చేగుంట,అక్టోబర్,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో జై దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.గ్రామానికి చెందిన చిన్నారి (బండారి రియా ) ప్రదర్శించిన భరతనాట్యం, శాస్త్రీయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. చిన్న వయసులోనే అద్భుతమైన హావభావాలు, నృత్య కౌశలంతో చేసిన ప్రదర్శనకు భక్తులు, గ్రామ పెద్దలు చప్పట్లతో ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని, యువతలో సాంస్కృతిక స్ఫూర్తిని నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వడియారం గ్రామంలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో చిన్నారి నృత్యం ఆకట్టుకుంది.

