📄 ePaper
Saturday, August 1, 2026
ADS
Homepatancheru political newsప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత: అమీన్ పూర్...

ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత: అమీన్ పూర్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

అమీన్ పూర్,జూలై,23,(మెదక్ టుడే న్యూస్ (ప్రతినిధి)

బీరంగూడ డివిజన్ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తానని అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక నల్లూరి హైట్స్ కాలనీలో తన సొంత నిధులతో సుమారు 210 మీటర్ల మేర నూతన సీసీ రహదారి నిర్మాణ పనులను చేపట్టిన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కాలనీల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని, ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని హామీనిచ్చారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి కష్టాలను తొలగించడమే తన ప్రధాన లక్ష్యమని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సహకారంతో బీరంగూడ డివిజన్‌ను అన్ని రంగాల్లోనూ మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు చుక్క రెడ్డి, నరేందర్ రెడ్డి, రామ్ చంద్ర రెడ్డి, మురళి, వెంకట్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular