📄 ePaper
Friday, April 17, 2026
ADS
Homepatancheru political newsఅమీన్పూర్‌లో ఎస్టీపీ ప్లాంట్ వద్దు: బి ఆర్ ఎస్ నేతలు-ప్రభుత్వ...

అమీన్పూర్‌లో ఎస్టీపీ ప్లాంట్ వద్దు: బి ఆర్ ఎస్ నేతలు-ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.

📰 Generate e-Paper Clip

కలెక్టర్ స్పందించకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక

అమీన్‌పూర్,ఏప్రిల్ 17,మెదక్ టుడే న్యూస్:అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని సర్వే నెంబర్ 993లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణంపై స్థానిక ప్రజలు, నాయకులు సమరశంఖం పూరించారు. ఈ ప్లాంట్ వల్ల భవిష్యత్తులో ప్రజలు ఇక్కడ నివసించే పరిస్థితి ఉండదని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు వివిధ కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రధానాంశాలు:ఇసుక బాయ్ వాగు నుండి సుమారు 60-70 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టల ప్రాంతంలో ఎస్టీపీని నిర్మించడం ఏ రకమైన ఇంజనీరింగ్? ఎత్తులో ప్లాంట్ కడితే వచ్చే దుర్వాసన, కాలుష్యం గాలి ద్వారా అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇది ప్రజలను అనారోగ్యానికి గురిచేయడమే” అని పాండురంగారెడ్డి మండిపడ్డారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, డంపింగ్ యార్డ్, ఇప్పుడు ఎస్టీపీ.. ఇలా ప్రతిదానికీ అమీన్‌పూర్ భూములనే కేటాయిస్తే, ఇక్కడ నివసించే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పనులు ఆపకపోవడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమని బిఆర్ఎస్ నేతలు ఉపేందర్ రెడ్డి, కొల్లూరి గోపాల్, బిజిలి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకుల తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. బయోడైవర్సిటీ ప్రాంతంగా ఉన్న అమీన్‌పూర్‌లో పెద్ద చెరువును కాపాడటం చేతకాని ప్రభుత్వం, నివాసాల మధ్య ప్లాంట్ పెట్టడం దారుణమన్నారు. దీనివల్ల:
కేఎస్ఆర్ కాలనీ, రావుస్ కాలనీ
సాయిరాం ఎన్క్లేవ్, రూపశ్రీ కౌంటీ
ఎస్ఎస్ హోమ్స్, ద్వారకా అపార్ట్‌మెంట్స్
వంటి అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పనులను నిలిపివేయాలని, లేనిపక్షంలో అన్ని కాలనీల ప్రజలను ఏకం చేసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, కొల్లూరి గోపాల్, బిజిలి రాజు, వివిధ కాలనీల ప్రతినిధులు ఏ.ఎస్.రావు, లక్ష్మణ్, నర్సింహులు, రాజబాబు, రాజేష్, సుబ్బారావు, సంతోష్, సందీప్, విజయ్, మల్లేష్, నరేష్, ప్రశాంత్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments