📄 ePaper
Saturday, September 19, 2026
ADS
Home Blog Page 22

బ్లూ స్టార్ ఈవెంట్స్ పురస్కారం: ‘రాష్ట్రీయ దివ్య ప్రతిభా సమ్మాన్’ కు మీర్ గియాసుద్దీన్ ఎంపిక.

0
Oplus_16908288

చేగుంట,మే,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవా నిర్వాహకులు వడియారం గ్రామం మీర్ గియాసుద్దీన్ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. బ్లూ స్టార్ ఈవెంట్స్ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అందజేసే “రాష్ట్రీయ దివ్య ప్రతిభా సమ్మాన్ – 2026” అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆయనను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. మీర్ గియాసుద్దీన్ సమాజంలో వెనుకబడిన, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగుల శ్రేయస్సు కోసం అందిస్తున్న “దివ్యాంగ్ సేవ”లను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన నిరంతర అంకితభావం, సమాజంపై ఆయన చూపిన సానుకూల ప్రభావాన్ని అభినందిస్తూ సంస్థ ప్రతినిధులు ఎంపిక లేఖను అందజేశారు. మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఈ జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మరియు పలువురు సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ మీర్ గియాసుద్దీన్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

వల్లూరు గ్రామ ప్రజలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రస్తారోకో.

0

చేగుంట,మే,26,మెదక్ టుడే న్యూస్:నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ ప్రజలు క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ వల్లూరు గ్రామస్తులు మంగళవారం జాతీయ రహదారి 44 పై ఆందోళనకు దిగారు ప్రమాదకరంగా మారిన క్రాసింగ్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు గ్రామస్తులు ఆందోళనతో హైదరాబాద్ కామారెడ్డి వైపు భారీగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న నార్సింగ్ ఎస్సై సృజన సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకొచ్చారు.అధికారులు అధికారులతో చర్చించి మీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.

అప్పాజీపల్లి లో ఘనంగా ఎల్లమ్మకు బోనాలు.

0
Oplus_16908288

కొల్చారం,మే,26,మెదక్ టుడే న్యూస్:కొల్చారం మండలం అప్పాచిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా ఎల్లమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఎల్లమ్మకు బోనాలు తీయడం ఆనవాయికి.చివరి రోజు ఎల్లమ్మకు ఏడంతరాల బోనం తోపాటు గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు పురవీధుల గుండా ఆలయం వద్దకు బోనాలు ఎత్తుకెళ్లి వారి వారి మొక్కలు సమర్పించుకున్నారు. బోనాల ముందు శివశక్తుల పూనకాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

అప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం.

0

ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చింతల భాగయ్య, ఉపాధ్యక్షులు కన్ని బోయిన నర్సింలు.

కొల్చారం,మే,26,మెదక్ టుడే న్యూస్:కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు, పెద్దలు, యువత, ప్రముఖుల సమక్షంలో జరిగిన సమావేశంలో సంఘ భవిష్యత్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఏకగ్రీవ నిర్ణయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.సంఘ అధ్యక్షులుగా చింతల భాగయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్, క్యాషియర్‌గా కన్నెబోయిన వేణు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా చింతల చంద్రశేఖర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.నూతనంగా ఎన్నికైన సంఘ అధ్యక్షుడు చింతల భాగయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, సంఘ సభ్యులందరి సహకారంతో ముదిరాజ్ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, విద్యా మరియు సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు.
ఉపాధ్యక్షుడు కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్ మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్తామని సంఘ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సభ్యుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని సంఘ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ పదివేల జరిమానా-తాగి వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు,మహమ్మద్ మొయి ఉద్దీన్.

0

కొల్చారం,మే,25,మెదక్ టుడే న్యూస్:ఇటీవల పోలీసుల సాధారణ తనిఖీలలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తికి మెదక్ స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఊరే ప్రభాకర్ పదివేల జరిమానా విధించినట్లు కొల్చారం ఎస్సై మహమ్మద్ మోయి ఉద్దీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    ఉపాధి కూలీలకు సదుపాయాలు కల్పించాలి.

