📄 ePaper
Monday, September 21, 2026
ADS
HomeMedak SPపోలీస్ కార్యాలయంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.

పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.

📰 Generate e-Paper Clip

భక్తిశ్రద్ధలతో గణనాథునికి వీడ్కోలు

పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.రూ.29 వేలతో లడ్డూ సొంతం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ శంకర్.

మెదక్,సెప్టెంబర్,21,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన గణనాథునికి సోమవారం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని, పోలీస్ అధికారులు, సిబ్బంది చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతంగా సాగాలని మహాగణపతిని ప్రార్థించినట్లు ఎస్పీ తెలిపారు.అనంతరం నిర్వహించిన గణపతి లడ్డూ వేలంపాటలో హెడ్ కానిస్టేబుల్ శంకర్ రూ.29,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఏడు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనంలో భాగంగా ఎస్పీ శోభాయాత్రను ప్రారంభించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, ఆటపాటలతో గణనాథునికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ సందీప్ రెడ్డి, ఆర్‌ఐ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular