ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత: అమీన్ పూర్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి.
అమీన్ పూర్,జూలై,23,(మెదక్ టుడే న్యూస్ (ప్రతినిధి) బీరంగూడ డివిజన్ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తానని అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక నల్లూరి హైట్స్ కాలనీలో తన సొంత నిధులతో సుమారు 210 మీటర్ల మేర నూతన సీసీ రహదారి నిర్మాణ పనులను చేపట్టిన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు.ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఆయన తేల్చిచెప్పారు....