📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 21

చేగుంట గ్రామపంచాయతీ ఆవరణలో మే డే వేడుకలు.

0

చేగుంట,మే,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు, కార్మిక దినోత్సవం పురస్కరించుకొని జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా సర్పంచ్ స్రవంతి సతీష్ ఉపసర్పంచ్ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి లింగం, మాట్లాడుతూ 1986లో చికాగో లో 18 గంటల పనిని ఎనిమిది గంటలకు కుదిస్తూ మే ఒకటో తేదీన అమలు చేయడం జరిగిందని దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 1వ తేదీని కార్మిక దినోత్సవం గా పిలుస్తూ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అని తెలిపారు, కార్మికుల కు కనీస వేతనం ఇవ్వాలని కార్మిక దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని వారు అన్నారు, కార్మికులకు పనికి తగ్గ వేతనం అందివాలని కార్మిక సంఘం నాయకుడు తలారి లింగం,ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, వార్డు సభ్యులు పంచాయతీ కార్మికులు, సంఘం అధ్యక్షులు తలారి లింగం, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్మికులు రాములు, బుదయ, శివమ్మ, లలిత, సాయమ్మ, మనమ్మ,లక్ష్మి, వెంకటేష్, సదుల్లా, కృష్ణ, సువర్ణ, నవీన్, నందు, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నేడు టీఎన్జీవో తాలూకా అధ్యక్షుడు జక్కుల శ్రీనివాసులకు ఘన సన్మానం.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,ఏప్రిల్,30,మెదక్ టుడే న్యూస్: టీఎన్జీవో షాద్‌నగర్ తాలూకా అధ్యక్షుడిగా ఎన్నికైన హెల్త్ ఎడ్యుకేటర్ జక్కుల శ్రీనివాసులకు సాయిబాబా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సాయిబాబా కాలనీలో, మే 1 (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు శివాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు మంగ శంకర్ (ASSG), సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి గ్రామ శ్రీనివాసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై జక్కుల శ్రీనివాసులను సన్మానించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

పదో తరగతి ఫలితాల్లో ‘వ్రిహా’ స్కూల్ ప్రభంజనం.. 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు!

0

టాపర్లకు నగదు పురస్కారాలు అందజేసిన ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ

అమీన్‌పూర్,ఏప్రిల్,30,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని వ్రిహా స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలను నమోదు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాఠశాల ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ ఫలితాల వివరాలను వెల్లడించారు.వంద శాతం విజయం:
ఈ ఏడాది వ్రిహా స్కూల్ నుండి 32 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను సాధించడం విశేషం. విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా ఛైర్మన్ పేర్కొన్నారు.ప్రతిభావంతులకు నగదు పురస్కారాలు,పాఠశాల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు యాజమాన్యం నగదు పురస్కారాలను అందజేసింది. వివరాలు ఇలా ఉన్నాయి:ప్రథమ స్థానం: అక్షిత (588/600) – రూ. 25,000 నగదు బహుమతి
ద్వితీయ స్థానం: హాసిని (586 మార్కులు) – రూ. 15,000 నగదు బహుమతి
తృతీయ స్థానం: శ్రేయ (580 మార్కులు) – రూ. 10,000 నగదు బహుమతి.ఘనంగా సన్మానం:
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. ప్రియబాంధవి, ప్రిన్సిపల్ జి. రాధిక, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నాణ్యమైన విద్యను అందిస్తూ మరిన్ని విజయాలు సాధిస్తామని పాఠశాల బృందం ధీమా వ్యక్తం చేసింది.

భక్తిశ్రద్ధలతో పెదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన చేయాలి: అమీన్‌పూర్ ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి.

0

గుమ్మడిదల,ఏప్రిల్,30,(మెదక్ టుడే)న్యూస్,ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పెదమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ అమీన్‌పూర్ సామక్క సారలమ్మ ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి కి ఆహ్వాన పత్రికను అందజేశారు. గురువారం నాడు కానుకుంట గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను కలిసి మే 8న జరిగే ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా నీలం భిక్షపతి మాట్లాడుతూ,గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం వల్ల ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు.
కానుకుంట గ్రామస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని కొనియాడారు.
మే 8వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన మరియు హవన కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమ వివరాలు:
కానుకుంటలో మే 6వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్నాయి. మే 8వ తేదీన ఉదయం విగ్రహ ప్రతిష్ఠాపన, హవనం, పూర్ణాహుతి మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కానుకుంట గ్రామ పెద్దలు, యువకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

0

చేగుంట,ఏప్రిల్,30,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో వడియారం మైనంపల్లి ఫంక్షన్ హాల్లో జరిగిన మ్యాకల రవి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చేగుంట మండల బి ర్ స్ పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి , జెడ్పిటిసి మొదాం శ్రీనివాస్, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, కొండాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి, కర్ణంపల్లి ఉప సర్పంచ్ శివ, మాజీ సర్పంచ్ పట్నం తనిషా, డిష్ రాజు, డాక్టర్ రమేష్, శ్రీకాంత్, రమేష్, సోమ సత్యనారాయణ, మహమ్మద్ అలీ, విశ్వేశ్వర్,ప్రజాప్రతినిధులు ఆశీర్వదించారు.

దత్తత అవగాహన కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,ఏప్రిల్,30,మెదక్ టుడే న్యూస్:
ఫరూక్‌నగర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం దత్తతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో బన్సీలాల్ హాజరయ్యారు. సీడీపీఓ ఉదయ మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయ, సంధ్యలు చట్టబద్ధ దత్తత ప్రక్రియ, అనధికార దత్తత వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. దత్తత తీసుకునే దంపతులు కనీసం రెండు సంవత్సరాలు కలిసి ఉండాలని, వారి వయస్సు పిల్లల వయస్సుకంటే కనీసం 25 సంవత్సరాలు ఎక్కువగా ఉండాలని తెలిపారు. ఒంటరి మహిళ ఏ వయస్సు పిల్లనైనా దత్తత తీసుకోవచ్చని, అయితే ఒంటరి పురుషుడు ఆడపిల్లను దత్తత తీసుకోవడం అనుమతించబడదని పేర్కొన్నారు. అలాగే దత్తత తీసుకునే వారి వయస్సు 25 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు.సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ, పిల్లలను దత్తతకు ఇచ్చే ముందు వారి సంరక్షణ, పోషణ, విద్య వంటి అంశాలను బాలల సంరక్షణ కేంద్రాలు సమగ్రంగా పరిశీలిస్తాయని చెప్పారు. కొందరు పిల్లలను తీసుకుని పోషించలేక ఇతరులకు అమ్మే ఘటనలు ఉన్నాయని, అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఆడపిల్లల్ని అక్రమంగా అమ్మే ఘటనలు ఉన్నాయని, అలాంటి విషయాలను వెంటనే 1098 హెల్ప్‌లైన్ లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చట్టవిరుద్ధంగా పిల్లల్ని కొనుగోలు చేయడం, అమ్మడం రెండూ నేరాలేనని, జువెనైల్ జస్టిస్ చట్టం సెక్షన్ 80, 81 ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తారని తెలిపారు.
ఎంపీడీవో బన్సీలాల్ మాట్లాడుతూ, హాస్పిటళ్లలో లేదా దళారుల ద్వారా పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా చట్టబద్ధంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, సీడీపీఓ ఉదయ, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాస్, ఏఈఓ జంగయ్య, రజియా సుల్తాన, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, విలేజ్ సెక్రటరీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

పుట్టినరోజు వేళ సామాజిక సేవ: బీరంగూడలో దండు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రం.

0

సేవా కార్యక్రమాలు అభినందనీయం – పటాన్‌చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్

అమీన్ పూర్,ఏప్రిల్,29,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి,అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ దండు రమేష్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని, సామాజిక బాధ్యతతో బీరంగూడ ఐక్యత హోమ్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,దండు రమేష్ యాదవ్ తన పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా, ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. పుట్టినరోజున ఇటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు రావడం ఆయనలోని సేవా గుణానికి నిదర్శనమని కొనియాడారు. రమేష్ యాదవ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, నిరంతరం ప్రజల మనిషిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.దండు రమేష్ యాదవ్ మాట్లాడుతూ,నా పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే చిన్న పని చేయాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించాను. బాటసారుల దాహార్తిని తీర్చడం నాకు ఎంతో తృప్తినిస్తోంది.””ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకుల సహకారం ఉంటే భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతాను. వేసవి ముగిసే వరకు ఈ చలివేంద్రం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరాయంగా అందిస్తాం.కాట శ్రీనివాస్ గౌడ్ స్వయంగా గ్లాసుతో బాటసారులకు మంచినీరు అందించి చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దండు రమేష్ యాదవ్‌కు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాజీ కౌన్సిలర్స్ లావణ్య, మున్నా, అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ శశిధర్ రెడ్డి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ సుధాకర్ యాదవ్, మన్నె రవీందర్, లక్ష్మణ్, నరేష్, సతీష్, శ్రీనివాస్, సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ మహిళలు,కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పదవ తరగతి ఫలితాల్లో సుంకు పావకి అద్భుత ప్రతిభశ్రీ వాణి విద్యా నికేతన్ పాఠశాలలో ప్రథమ స్థానం.

