📄 ePaper
Saturday, September 19, 2026
ADS
Home Blog Page 24

ఆవులను కొనవద్దు కుర్బానీ ఇవ్వవద్దు చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ.

0

చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, బక్రీద్ పండుగ సమీపిస్తున్న వేళ ముస్లిం సోదరులు ఎవరూ ఆవులను కొనవద్దని, కుర్బానీ ఇవ్వవద్దని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముస్లిం సోదరులంతా ఆవులకు బదులుగా మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మాత్రమే కుర్బానీ ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు సోదరులు తమ వద్దకు వచ్చి ఆవులను కొనమని అడిగినా.సున్నితంగా తిరస్కరించాలని కోరారు.మన హిందూ సోదరులు ఆవును తల్లిగా, గోమాతగా భావించి ఎంతో పవిత్రంగా పూజిస్తారని, వారి యొక్క మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో మతసామరస్యం ఇనుమడించేలా, అందరి భావాలను గౌరవిస్తూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అందుకే దయచేసి ఎవరూ ఆవులను కొనవద్దని, కుర్బానీ ఇవ్వవద్దని మహమ్మద్ రఫీ విజ్ఞప్తి చేశారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య.

0
Oplus_16908288

కొల్చారం,మే,24,(మెదక్ టుడే న్యూస్):అప్పుల బాధతో ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన కొల్చారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన కొల్చారం గ్రామానికి చెందిన మంగలి వెంకటేశం 48 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం ఆదివారం నాడు ఉదయం మృతుని భార్య కూలీ పనుల నిమిత్తం వెళ్లిపోయినా తర్వాత మధ్యాహ్నం అందాజ 12 గంటల సమయంలో వెంకటేశం ఇంట్లో ఉరి వేసుకున్నట్లు మా మామ మంగళ కిష్టయ్య ఫోన్ చేసి ఇంట్లో ముందు రూమ్లో నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుపగా వెంటనే నేను వచ్చి చూడగా నిజంగానే నా భర్త వెంకటేశం ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు నా భర్త వెంకటేశంకు గతంలో రోడ్డు ప్రమాదం అయినందున కొన్ని అప్పులు అయినవి నూతనంగా ఇల్లు నిర్మించినందువలన అప్పులు ఆయనవి అట్టి అప్పులు ఎలా తీర్చాలని గత రెండు రోజుల నుండి తనలో తాను బాధపడుతున్నాడు అదే బాధతో ఇంట్లో ఎవరు లేనిది చూసి నల్లని నైలాన్ తాడుతో తనంతట తానుగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నా భర్త మంగళి వెంకటేశం మరణం పై మాకు ఎలాంటి అనుమానం లేదు అని మృతుని భార్య మంగలి రేణుక పోలీసులకు వెల్లడించారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నాడు మృతుని భార్య రేణుక పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ అహ్మద్ మోహినుద్దీన్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

పాము కాటుతో బాలుడు మృతి.

0

కొల్చారం,మే,24,మెదక్ టుడే న్యూస్:పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వరిగుంతం గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దండు సుజిత్ కుమారుడు దండు సతీష్ (7) శనివారం రాత్రి ఇంటి ముందు తన తాత మా అన్నయ్యతో కలిసి ఇంటి ముందు వాకిట్లో నిద్రించాడు. కాగా అర్ధరాత్రి సమయంలో బాలుని చేతి వేలుకు ఏదో కుట్టినట్లు అనిపించగా వెంటనే లేచి తండ్రికి తెలిపాడు. బాలుని తండ్రి సుజిత్ కుమారుని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా హాస్పిటల్ తరలించాడు. రాత్రి అక్కడ చికిత్స తీసుకుని, ఆదివారం మెదక్ ఎం సి హెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం బాలుడు మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని తర్యాప్తు చేపట్టారు.

వివో ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.

0

కొల్చారం,మే,24,మేటర్ టుడే న్యూస్:పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వీఈవివో ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి… పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వివో ఏల సంఘం కొల్చారం మండల మాజీ అధ్యక్షుడు పులిబోయిన నర్సింలు అన్నారు.మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రెండో రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల, గ్రామ సంఘాల వి ఏవోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్ల మంజుల, ఉపాధ్యక్షులు కె.అశోక్ వివో ఏలు నర్సింలు, యాదగిరి, పద్మ, లక్ష్మణ్, స్వరూప, చమంత, జోసెఫ్, మంజుల, సుమలత, శ్యామల, భారతి, రేణుక మోతిలాల్ పాల్గొన్నారు.వోల సంఘం కొల్చారం మండల మాజీ అధ్యక్షుడు పులిబోయిన నర్సింలు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రెండో రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల, గ్రామ సంఘాల వి ఏవోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్ల మంజుల, ఉపాధ్యక్షులు కె.అశోక్ వివో ఏలు నర్సింలు, యాదగిరి, పద్మ, లక్ష్మణ్, స్వరూప, చమంత, జోసెఫ్, మంజుల, సుమలత, శ్యామల, భారతి, రేణుక మోతిలాల్ పాల్గొన్నారు.

