చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పిఎసిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం చేగుంట ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ పరిశీలించారు.వారు మాట్లాడుతూ రైస్ మిల్లులకు వెళ్లిన లారీలు వెంటనే అన్లోడ్ చేయాలని సుమారు ఇక్కడ 3000 బస్తాల ధాన్యం నిల్వ ఉందని,ఇంకా కాంటా పెట్టని ధాన్యం చాలా ఉన్నది. త్వరగా అధికారులు స్పందించి రైస్ మిల్లులలో ఉన్న లారీలను త్వరగా అన్లోడ్ అయ్యే విధంగా చూడాలని వారన్నారు ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది కొంచెం వర్షం వచ్చినా ధాన్యం తడిసిపోయి చేతికి వచ్చిన పంట కరాబ్ అవుతుంది అందువల్ల అధికారులు తొందరగా స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఉప సర్పంచ్ తో పాటు గ్రామ రైతులు ఉన్నారు.
ఒరిజినల్ భూమి పత్రాలు పోగొట్టుకున్నారు: ఆచూకీ దొరికితే తెలపాలని విజ్ఞప్తి.
చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, వెల్దుర్తి గ్రామానికి చెందిన కిష్టం రంగయ్య (తండ్రి బాల నరసయ్య) చేగుంట మండల కేంద్రంలో తన భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు (ల్యాండ్ డాక్యుమెంట్స్) పోగొట్టుకున్నట్లు తెలిపారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఆయన వెల్దుర్తి నుండి చేగుంటకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చారు. చేగుంటలో దిగిన తర్వాత ఇక్కడి ఒక జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి తన బ్యాగును పరిశీలించగా అందులో ఉండవలసిన ఒరిజినల్ డాక్యుమెంట్ పోయినట్లు గుర్తించారు. పోగొట్టుకున్న పత్రం చేగుంట గ్రామంలోని ఎన్జీవోస్ కాలనీకి సంబంధించిన స్థలం డాక్యుమెంట్ అని, దాని ఒరిజినల్ డాక్యుమెంట్ నెంబర్: 863/98 అని బాధితుడు రంగయ్య ఆవేదనతో తెలిపారు. కావున ప్రయాణికులు లేదా స్థానికులకు ఎవరికైనా ఈ నెంబర్ గల ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్ లభించినట్లయితే, మానవతా దృక్పథంతో కింద పేర్కొన్న ఫోన్ నెంబర్లకు సంప్రదించి సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు 9394571393, 9666950677, 9010360853.
ఉపసర్పంచ్ రఫీకి పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవ.
చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఉదయవరం (వడియారం) గ్రామ రోడ్డు పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి, భువనేశ్వరి మాత, శ్రీ పెద్దిరాజు ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల ఆహ్వాన పత్రికను ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీకి ఘనంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 26వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేద పండితులు శ్రీ కృష్ణం రఘురామ శర్మ, శ్రీ రేవునూరి వెంకటేశ్వర శర్మల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపారు. జూన్ 26న విగ్రహాల ఊరేగింపు, 27న యాగశాల ప్రవేశం, 28న చండీహోమం, ముఖ్యంగా జూన్ 29న ఉదయం 08:26 గంటలకు ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని, జూన్ 30న బండ్ల ప్రదక్షిణతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ మహాత్కార్యానికి ఉపసర్పంచ్ రఫీతో పాటు భక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. పత్రికను స్వీకరించిన ఉపసర్పంచ్ రఫీ.. కార్యక్రమానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం బాధ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నేటి నుంచే రోహిణి కార్తె.. భానుడి భగభగలు-అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక!
(స్టేట్ బ్యూరో)మే,25,మెదక్ టుడే న్యూస్:నేటి (మే 25) నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. జూన్ 8వ తేదీ వరకు కొనసాగే ఈ కార్తె కాలంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడిమి వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, తీవ్ర అలసట, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజంతా తరచుగా నీరు తాగాలని, కేవలం దాహం వేసినప్పుడే కాకుండా మధ్యమధ్యలో పానీయాలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలని, లేత రంగు కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం మరియు ఓఆర్‌ఎస్ (ORS) పానీయాలు తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పుచ్చకాయ, దోసకాయ, ఖర్బూజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేశారు.
అక్షర యోధుల పోరాటానికి ఫలితం.లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనమీడియా కృషితోనే ప్రజల ఆకాంక్ష నెరవేరింది.
పాత్రికేయుల సేవలను కొనియాడిన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,24,మెదక్ టుడే న్యూస్:లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనలో మీడియా పోషించిన పాత్ర అమూల్యమని మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశంసించారు. ప్రారంభం నుంచి చివరి వరకు పాత్రికేయులు అక్షరాయుధంతో ప్రజల తరఫున పోరాడి పాలకులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. జలాశయ సాధనే లక్ష్యంగా వార్తలు, కథనాలు ప్రచారం చేసి ప్రజా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందన్నారు.ఈ సందర్భంగా పాత్రికేయుల తరఫున సీనియర్ జర్నలిస్ట్ కేపీకి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఆంజనేయులు గౌడ్‌కు శాలువాలతో ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మీడియా నిష్పక్షపాత ధోరణితో పనిచేసినప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు సులభమవుతాయని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి అంశంలో మీడియా చూపిన పట్టుదల వల్లే పాలకులు స్పందించి అభివృద్ధి దిశగా అడుగులు వేసారని అన్నారు.
ప్రజల సమస్యలపై ఎవరైనా నిర్లక్ష్యం వహించినా ప్రశ్నించే హక్కు మీడియాకే ఉందని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా జర్నలిస్టులు ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా వెలువడిన కథనాలు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనను వేగవంతం చేశాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు రంగనాథ్, శరత్, రాఘవేందర్ గౌడ్, లక్కాకుల రమేష్, సరాపు రమేష్, నరసింహారెడ్డి, సాయి రెడ్డి, రాకేష్, మల్లికార్జున్, ధరంపాల్, షకీల్, రియాజ్, దర్శనం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు దశాబ్దాల ప్రేమ బంధానికి ఘన వేడుకనీరుడు అశోక్ ముదిరాజ్ – లక్ష్మీబాయి దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం.
రాష్ట్ర నాయకులు, సామాజిక ప్రముఖుల సమక్షంలో అభినందనల వెల్లువ
“ఆదర్శ దాంపత్యానికి ప్రతీక” అంటూ కొనియాడిన నేతలు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అశోక్ ముదిరాజ్
(స్పెషల్ కరస్పాండెంట్)హైదరాబాద్,మే,24,మెదక్ టుడే న్యూస్: నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర ఆర్టీఐ అధ్యక్షులు, జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరుడు అశోక్ ముదిరాజ్ గారు మరియు వారి సహచరి లక్ష్మీబాయి దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, మిత్రులు, అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఆనందోత్సాహాలతో కళకళలాడింది.
ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. సర్వేధర్ మాట్లాడుతూ, “నాలుగు దశాబ్దాలుగా ప్రేమ, పరస్పర అవగాహన, కుటుంబ విలువలు, సమాజ సేవ అనే నాలుగు స్తంభాలపై అశోక్ ముదిరాజ్ – లక్ష్మీబాయి దాంపత్య జీవితం నిలిచింది” అని కొనియాడారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ మాట్లాడుతూ, “ప్రజా సేవలో ముందుండే అశోక్ ముదిరాజ్ కుటుంబ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు” అన్నారు.
స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దామోదర్ గుప్తా మాట్లాడుతూ, “సామాజిక సేవ, మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో అశోక్ ముదిరాజ్ చూపుతున్న చొరవ ప్రశంసనీయం. లక్ష్మీబాయి గారి సహకారం ఆయన విజయాలకు బలమైన ఆధారం” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ స్పోక్స్ పర్సన్, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అభిమానుల శుభాకాంక్షలతో సందడిగా వేడుకలు
వేడుకలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, ఆనందాలతో జీవించాలని ఆకాంక్షించారు. మనవళ్లు యక్షిత్, తక్షు, యువాన్, వివాన్, మనవరాలు యామిని సందడితో వేడుక మరింత ఆహ్లాదకరంగా మారింది.
“మీ అందరి ప్రేమాభిమానాలు మరువలేనివి”
ఈ సందర్భంగా నీరుడు అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ, తమ వివాహ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించి ఆశీస్సులు అందించిన రాష్ట్ర అధ్యక్షుడు బి. సర్వేధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దామోదర్ గుప్తా, డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు సహా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరుల ప్రేమాభిమానాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజేందర్ కుమార్ నలరి, పటాన్చెరువు కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ ముదిరాజ్, ఆషా, వాసంతి, అరుణ్ యాదవ్, మల్లేష్ యాదవ్, సత్యం ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నర్సింగ్ రావు ముదిరాజ్, సాయినాథ్, సాయి గణేష్, మౌనిక, పృథ్వీరాజ్, ప్రీతి, యామిని తదితరులు పాల్గొన్నారు.

