అమీన్పూర్‌లో ఎస్టీపీ ప్లాంట్ వద్దు: బి ఆర్ ఎస్ నేతలు-ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.
కలెక్టర్ స్పందించకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక అమీన్‌పూర్,ఏప్రిల్ 17,మెదక్ టుడే న్యూస్:అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని సర్వే నెంబర్ 993లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణంపై స్థానిక ప్రజలు, నాయకులు సమరశంఖం పూరించారు. ఈ ప్లాంట్ వల్ల భవిష్యత్తులో ప్రజలు ఇక్కడ నివసించే పరిస్థితి ఉండదని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు వివిధ కాలనీల అసోసియేషన్...