద్దని, సెల్ ఫోన్ లోఇతరులతో మాట్లాడకుండా డ్రైవింగ్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుట్టి పద్మా , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి , వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పోలీసులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments