ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.
పాపన్నపేట,నవంబర్,1 మెదక్ టుడే న్యూస్:మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకను ఆదివారం పాపన్నపేట మండల కేంద్రంలో హస్తం శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రధాన చౌరస్తా సమీపంలో కేకు కట్ చేశారు.అనంతరం పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్,సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు వెంకటేశం,సర్పంచులు పావని,రాణేమ్మ,స్వప్న,విజయదుర్గా,సుశీల,అంజయ్య, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు ముశెట్టి కిష్టయ్య, గోవింద్ నాయక్,ఖలీమ్,సంగమేశ్వర్ ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.



