దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి-తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌.

న్యాయ‌బ‌ద్ధ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి. చేగుంట,ఏప్రిల్,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ జయభారత్ రెడ్డికి మ‌ధ్యాహ్న భోజ‌న విరామ స‌మ‌యంలో అధికారుల‌కు విన‌తిప‌త్రాలు రాష్ట్రంలో ఉద్యోగుల‌కు సంబంధించిన దీర్ఘ‌కాలికంగా అనేక స‌మ‌స్య‌లు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ మిగ‌తా ఎన్నో స‌మ‌స్య‌లు అలాగే పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవే కాకుండా న్యాయ‌బ‌ద్ద‌మైన డిమాండ్లు సైతం అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. ఇదే విష‌యాన్ని వివిధ రూపాల‌లో సీఎస్‌,...