📄 ePaper
Sunday, September 20, 2026
ADS
HomeNewsమెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘo ఉపాధ్యక్షులుగా అఐత పరంజ్యోతి,

మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘo ఉపాధ్యక్షులుగా అఐత పరంజ్యోతి,

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులుఅఐత పరంజ్యోతి మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రోజున జిల్లా అధ్యక్షులు వల్లేర్ల రవీందర్ ఆదేశాలతో సిద్దిపేట వాస్తవులు మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంప శ్రీనివాస్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులుగా అఐత పరంజ్యోతిని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అయిత పరంజ్యోతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్త జిల్లా మాజీ అధ్యక్షు లు చంద్రపాల్ గుప్త, గంప శ్రీనివాస్ గుప్త అధ్యక్షులు రవీందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన అయిత పరంజ్యోతి కి చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, చేగుంట మాజీ ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి,మాజీ సొసైటీ చైర్మన్ ఇత రఘురాములు, చేగుంట ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్టాలిన్ నరసింహులు,ముజామిల్ , శ్రీనివాస్, వార్డు మెంబర్లు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular