(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్, ఏప్రిల్ 25: మెదక్ టుడే న్యూస్:
షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ గ్రామంలోని చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు.శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ “శ్రీరామ జయరామ్, జయ జయ రామ్” నినాదాలతో భక్తులు ఊరేగింపుగా పాల్గొన్నారు. భక్తి గీతాలు, భజనలతో ఆలయ ప్రాంగణం మార్మోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రాచార్యతో పాటు అర్చకులు ప్రమోద్, సునీల్ పంతులు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ సీఐ కె. సీతారాం దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
మున్సిపాలిటీ 6వ వార్డు మాజీ కౌన్సిలర్ పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి దేవాలయ కమిటీ సభ్యులు పూలమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే మండువేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు దాత బొట్టు రమేష్ చల్లని మంచినీటిని అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులిమామిడి శ్రీశైలం గౌడ్, జి. వసంతరావు, అన్నారం రఘు గౌడ్, గడ్డమీద రమేష్ ముదిరాజ్, శంకర్ గౌడ్, లక్ష్మారెడ్డి, యాదగిరి, తులసిరామ్, రఘునందన్ రెడ్డి, సుప్ప నర్సింలు, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, శంకరయ్య, వీఆర్వో బచ్చన్న, సుప్ప కృష్ణయ్య, పి. ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, జగన్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, రవి, హనుమంత్ రెడ్డి, రవీందర్, నరసింహులు, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం మహిళలు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం భక్తుల ఉత్సాహం, సమన్వయంతో విజయవంతంగా ముగిసింది.

