ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన 14 మంది పోలీసులకు ఘన నివాళులు
మెదక్,అక్టోబర్,21,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు.ఎస్పీ మాట్లాడుతూ.మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 14 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు.అనంతరం అమరవీరుల కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందజేసి, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

