న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి.
చేగుంట,ఏప్రిల్,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ జయభారత్ రెడ్డికి మధ్యాహ్న భోజన విరామ సమయంలో అధికారులకు వినతిపత్రాలు రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. అయినప్పటికీ మిగతా ఎన్నో సమస్యలు అలాగే పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవే కాకుండా న్యాయబద్దమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు. ఇదే విషయాన్ని వివిధ రూపాలలో సీఎస్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతోనే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని,న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు భోజన విరామ సమయంలో డివిజన్,మండల కేంద్రాలలో , తహశీల్దార్లకు వినతిపత్రాలను ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈ జేఏసీ) ప్రధాన డిమాండ్లు
జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలి.రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి.
హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలి.సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలి.
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ ఇచ్చి తరువాత నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి.గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి.
317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలి.ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈ జేఏసీ) నాయకులు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి, తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగేళ్లపల్లి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి సుమతి, కాంప్లెక్స్ కన్వీనర్ చరణ్ దాస్, కో కన్వీనర్ విజయలత, ఎస్ జి టి యు మండల నాయకులు శ్రీనివాస్, శ్రీనివాస్, తపస్ సంఘ సభ్యులు రాధా, సరస్వతి, శారద,,సంధ్యారాణి, శ్రీ వాణి, రమాదేవి, ఉమాదేవి ఉమామహేశ్వరి, డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు కాజా అనిసోద్దిన్ సంపతి, మల్లీశ్వరి, పద్మ, నాగమణి, అనసూయ, రూపా దేవి, చంద్రశేఖర్, వివిధ సంఘాల నాయకులకు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పి ఆర్ టి యు అధ్యక్షలు తిరుపతి రెడ్డి, టి ఆర్ టి ఎఫ్ అధ్యక్షలు జగన్ లాల్, ఎస్ టి యుఅధ్యక్షలు మనోహర్ రావు,
టి పి టి ఎఫ్అధ్యక్షలు నర్సింహారావు యు టి ఎఫ్ అధ్యక్షలు బాలపోచయ్య ఎస్ జి టి యూనియన్ నాయకులు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు

