చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవపల్లకీ సేవలో పాల్గొన్న సీఐ సీతారాం దంపతులు.
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్, ఏప్రిల్ 25: మెదక్ టుడే న్యూస్:షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ గ్రామంలోని చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు.శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ “శ్రీరామ జయరామ్, జయ జయ రామ్” నినాదాలతో భక్తులు ఊరేగింపుగా పాల్గొన్నారు. భక్తి గీతాలు, భజనలతో ఆలయ ప్రాంగణం మార్మోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు,...