0

రామచంద్రాపురం,ఏప్రిల్,29,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో రామచంద్రాపురం నివాసి సుంకు పావకి విశిష్ట ప్రతిభ కనబరిచింది. రామచంద్రాపురంలోని పాత ఎం.ఐ.జి లో గల శ్రీ వాణి విద్యా నికేతన్ పాఠశాలలో చదువుతున్న ఈమె, 94.6 శాతం మార్కులతో ‘ఏ-1’ గ్రేడ్ సాధించి పాఠశాల స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.రామచంద్రాపురం వాసులైన శ్రీ సుంకు హరిబాబు, శ్రీమతి సుంకు లావణ్య దంపతుల కుమార్తె అయిన పావకి, తన క్రమశిక్షణ మరియు పట్టుదలతో ఈ ఘనత సాధించి తల్లిదండ్రులకు,పాఠశాలకు మరియు ఈ ప్రాంతానికి ఎనలేని కీర్తినితీసుకువచ్చింది.ఈసందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు తల్లిదండ్రులు మాట్లాడుతూ,పావకి మొదటి నుండి చదువులో ఎంతో చురుకుగా ఉండేదని, ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.తోటి విద్యార్థులకు పావకి విజయం ఒక గొప్ప స్ఫూర్తి అని, యువత ఇలాంటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈవిజయంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి మరియు తోడ్పాటు అందించిన తల్లిదండ్రులకుప్రత్యేకకృతజ్ఞతలుతెలియజేశారు.కుమారి సుంకు పావకి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆమె ఉన్నత చదువుల్లో కూడా ఇలాగే రాణించాలని స్థానికులు మరియు పాఠశాల సిబ్బంది మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఐకెపి ఆధ్వర్యంలో చిన్న వయసులో వివాహం నష్టాలపై అవగాహన కార్యక్రమం.

0

చేగుంట,ఏప్రిల్,28,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కిషోర బాలికల (స్నేహ) సంఘాల కిషోర బాలికలకు చిన్న వయసులో వివాహం నష్టాలు పై ఎంపీడీఓ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం- మానవహారం నిర్వహించడం జరిగింది. అక్కడికి వచ్చిన అధికారులు మాట్లాడుతూ,బాల్య వివాహం , బతుకు ఆగం
బాల్య వివాహాలు జరగకుండా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని 1098 చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ పై విస్తృత ప్రచార గ్రామాల్లో చేయాలి
18 సం బాలికల మరియు 21 సం బాలురు వివాహం చేసుకోవడం చట్ట రీత్యా నేరం, వివాహం లో పాల్గొన్న వారి పై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. బాల్య వివాహాలు జరగడానికి కారణాలు తొందర పాటు నిర్ణయాలు, సోషల్ మీడియా ప్రభావం, సహచరులు ఒత్తిడి, కుటుంబములో సంభాషణ లోపం వంటివి . శారీరకంగా మానసికంగా ఎదగని వయసులో వివాహాలు చేయడం ద్వారా గర్భాశయం ఎదగనందున పుట్టబోయే బిడ్డలు అనారోగ్యంతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నష్టాలు- చదువు మధ్యలో ఆగిపోవడము, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి , కుటుంబములో సమస్యలు, భవిష్యత్తు ప్రమాదంలో పడడం వంటివి భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం జరుగుతుంది చేయాల్సినవి – పేదలతొ మాట్లాడడం, కౌన్సిలింగ్ పొందడం, తొందర పాటు నిర్ణయాలు మానుకోవడo , బాల్య వివాహాలు జరగకుండా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి. 1098 చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ పై విస్తృత ప్రచార గ్రామాల్లో చేయాలి స్నేహ గ్రూప్( కిషోర్ బాలికలు గ్రూప్)- పిల్లలకు సహాయం చేసుకునే వేదికలు గా తీర్చిదిద్దుకోవడం ముఖ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్,ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, తాసిల్దార్ శివప్రసాద్,ఐకెపి ఎపిఎం, ఇజిఎస్ ఎపిఓ, హౌసింగ్ ఎఇ, హెల్త్ సూపర్వైజర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ లు, ఐకెపి సీసీలు, చేగుంట జిపి సిబ్బంది విఓఏ లు, అంగన్వాడీ టీచర్లు మరియు కిశోర బాలికలు పాల్గొన్నారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

0

పాపన్నపేట,ఏప్రిల్,28,మెదక్ టుడే న్యూస్:మద్యం మత్తులో క్షణికావేశంలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్ పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు.గ్రామానికి చెందిన కాగితాల జహంగీర్(39) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.గత కొన్ని రోజులుగా ప్రతి రోజు మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు.తాగుడుకు బానిస మారడంతో చిన్నపాటి అప్పులు పెరిగి అవి ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందుతున్నాడు.ఈ క్రమంలో సోమవారం రాత్రి సమయంలో మద్యం సేవించి ఓ దావత్ లో భోజనం చేసి ఇంటికి వచ్చాడు.రాత్రి ఇంటి బయటే నిద్రించాడు.మంగళవారం ఉదయం పొలం వద్ద ఉన్న ఓ చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని అటుగా వెళ్లిన స్థానికులకు కనిపించాడు.స్థానికులు కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తల్లి షాబేరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.