చేగుంట పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
18 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు
చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 విద్యాసంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేడుక వడియారంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సహచర మిత్రులంతా ఒకరినొకరు కలుసుకోవడంపై పూర్వ విద్యార్థులు అమితానందం వ్యక్తం చేశారు. నాటి పాఠశాల జ్ఞాపకాలను, చిన్ననాటి ముచ్చట్లను ఈ సందర్భంగా ఒకరితో ఒకరు పంచుకుంటూ సందడి చేశారు. ఈ ఆత్మీయ కలయిక తమ జీవితంలో ఒక మధురమైన రోజని వారు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాటి పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు బాలకృష్ణ, గర్దాస్ మనోహర్ రావు, చల్లా లక్ష్మణ్, రాజేశ్వరిలను విద్యార్థులు ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సమ్మేళనంలో నాటి పదవ తరగతి పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు చేగుంట మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్.
చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే జీలుగ విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపారు. వర్షాకాలం పంటల సాగుకు ముందు భూసారాన్ని పెంచేందుకు ఈ పచ్చిరొట్ట ఎరువులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మార్కెట్‌లో 30 కిలోల జీలుగ విత్తనాల బస్తా పూర్తి ధర రూ. 4,905 కాగా, ప్రభుత్వం కల్పిస్తున్న 50 శాతం సబ్సిడీ పోను రైతులు కేవలం రూ. 2,451 చెల్లించి ఈ విత్తనాలను పొందవచ్చునని వివరించారు. ఈ సబ్సిడీ విత్తనాలు కావలసిన మండల పరిధిలోని రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డులను తీసుకువచ్చి విత్తనాలను పొందాలని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ కోరారు.
ధాన్యం కొనకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాంఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:నార్సింగి, చేగుంట మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇరవై రోజులుగా రైతులు వేచిచూస్తున్నప్పటికీ.. సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎంఆర్ఓ, ఏఓలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.వడదెబ్బల కారణంగా ఇద్దరు రైతులు అస్వస్థతకు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని తెలిపారు. “మా ధాన్యాన్ని కొనకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం, ధాన్యానికి నిప్పంటిస్తాం” అనే స్థితికి రైతులను నెట్టివేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి, సంబంధిత మంత్రులు,అధికారులు ఎవరూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఈ ప్రాంతంలో భారీగా వరి దిగుబడి వచ్చినప్పటికీ, ఉన్న ఎనిమిది రైస్ మిల్లుల్లో కూడా ధాన్యం సక్రమంగా దింపడం లేదని, దింపిన చోట్ల కిలోకు కిలోన్నర వరకు తరుగు పేరుతో కోతలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లై అధికారులు, కలెక్టర్ స్పందించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై ధర్నాలు చేసినా, వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని, బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. మరో రెండు మూడు రోజుల్లో మొత్తం ధాన్యాన్ని ఎత్తకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ గ్రామంలో ఎంత ధాన్యం వస్తుంది, రైస్ మిల్లుల సామర్థ్యం ఎంత అనేది ముందస్తు ప్రణాళికతో పనిచేసేవాళ్లమని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల బాధలను పట్టించుకోకుండా కేవలం సమావేశాలు, ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
చేగుంట గ్రామంలో సోదర దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది.
చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంగ్ ఆధ్వర్యంలో అన్నదమ్ముల దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా వాలీబాల్ అధ్యక్షుడు అఐత పరంజ్యోతి హాజరై కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మన జీవితంలో అన్న ప్రాముఖ్యత ఎక్కువ అమ్మానాన్న తర్వాత ఆలనా పాలన ధైర్యం నమ్మకం సోదరుడే, తల్లిలా ప్రేమ ఆప్యాయతలు చూపించేది అక్కాచెల్లెళ్లు తల్లి తండ్రుల బాధ్యతలు వారి భుజాలపై వేసుకొని మోసేది అన్న తమ్ముళ్లు అని వారు అన్నారు. అందరూ సంతోషంగా ఉండాలి అందరితో కలిసి మెలిసి ఉండాలి అని వారు కోరారు.ఈ కార్యక్రమంలో అఐత పరంజ్యోతి,సోమ సత్యనారాయణ, ఎర్ర యాదగిరి, అంబేద్కర్ యువజన సంగ్ అధ్యక్షుడు విష్ణు,అక్బర్,బాలేష్,సాదుల్లా, నరేష్,ఎల్లేష్, సల్లుపాష,బాబు,దాసరి సురేష్,కొండి స్వామి,తదితరులు పాల్గొన్నారు.