లారీల కోసం రోడ్డెక్కిన రైతన్నలు.

0

కొల్చారం,మే,24,మెదక్ టుడే న్యూస్:వరి ధాన్యంతూకం వేసి వారం రోజులు అవుతున్నప్పటికీ లారీలు రావడంలేదని సంగాయిపేటలో రైతులు రోడ్డెక్కారు. సుమారు గంటపాటు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ లారీలు రావడంలేదని ప్రైవేట్ లారీలు ధాన్యం లోడ్ చేయాలంటే 15000 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు నిర్లక్ష్యం మూలంగానే లారీలు సకాలంలో రావడంలేదని లారీ ట్రాన్స్పోర్ట్ లను రైస్ మిల్లు యజమానులను అదుపులో ఉంచాల్సిన అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతుల ఆరోపించారు. వారం రోజుల క్రితం గ్రామం నుండి వెళ్లిన లారీ ఇప్పటికి కాళికాకపోవడం అధికారులు పనితీరుకు నిదర్శనంగా రైతులు పేర్కొన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కరుణ నేపథ్యంలో అదనపు లారీలను ఏర్పాటు చేసి ధాన్యం ఖాళీ చేయించాలని రైతుల డిమాండ్ చేశారు. కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ మొయినుద్దీన్ సంగాయిపేటకు చేరుకుని రైతులకు సముదాయించి ఆందోళన విరమింప చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహిళల స్వయం ఉపాధికి ఫెమినా మహిళ సేవా మండలి ఆదర్శంఉచిత బ్యూటిషన్, కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు.

0


మైనారిటీ మహిళలకు ఉపాధి మార్గం చూపుతున్న అలియా సుల్తానా సేవలు ప్రశంసనీయం.

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,23:షాద్‌నగర్ పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఫరూక్‌నగర్ ఉర్దూ ప్రైమరీ స్కూల్ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్ర భవనంలో ఫెమినా మహిళ సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 90 రోజుల ఉచిత బ్యూటిషన్ మరియు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు శనివారం సందర్శించారు.ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రముఖ సంఘ సేవకురాలు అలియా సుల్తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ముస్లిం మైనారిటీ మహిళలు, నిరుద్యోగ యువతులు స్వయం ఉపాధి సాధించే లక్ష్యంతో ఉచితంగా బ్యూటిషన్ కోర్సులు, కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ వెంకన్న బాబు పేర్కొన్నారు.స్వయం ఉపాధి ద్వారా మహిళల ఆర్థిక సాధికారతడాక్టర్ వెంకన్న బాబు మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా శిక్షణ ఇవ్వడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. శిక్షణ పొందిన మహిళలు మరికొందరికీ ఈ నైపుణ్యాలను అందిస్తూ సేవాభావంతో ముందుకు రావాలని సూచించారు.ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయం
ఈ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించి ప్రోత్సహించడం, 14వ వార్డు కౌన్సిలర్ అందె మోహన్ సహకారం అందించడం సంతోషకర విషయమని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, సేవా సంస్థలు కలిసి పనిచేస్తే సమాజంలో మంచి మార్పులు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు.
అలియా సుల్తానా సేవాభావం ఆదర్శం
ఈ సందర్భంగా అలియా సుల్తానా మాట్లాడుతూ “మానవసేవే మాధవ సేవ” అనే భావనతో ఎలాంటి పారితోషికం ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నానని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధంగా మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తూ వస్తున్నానని, ఇకముందు కూడా తన శాయశక్తులా మరింత మెరుగైన శిక్షణలు అందించేందుకు అందరి ప్రోత్సాహంతో ముందడుగు వేస్తానని అభిప్రాయం వ్యక్తం చేశారు.కేంద్ర నిర్వహణకు అవసరమైన పరికరాలు, సామాగ్రి అందజేస్తూ సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థల నాయకులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“సేవ చేయడంలో కలిగే ఆనందం సంపాదనలో ఉండదు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం నా లక్ష్యం” అని ఆమె పేర్కొన్నారు.30 మంది మహిళల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది ముస్లిం మైనారిటీ మహిళలు, నిరుద్యోగ యువతులు పాల్గొన్నారు. శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు పొందాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

సంగాయిపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.

0

కొల్చారం,మే,23,మెదక్ టుడే న్యూస్:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలం నిర్వహిస్తున్న రైతులు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శనివారం కూల్చారం మండల సంగాయిపేట గ్రామంలో నిర్వహించారు. రాజేంద్రనగర్ హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రమీల వివిధ పంటలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. ముఖ్యంగా వరిలో నరుమాడిలో యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి వివరిస్తూ వ్యవసాయ విశ్వావిద్యాలం వారు రూపొందించిన సన్న రకాలు KNM-1638,RNR-15048,HMT-SONA, WGL-42,WGL-962JGL-1798,వంటి సన్న విత్తనాలు ను పండించవలసిందిగా సూచించారు. పత్తి మొక్కజొన్న పంటలలో వచ్చే కలుపు చీడపిడల గురించి వివరిస్తూ పంట మార్పిడి పధ్ధతిని పాటించాలని సూచించారు. అలాగే జీవనియంత్రనా పద్ధతులను కూడా వివరించడం జరిగింది. పచ్చి రొట్టె ఎరువులు గురించి వివరిస్తూ జనుము, జీలుగ వంటి విత్తనాలను రైతు తన సొంత భూమిలో ఒక మడిలోనైనా పండించి దానిని రాబోయే పంటకాలానికి విత్తనంగా ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నివృత్తి పరచుకోవడంతోపాటు.. పంట మార్పిడి చేయడం తమకు ఇష్టమైనప్పటికీ కోతుల బెడద వల్ల కొంతవరకు ముందడుగు వేయలేకపోతున్నామని చెప్పారు. మొక్కజొన్న, జొన్న పొద్దు తిరుగుడు వంటి పంటలు వేసిన రైతులు తమకు కొనుగోలు కేంద్రాలు కొంతవరకు దగ్గరలో ఉండేలాగా ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రమీల, గ్రామ సర్పంచ్ కుర్ర రత్నమ్మ ప్రభాకర్, ఎపిఓ ఛైర్మెన్ వెంకటరెడ్డి, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

ఘనంగా వెంకటేశ్వర కళ్యాణం.

0

కొల్చారం,మే,23,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాద్ రావు పంతులు ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శని, ఆదివారాలు రెండు రోజులు నిర్వహిస్తామని, శనివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకము అలంకరణ కళ్యాణం మహోత్సవం, ఆదివారం గోపాల కాలువలు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పట్వారి ప్రసాదరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జేష్ట వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈకార్యక్రమంలో సర్పంచ్ సుజాత శేకులు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు,బీ ఆర్ఎస్ నాయకులు ఆగ్రహం.

0

చేగుంట,మే,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో శనివారం బీఆర్‌ఎస్ (బిఆర్ఎస్) పార్టీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకుడు సోమ సత్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ స్థానిక నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ఉనికి కోసం కొందరు కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎమ్మెల్యే కాలి గోటికి కూడా సరిపోని వారికి ఆయనను విమర్శించే స్థాయిగానీ, అర్హతగానీ లేదని మండిపడుతూ, అనవసరంగా నోరుపారేసుకుంటే సాక్ష్యాలతో సహా గుట్టు రచ్చకీడుస్తామని “ఖబర్దార్” అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఎన్నికల వేళ ప్రజలకు వందలాది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం మూడు నాలుగు హామీలను కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయిందని, నేడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, బీడీ పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు లంచాలు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గత కేసీఆర్ హయాంలో రైతులను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటూ 24 గంటల ఉచిత విద్యుత్ అందించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సజావుగా కొనుగోలు చేశారని గుర్తు చేస్తూ.. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత సృష్టించి రూ. 1,350 బస్తాను రూ. 1,550కి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని, రుక్మాపూర్, అన్నసారం లాంటి కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన వడ్లతో రైతులు రోడ్లపై పడి అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే నిరంతరం ఊరూరా తిరుగుతూ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను పలకరిస్తూ, రైతులను ఓదార్చుతూ అండగా నిలుస్తున్నారని కొనియాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే చేగుంట, దుబ్బాక, దౌల్తాబాద్ లేదా మెదక్.. ఇలా ఏ నియోజకవర్గంలోనైనా బహిరంగ చర్చకు రావాలని, చేతలైతే మొదట ఎంపీపీ స్థానానికి అవిశ్వాస తీర్మానం పెట్టి గెలవాలని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో చేగుంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, రాజగోపాల్, డిష్ రాజు, మహమ్మద్ అలీ, కటికే రాజేష్, పట్నం తనీషా, సోమ సత్యనారాయణ, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దశివునూర్ లో కొనసాగుతున్న జనగణన.

0

పెద్దశివునూర్ లో కొనసాగుతున్న జనగణన.

చేగుంట,మే,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పెద్దశివునూర్ గ్రామంలో మొదటి విడత జనగణన దిగ్విజయంగా కొనసాగుతుంది. స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు సంతోషి ఎన్యుమరేటర్లుగా ప్రతిరోజు ఉదయాన్నే గ్రామాన్ని చుట్టేస్తున్నారు.గ్రామ ప్రజల సహకారంతో ఇప్పటికే 70%పైగా జనగనన పూర్తి చేసామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.ఆరంభం నుండి కొన్ని ఇండ్లకు తాళాలు వేసి ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నందున ప్రజలు కొన్ని రోజులు ఇంటివద్ద ఎవరినైనా ఉంచినట్లుయితే త్వరగా పూర్తి చేయడానికి వీలుపడుతుందని తెలియజేసారు. కాగా వచ్చే నెల అనగా జూన్ 9వరకు జనగనన కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో చేగుంట మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులుగ్రామస్తులు. అప్పల ప్రశాంత్ అన్నం శ్రీనివాస్ ఎర్ర ఎల్లయ్య అప్పల శంకర్ అన్నం సిద్ధ రాములు అన్నం యాదగిరి మల్లయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.