    0

    సిఐటియు జిల్లా కోశాధికారి నర్సమ్మ.

    కొల్చారం,మే,25,మెదక్ టుడే న్యూస్:ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ అన్నారు. సోమవారం ఆమె పోతంశెట్టిపల్లి, వెంకటాపూర్, కొంగోడు గ్రామాలను సందర్శించి, ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. ఫణి ప్రదేశాలలో నీడ, నీళ్లు, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. పనిముట్లు అందజేయాలన్నారు. సకాలంలో పులి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జూన్ 2న కొల్చారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఆయా గ్రామాల ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

      పౌష్టికాహారం పై అవగాహన.

      0

      కొల్చారం,మే,25,మెదక్ టుడే న్యూస్:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మహిళా వారోత్సవాలలో భాగంగా సోమవారం కొల్చారం గ్రామపంచాయతీ ఆవరణలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కిశోర బాలికలు, తల్లులు గర్భిణీ స్త్రీలకు పౌష్కాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం తయారు చేసి చూపించారు. గర్భిణీ స్త్రీలకు హిమోగ్లోబిన్ టెస్టులా పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

      ఐకేపీ మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేసిన వడియారం గ్రామసర్పంచ్ అంకన్న సాయికుమార్ గౌడ్.

      0

      చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంవడియారం గ్రామంలో ఐకేపీ మహిళా సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ పాలక వర్గ సభ్యులు మహిళ సంఘం సభ్యుల తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహిళలకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సౌకర్యవంతమైన భవనం అందుబాటులోకి రానుందని తెలిపారు. నిధులు మంజూరు చేసిన ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి,దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
      ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్,ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి విజయ్ పాల్ రెడ్డి, సీసీలు శ్వేత, శంకర్, వార్డు సభ్యులు జనార్ధన్ గౌడ్, గయాజ్, అనిల్, కవిత, సీఏ గాయత్రి, గ్రామ నాయకులు రాజు, నదీం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

      ఉపసర్పంచ్ రఫీకి పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత.

      0

      చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఉదయవరం (వడియారం) గ్రామ రోడ్డు పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి, భువనేశ్వరి మాత, శ్రీ పెద్దిరాజు ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల ఆహ్వాన పత్రికను ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీకి ఘనంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 26వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేద పండితులు శ్రీ కృష్ణం రఘురామ శర్మ, శ్రీ రేవునూరి వెంకటేశ్వర శర్మల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపారు. జూన్ 26న విగ్రహాల ఊరేగింపు, 27న యాగశాల ప్రవేశం, 28న చండీహోమం, ముఖ్యంగా జూన్ 29న ఉదయం 08:26 గంటలకు ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని, జూన్ 30న బండ్ల ప్రదక్షిణతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ మహాత్కార్యానికి ఉపసర్పంచ్ రఫీతో పాటు భక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. పత్రికను స్వీకరించిన ఉపసర్పంచ్ రఫీ.. కార్యక్రమానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం బాధ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

      కూలి పనికి వెళ్లిన కవిత అదృశ్యం దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ భిక్యా నాయక్.

      0
      Oplus_16908288

      చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దేశెట్టి కవిత భర్త గంగాధర్, వయసు 30 సంవత్సరాలు కులం వడ్డెర వృత్తి కూలి పని గాను నిన్న తేదీ 24-05-2026 నాడు ఉదయం ఎనిమిది గంటలకు కూలి పని నిమిత్తం ఇంటి నుండి బయలుదేరి మేడ్చల్ కు వెళ్లినది కానీ ఇప్పటి వరకు కవిత తిరిగి ఇంటికి రాలేదు. కవిత బావ అయినా దేశెట్టి లక్ష్మణ్ తండ్రి మల్లయ్య వయసు 45 సంవత్సరాలు కులం వడ్డెర వృత్తికూలి పని వారి ఫిర్యాదు మేరకు భిక్య నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేగుంట పిఎస్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడమైనది.